చిత్రం: ఒక్కమగాడు (2008)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , అనుష్క శెట్టి, సిమ్రాన్, నిషా కొఠారి
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాత: వై. వి.యస్. చౌదరి
విడుదల తేది: 11.01.2008
చిత్రం: ఒక్కమగాడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రీటా, భార్గవి
పల్లవి:
ఒక్కమగాడు… ఓ ఒక్కమగాడు – ఒక్కమగాడు
కౄరాతికౄరంగా వేటాడే సింహం – ఒక్కమగాడు
వాడేవీడు వీడేవాడు నాకున్న ఏకైక శత్రువుగాడు
రానేరాడు వస్తేపోడు నాపైకి దూకేటి మృత్యువుగాడు
శక్తి యుక్తి శౌర్యం కలబోసిన రూపం వీడు
శివుడు విష్ణువు కాదు ఆ బ్రహ్మకు అర్ధం కాడు
ఒక్కమగాడు ఒక్కమగాడు ఒక్కమగాడు
చరణం: 1
భీభత్సాలు తెలిసినోడు భక్తి భయము తెలియనోడు
ఉన్నాడొకడు డు డు డు – ఒక్కమగాడు
దిగ్గారాలు కలిగినోడు దిక్కులు దాటి నిక్కినోడు
ఎవడుంటాడు డు డు డు – ఒక్కమగాడు
వీడే వీడే వీడే చండశాసనుడు
వీడే వీడని వీడక సాగిన అణుచరుడు
హృదయం లేని ఆయుధం వీడు
నరకం లోని ఆశ్రయం వీడు
ఉన్మాదం క్రోధం గర్వం వైరం అన్నిటికర్ధం వీడు
ఒక్కమగాడు… ఒక్కమగాడు ఒక్కమగాడు
చరణం: 2
ఒకటో వాడు మంచివాడు రెండోవాడు చెడ్డవాడు
రెండు కాదు డు డు డు – ఒక్కమగాడు
మనసుకు మీసమొచ్చినోడు మరణంతోటి ఆటగాడు
ఇంకా ఎవడు డు డు డు – ఒక్కమగాడు
వీడే వీడే వీడే ప్రతినాయకుడు
ఏదో ఏదో ఏదో పరిశోధకుడు
ప్రజలే లేని ప్రపంచం వీడు
ప్రాణాలున్నా శ్మశానం వీడు
గుణగణములు అన్నీ తేడా గనుకే గాఢంగా నచ్చాడు
ఒక్కమగాడు
కౄరాతికౄరంగా వేటాడే సింహం – ఒక్కమగాడు
వాడేవీడు వీడేవాడు నాకున్న ఏకైక శత్రువుగాడు
రానేరాడు వస్తేపోడు నాపైకి దూకేటి మృత్యువుగాడు
శక్తి యుక్తి శౌర్యం కలబోసిన రూపం వీడు
శివుడు విష్ణువు కాదు ఆ బ్రహ్మకు అర్ధం కాడు
చిత్రం: ఒక్కమగాడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ యేసుదాసు, రంజిత్
పల్లవి:
దేవా దేవా దేవదా దేవాది దేవా దేవదా
మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే
మమతకే దాసుడివా సత్యసంహయ విద్మహే
జనుల కనులలో కొలువు తీరినా వరముల రూపం నువ్వా
ప్రజల పెదవులే కలవరించిన ప్రార్ధన గీతం నీవా
దేవాది దేవా దేవాదిదేవా
దేవాది దేవా అందరి దేవా వందనం వందనం
దేవాది దేవా అందరి దేవా వందనం వందనం
అందరి దేవా అందిన దేవా వందనం వందనం
దేవాది దేవా అందరి దేవా వందనం వందనం
మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే
మమతకే దాసుడివా సత్యసంహయ విద్మహే
చరణం: 1
శంఖ చక్రములు లేకున్నా శాంతి సహనముంది
చతుర్భుజములు లేకున్నా చేయూత గుణమునీది
పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా
ఖడ్గాల పదును గల వీరత్వం
కన్నాము విన్నాము అందరం
కన్నీరు తుడుచు నీ అమ్మతనం
పొందేందుకయ్యాము పిల్లలం
గుడినే వదిలి గుండెను చేరిన దేవా
దేవాది దేవా దేవాదిదేవా
దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం
అందరి దేవా అందినదేవా వందనం వందనం
మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే
మమతకే దాసుడివా సత్యసంహయ విద్మహే
చరణం: 2
మంచి మనిషిగా బ్రతికేస్తే బాధలేదు మనకు
మానవత్వమును కతికిస్తే దైవమెందుకొరకు
అన్నది నాలో భావనా ఉన్నదిగా మీ దీవెనా
మదిలోని మాటనే చెబుతున్నా ఆనందభాష్పాల సాక్షిగా
మరిదేవుడంటు ఇక ఎపుడైనా చూడొద్దు నన్నింకా వేరుగా
మీలాంటోడిని మీలో ఒకడిని కానా
దేవుడే మానవుడై దరిచేరగా మనవాడై
దేవాధిదేవా అందరి దేవా వందనం వందనం
దేవాధిదేవా అందరి దేవా వందనం వందనం
చిత్రం: ఒక్కమగాడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: నవీన్, అనుష్క
పల్లవి:
అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా
ఎవరితో చెప్పుకున్నా కాస్కో తడాకా
అన్నతో చెప్పుకున్నా బావతో చెప్పుకున్నా
ఎవరితో చెప్పుకున్నా చూస్కో ధమాకా
పైట పైపైనా అందమే పొంగుతున్నా
లోన లోలోనా అలజడే అణుచుకున్నా
తపించే చిన్నవాడిని తెగించే పెద్దవాడిని
తరించే తప్పు చెయ్యనా …
అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా
ఎవరితో చెప్పుకున్నా కాస్కో తడాకా
చరణం: 1
ఒకచోట అంటూనే మరుచోట చెయ్యేస్తాడే
చెయ్యేసి పొరపాటు చేసేస్తాడే
ఒకసారి అంటూనే పలుసార్లు ముద్దిస్తాడే
ప్రతిసారి పొలిమేర దాటేస్తాడే
పోనా సరిపోనా పూర్తిగా రెచ్చిపోనా
చాలా నచ్చానా కొద్దిగా రెచ్చిపోరా
నిజంగా మంచివాడిని ప్రియంగా పిచ్చివాడిని
స్ధిరంగా చిచ్చురేపనా…
బావతో చెప్పుకున్నా డాడీతో చెప్పుకున్నా
బావతో చెప్పుకున్నా డాడీతో చెప్పుకున్నా
నీ తల్లే నీ అప్పో నీ మమ్మీ నీ డాడీ
చరణం: 2
కూర్చున్నా నిలుచున్నా పడుకున్నా ఏం చేస్తున్నా
వాటేసి నా ప్రేమ నాటేస్తానే
గుబులైనా దిగులైనా తెగులైనా ఏ బాదైనా
గురిచూసి మురపాల మందేస్తానే
న్నా న్నా న్న న్న నా అంతగా వేడుకున్నా
అవునా అవునవునా అందుకే వేచివున్నా
మరి నే చిన్నపాపని వరిస్తే పెద్దపాపని
మూడేస్తే పాపనివ్వనా…
అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా
ఎవరితో చెప్పుకున్నా కాస్కో తడాకా
అన్నతో చెప్పుకున్నా బావతో చెప్పుకున్నా
ఎవరితో చెప్పుకున్నా చూస్కో ధమాకా
చిత్రం: ఒక్కమగాడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్, జే
పల్లవి:
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ
అమ్మో అమ్మాయి అన్నీ ఉన్నాయి
అందాలు ఊరిస్తుంటే దారిస్తుంటే
ఆహ – ఓహొ
ఆహా – ఓహొ – అనకిక
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ
అబ్బో అబ్బాయి నావన్నీ నీవోయి
అందంగా రాజేస్తుంటే కాజేస్తుంటే
ఛీ ఛీ – ఓహొ
ఛీ ఛీ – ఓహొ – అననిక
చరణం: 1
కన్నెజాజి పువ్వా క గుణితమేదో చప్పవా
కోకా కేకా కగిలి కం కహ …
జామురేయి రావా జ గుణితమేదో చెప్పవా
జాన జోడి జోరుగా జుం జహ
గుణమేదో తెలిసి ఈ గుణింతాలలో
అణువణువు మెరిసే నీ అజంతాలలో
సందు కుదిరాకా సమానం సంధి కలిసాకా
అమాంతం రాసుకోనా ఆడకులుకుల పలకలపై
అ ఆ ఇ ఈ – ఉ ఊ ఏ
అ ఆ ఇ ఈ – ఉ ఊ ఏ
చరణం: 2
ఒక్కటయ్యేచోట నా సంతకాలే చెయ్యనా
చేస్తే చేస్కో ముందుగా అడక్కు
పక్కలో ప్రతిపూట ఆ కవితలన్నీ రాయనా
రాస్తే రాస్కో మధ్యలో ఆపకు
గురువంటూ లేని ఈ పాఠాలలో
విసుగంటు రాని విన్యాసాలలో
నేర్చుకున్నాకా సమస్యే తీర్చుకున్నాకా
సహాయం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మొదలెట్టు
అ ఆ ఇ ఈ – ఉ ఊ ఏ
అ ఆ ఇ ఈ – ఉ ఊ ఏ
అమ్మో అమ్మాయి అన్నీ ఉన్నాయి
అందాలు ఊరిస్తుంటే దారిస్తుంటే
ఆహ – ఓహొ
ఆహా – ఓహొ – అనకిక
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ
అబ్బో అబ్బాయి నావన్నీ నీవోయి
అందంగా రాజేస్తుంటే కాజేస్తుంటే
ఛీ ఛీ – ఓహొ
ఛీ ఛీ – ఓహొ – అననిక
చిత్రం: ఒక్కమగాడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మల్లికార్జున్, రీటా
పల్లవి:
కురులలో కుసుమమై గళములో హారమై
పరువానికి పసుపూ కుంకుమై
ఆడతనానికి అయిదో తనమై
నునుపాలించగ నడిచి వచ్చితివో
నను దీవించగ దరికి చేరితివో
నీ జాలికి నీ కరుణకీ ఆశీస్సుకి అభయానికి
నాకై కదిలిన నీ పాదాలకి
ధన్యవాదాలు… ధన్యవాదాలు…
నా జన్మ ధన్యవాదాలు
నునుపాలించగ నడిచి వచ్చితివో
నను దీవించగ దరికి చేరితివో
చరణం: 1
మనసా స్మరామి శిరసా నమామి
వచసా ధృనామి ఓ… ఓ…
నీ సన్నిధిలో పొంగిన వేళ గంగనై
నీ సాయమునకు ముగిసిన వేళ యముననై
నీ అంతతంగములో ఎగసే తరంగమునై
నిలిచే సరస్వతినై
ఆ నీటిపూవుతో పన్నీటిపూలతో
ధన్యవాదాలు… ధన్యవాదాలు…
నునుపాలించగ నడిచి వచ్చితివో
నను దీవించగ దరికి చేరితివో
చరణం: 2
నీకై చూసేవేళ నా మనసు కనులలో ఉంటుంది
నిన్నే పిలిచే వేళ నా మనసు పెదవిలో ఉంటుంది
నీకై నడిచే వేళ నా మనసు అడుగులో ఉంటుంది
నిన్నే చేరిన వేళ నా మనసు మనసులో ఉంటుంది
మనసైన నీకు నీలోని నాకు
ధన్యవాదాలు… ధన్యవాదాలు…
చరణం: 3
నిను పాలించగ నడిచి వచ్చితిని
నిను పూజించగ పతినై చేరితినీ
నీ చెలిమికి సుగుణాలకి ఈనాటికి ఏనాటికి
నాపై పెట్టిన నీ ప్రాణాలకు
ధన్యవాదాలు… ధన్యవాదాలు…
ప్రతి జన్మ ధన్యవాదాలు
నా జన్మ ధన్యవాదాలు
ప్రతి జన్మ ధన్యవాదాలు
మనసా స్మరామి శిరసా నమామి
వచసా ధృనామి ఓ… ఓ…
మనసా స్మరామి శిరసానవామి
వచసా ధృనామి ఓ… ఓ…
చిత్రం: ఒక్కమగాడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రీటా
పల్లవి:
రేయ్ క్యాబే సాలా నీ జిమ్మడ తూ తెరి
తననైనన… తననైనన… తననైనన…
తననైనన… తననైనన… తననైనన…
రేయ్ నీయబ్బ క్యాబే సాలా రేరేరేయ్
నా దెబ్బ చూపించాలా రేరేరేయ్
నచ్చావు నాకే సచ్చినోడా
నమ్మాలి నన్నే తిమ్మిరోడా
లొంగాలి నాకే తింగరోడా
ఇట్టాగే తిట్టిన తిట్టు తిట్టాకుండ
తిట్టుతానే రేయ్
నీయబ్బ క్యాబే సాలా రేరేరేయ్
నా దెబ్బ చూపించాలా రేరేరేయ్
నచ్చావు నాకే సచ్చినోడా
నమ్మాలి నన్నే తిమ్మిరోడా
లొంగాలి నాకే తింగరోడా
ఇట్టాగే తిట్టిన తిట్టు తిట్టాకుండ
తిట్టుతానే రేయ్ రేయ్
చరణం: 1
స్నేహంలోన సన్మార్గుడా సరసంలోన దుర్మార్గుడా ఓ… పొద్దున్నేమొ పరమాత్ముడా రాత్రుల్లోన రాకాసుడా
కురులతో కొట్టి కుదిపేస్తా రెరెరే
నడుముతో పట్టి పడదోస్తా యెదతో కొట్టి ఎగరేస్తా
ఇట్టాగే కొట్టిన చోట కొట్టకుండా కొట్టుతాను రేయ్…
నీయబ్బ క్యాబే సాలా రేరేరేయ్
నా దెబ్బ చూపించాలా రేరేరేయ్
చరణం: 2
రూపం చూస్తే పుణ్యాత్ముడా తాపం వస్తే పాపాత్ముడా ఓ… ఓ… ప్రేమించేస్తే బలహీనుడా పేచికొస్తే బలవంతుడా బలమును పట్టి కొలిచేస్తా రెరెరేయ్
ఉడుమును పట్టి ఉతికేస్తా పొగరునుపట్టి పిండేస్తా
ఇట్టాగే పట్టిన పట్టు పట్టకుండా పట్టుతాను రేయ్
నీ యబ్బక్యాబే సాలా రేరేరేయ్
నా దెబ్బ చూపించాలా రేరేరేయ్
చిత్రం: ఒక్కమగాడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
తాండిగ తాండిగ తక్
తద్దిన్న తద్దిన్న తై
తాండిగ తాండిగ తక్
తద్దిన్న తద్దిన్న తై
తాండిగ తాండిగ తక్
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
పట్టుకో గుట్టుగ కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టి చీర
ఆ పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
అ పట్టుకో గుట్టుగ కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టిచీర
సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదానా – ఏం ఎందుకు
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర
అ పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర
సిగ్గులేలా చిన్నవాడా నీలోని మేములేమా…
ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలాచుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నాగళ్ళ చీర…
చరణం: 1
గుమ్మంలో రెండు తలుపులు – ఆహా
గడియారంలో రెండు ముల్లులు – అబ్బో
నీకు మాత్రం ఒక్కరిలా ఇద్దరున్నా చూడవేలా
కొమ్మల్లో రెండుపిందెలు – ఓహో
అరెకోనెట్లో రెండు బిందెలు – ఊ
రెండు ఒకటి అయిన వేళ ఒక్కపనికి ఇద్దరేలా
బొమ్మతోటి బొరుసుకూడ ఉంది చూసుకో – ఓ
కన్నెభామ అద్దరెత్తుకున్న కాసు తీసుకో – అట్లాగే
కొత్త కొత్త దారిలోన పొద్దుపోరిచేరుకుంటే
చిత్తుబొత్తు ఆడేసుకుంటానహే – ఆడుకో మరి
అరె పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలాచుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నాగళ్ళ చీర…
చరణం: 2
సొంతమవుతా సోమవారం – ఓ యస్
మంత్రమేస్తా మంగళారం – ఓకే
రెండు రోజులు ఈడ ఉంటా మూడో రోజు ఆడకెళ్తా
బుజ్జగిస్తా బుధవారం – అహా చా
ఈడు గుమ్మరిస్తా గురువారం – టీకే
శుక్రవారం శెలవు పెడతా శనివారానికి సిద్ధమవుతా
ఆదివారమిద్దరొస్తే అంతచూడరో – ఓ…
ఆడవాళ్ళ హింగులోన హాయి ఉందిరో- క్యాబాత్‌హై
ఒక్కసారి ఇద్దరొచ్చి ముగ్గులోన ముగ్గురుంటే
తప్పకుండ దీని పేరు త్రికోణమే – మజా ఏగా…
అరె పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
పట్టుకో గుట్టుగ కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టి చీర
సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదానా
హే పట్టుకో – ఓహో హో
పట్టుకో – దింతలకిడి – పట్టుచీర
హే చుట్టుకో – ఓ
కప్పుకో – ఓ
నీ కళ్ళు నాగళ్ళ చీర – ఓ…
సిగ్గులేలా చిన్నవాడా నీలోని మేములేమా