Oke Kutumbham (1970)

చిత్రం: ఒకే కుటుంబం (1970)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, లక్ష్మీ, కాంతారావు
దర్శకత్వం: ఏ.భీమ్ సింగ్
నిర్మాతలు: సి. హెచ్.రాఘవరావు, కె.బసవయ్య
విడుదల తేది: 25.12.1970

పల్లవి:
అందరికీ ఒక్కడే దేవుడు
అందరికీ ఒక్కడే దేవుడు

కొందరికి రహీము.. కొందరికి రాముడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు

ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే… దేవుడొక్కడే
అందరికీ ఒక్కడే దేవుడు

చరణం: 1
పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు

రేకులు ఉంటేనే పువ్వంటాము… రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా… మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు

చరణం: 2
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు

ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవసేవ… బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు

చరణం: 3
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు

స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము… శ్రమజీవుల కష్టఫలం ఇప్పిస్తాము
స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము… శ్రమజీవుల కష్టఫలం ఇప్పిస్తాము

అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం… లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము.. కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు

error: Content is protected !!