• About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
Home Movie Albums

Om Namo Venkatesaya (2017)

A A
14
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Pinterest

MoreLyrics

Komuram Bheemudo Song Lyrics

Komma Uyyala Song Lyrics

Etthara Jenda Song Lyrics

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: సాకేత్
నటీనటులు: నాగార్జున, అనుష్క
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: ఏ.మహేష్ రెడ్డి
విడుదల తేది: 10.02.2017

మహా పద్మ సద్మే
మహా దేవి పద్మే
మహా పద్మ గాత్రే
మహా పద్మ నేత్రే
మహా మాతృ తత్వ ప్రపూర్ణాంతరంగే
మహాలక్షి మాం పాహి అలమేలుమంగే
ఆఆఆఆ
మహా భక్త వంద్యే
మహా సత్య సంద్యే
మహా మంత్ర మాన్యే
మహా శ్రీవధాన్యే
మహా విశ్వ మాంగల్య భాగ్య ప్రపూర్ణే
మహాలక్షి మాం పాహి అలమేలుమంగే అలమేలుమంగే…

**********  *********    **********

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: శ్రీనిధి

బ్రహ్మోత్సవ బ్రహ్మానందము నీకా
బండెడు బాధలు నీ భక్తునికా
ధగ ధగ ధగ  ధగ ధగద్దగిత
సద్ధర్మల సద్బ్రహ్మాండ నాయకా
నిగ నిగ నిగ నిజ రక్తి నిష్యంద
భక్తి భవబంధ ముక్తి దాయక
కఠోర దంష్ట్రాల కన్నెర్ర జేసి
కాల కోట కీలికల గుప్పించి
బుస బుస బుసమని బుసలు కొట్టి
పదివేల పగడాల పడగలెత్తు
తొలి శేష వాహనముపై
సర్వ శేషివై చేరక
సత్య నిరూపణ చేయక

బ్రహ్మోత్సవ బ్రహ్మానందము నీకా
ఈ బండెడు బాధలు భక్తునికా

ఝమ్ ఝమ్ ఝమ్ రవ జంజా మారుత
జగద్విలయ జంకార హుంకార
సుండాదండోద్దండ చండ
బహు బాహు దండ పరి మండిత
హనుమద్వాహానమునెక్కిరా
అనుమానాలను తీర్చరా

ధగ ధగ ధగ  ధగ ధగద్దగిత
సద్ధర్మల సద్బ్రహ్మాండ నాయకా
నిగ నిగ నిగ నిజ రక్తి నిష్యంద
భక్తి భవబంధ ముక్తి దాయకా
గర్జించి జూలు విదిలించి విజృంభించి
మృగములను నిర్చించి నిజము నిగ్గు తేల్ప
వరసింహ వాహనమున అధీష్టించి
నరసింహుడవై చెలరేగెరా
పట పట పటమని దిక్కులు పగలగ
పగతురుల్ పట్టి మట్టు బెట్టగా
పరమ భయంకర ఘోర ఘీంకారా
ప్రకృతి లయంకర పడ గట్టణముల
గజావాహణమున కదలిరా…

ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ

ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ

ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ

ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ

*********   *********   *********

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: యమ్.యమ్.కీరవాణి

బ్రహ్మాండ భాండముల బల్ సొభగుల
బంతులాడు భగవంతుడు
పరమానంద మహా ప్రవాహముల
పరవశించు పరంధాముడు
కనివిని ఎరుగని విధముగ
కలియుగ దేవుడు అలసినాడు
ప్రతి చిత్రముగా తన భక్తునితో
ఆటలాడగా తరలాడు
ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…

*********   *********    *********

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: ధనుంజయ, శ్రీనిధి

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

భృగు ముని పూజిత గోవిందా
భూమి యజ్ఞ ఫల గోవిందా
వికుంఠ విరక్త గోవిందా
వెంకట గిరి హిత గోవిందా

వాల్మీక సుక్త గోవిందా
గోక్షీర తృప్త గోవిందా
గోపాల ఘటిత గోవిందా
వకుళా వర్ధిత గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

మృగయా వినోద గోవిందా
మధ గజ మధ హర గోవిందా
పద్మా ప్రేమిక గోవిందా
పరినయోత్సుక గోవిందా

కుబేర కృపార్ధ్ర గోవిందా
గురుతర ఋణయుత గోవిందా
కల్యాణ ప్రియా గోవిందా…
కల్యాణ ప్రియా గోవిందా
కలియుగ రసమయ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

శ్రీ శైలేష గోవిందా
శేష శైలేష  గోవిందా
శ్రీ శైలేష గోవిందా
శేష శైలేష  గోవిందా
శ్రీ గరుడనిలయ గోవిందా
శ్రీ వెంకటవర గోవిందా

నారాయణాద్రి గోవిందా
వృషభాద్రిశ గోవిందా
వృష పర్వతేశ గోవిందా
సప్త శైలేష గోవిందా

సుప్రభాత రస గోవిందా
విశ్వరూప విభు గోవిందా
తోమాల రుచిర గోవిందా
నిత్య కల్యాణ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

గోవిందా గోవిందా (2)

రధసప్తమి రధ గోవిందా
తెప్పోత్సవ హిత గోవిందా
ఆరు వేటపటు గోవిందా
ప్రణయకలహ చటు గోవిందా

పుష్పయాగ యుగ గోవిందా…
పుణ్య ప్రపూర్ణ గోవిందా…
ఉత్సవోత్సుక గోవిందా…
ఊహాతీత గోవిందా…

బహుసేవా ప్రియ గోవిందా
భవ భయ భంజన గోవిందా
ప్రభాది సేవిత గోవిందా
బ్రహ్మోత్సవ నవ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోవిందా గిరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా

***********   **********  *********

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: శరత్ సంతోష్ , శ్రీనిధి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా
గోవిందా గోవిందా పువ్వు పున్నమివెన్నెల్ల గోవిందా
గోవిందా గోవిందా చిన్ని తోమాల సేవల గోవిందా
గోవిందా గోవిందా…
వినా వేంకటేశం ననాతో ననాత
సదా వేంకటేశం స్మరామి స్మరామి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా

శ్రీ వేంకటేశ శ్రీత సంవంద
సేవా భాగ్యం దేహి ముకుంద

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా

తిరుపదములకు తిరువడి రండను
శ్రీ భూ సతులకు సిరి హారములు
తిరుపదములకు తిరువడి రండను
శ్రీ భూ సతులకు సిరి హారములు

ఆకళంక శంఖ చక్రాలకు
అపురూప కుసుమమాలికలు
ఆజానుబాహుపర్యంతము
అలరుల తావళ హారములు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా

మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు
చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు
కలువలు కమలాలు కనకాంబరాలు
పొన్నా పొగడ మొల్ల మొగలి గులాబీలు
మరువం దవనం మావి మాచి
వట్టి వేరు కురువేరులు
గరుడ గన్నేరు నందివర్ధనాలు
హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు
నీకోసం విరిసే నిను చూసి మురిసే
నీ మేను తాకి మెరిసే…

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా

*********   *********   **********

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: యస్. పి. బాలు, శ్రీనిధి, రమ్యా బెహ్రా

కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై వెలసినాడు శ్రీహరీ

కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై వెలసినాడు శ్రీహరీ

బ్రహ్మలోకమున వీణా నాధ లోలుడైన
ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను
పూజార్హత లేకుండునట్లు శపించెను
కైలాసమున కామ తాండవమున మునిగితేలు
శివపార్వతులను జూసి శివమెత్తెను భృగువు

అంగనా లోళుడా
ఇక నీకు లింగ పూజయే జరుగుగాక
ఓం నమో నారాయనాయ
ఓం నమో నారాయనాయ
వైకుంఠమున విష్ణు వైభోగము గాంచి ఎగసి
లక్ష్మీ నివాసమౌ హరి ఎదపై తన్నెను
మహాపరాధము చేసితి మన్నింపుము
నీ పాద సేవా భాగ్యము ప్రసాధింపుము
అని భృగుపదముల నదిమెను
అజ్ఞాన నేత్రమును చిదిమెను

ఈ అవమానమును నేను భరింపలేను
భృగుపాదము సోకిన నీ ఎదను నిలువజాలను
అని చిటపట లాడుచు సిరి హరిని వీడెను
శ్రీ సతి విరహితుడై
శ్రీ వైకుంఠ విరక్తుడై
ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను
ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను

గోవింద  గోవింద గోవింద (4)

హరి పాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయెను

కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై శ్రీనివాసుడాయె హరీ

గోవిందా – గోవింద (3)

పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు
లక్ష్మీ , లక్ష్మీ అని పరితపించెను
హారుడు అజుడు
హారుడు అజుడు  ఆవు దూడలుగా మారగా
క్షితి పతి పై క్షీర ధార కురిసెను
గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను
అడ్డుకున్న పరమాత్ముడి పసిడి నుదురు పగిలెను

కాలమంతా ఎదురుచూసి
కనులు కాయలు కాచెనయ్యా
కన్నయ్యా
కాలమంతా ఎదురుచూసి
కనులు కాయలు కాచెనయ్యా
నా కలలు పండగా
నా కలలు పండగ అమ్మా  యని పిలువ రావయ్యా
పిలువ రావయ్యా

శ్రీనివాసుడే వకుళకు చిన్ని కృష్ణుడై తోచెను
వకుళ మాతృత్వపు మధురిమతో సేదతీర్చెను

కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరి గోవిందుడాయె శ్రీహరీ
గోవిందుడాయె శ్రీహరీ
గోవిందా – గోవింద

ఆకాశ రాజపుత్రికా
అసమ సౌందర్య వల్లిక
అరవిరి నగవుల అలరులు కురియుచు
ఆటలాడుతూ ఉండగా
మత్తగజము తరిమెను
బేల మనసు బెదెరెను
వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను
గతజన్మల అనుబంధాలేవో రాగవీణలుగ మ్రోగెను
అనురాగ రంజితములాయెను

వడ్డికాసులిస్తానని కుబేరుణ్ణి వప్పించి
అప్పు చేసి పెండ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు
అంగరంగ వైభవమున అఖిలలోక సమక్షమున
పద్మావతి పతి ఆయెను పరంధాముడు
సకల సురలు గార్వింపగ
శ్రీదేవిని భూదేవిని ఎదను నిలుపు కున్నాడు వెంకటేషుడు
ఆపదమొక్కులవాడై…
అభయములిచ్చెడివాడై…
ఆపదమొక్కులవాడై అభయములిచ్చెడివాడై
సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు
గోవింద గోవింద గోవింద …
గోవిందా – గోవింద …

**********   *********  **********

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: శరత్ సంతోష్ , శ్వేతా పండిట్

ఆనందం ఎంతో ఆనందం
ఎంతో ఆనందం ఆనందం
ఎంతో ఆనందం ఎంతో ఆనందం
అమ్మాయల్లె పుట్టడమన్నది చాలా ఆనందం
అందంగానే ఎదగడమన్నది ఇంకా ఆనందం
అందాలన్ని అమ్మాయైతే చాలా ఆనందం
ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం
ఆశలు దీర్చే అతగాడొస్తే అతగాడే నా జతగాడైతే
చిన్న ఆనందం
కాదు అది చిన్మయనందం
చిట్టి ఆనందం
కాదు అది సృష్టి ఆనందం
కాస్త ఆనందం కాదు అది శాశ్వత ఆనందం

ఎంతో ఆనందం ఎంతో ఆనందం
ఆనందం

ఒకసారైనా నువు కనబడితే నయనానందం
ఒకమాటైనా పలికావంటే శ్రవణానందం
ఒక అడుగైనా నాతో వేస్తే అంతా ఆనందం
ఒక లేఖైనా నాకే రాస్తే అఖిలానందం
లేఖలు అన్నీ శుభలేఖలైతే
అడుగులు అన్నీ ఏడడుగులైతే

చిన్న ఆనందం
కాదు అది చిన్మయనందం
చిట్టి ఆనందం
కాదు అది సృష్టి ఆనందం
పై పై ఆనందం కాదు అది పవిత్ర ఆనందం

సిగలో పూలే పిలుపందిస్తే పుస్పానందం
గదిలో పొగలే గంతులు వేస్తే ధూపానందం
పెదవులు కలిసి ముద్దై పోతే శబ్ధానందం
నిదరే కానీ నిదరే పోతే శయనానందం
ఒకరికి ఒకరే గురువై పోతే
ఒడి ఒడి వోలే ఒకటైపోతే

చిన్న ఆనందం
కాదు అది చిన్మయనందం
చిట్టి ఆనందం
కాదు అది సృష్టి ఆనందం
అలౌకికానందం అది అద్వైతానందం

ఆనందం ఎంతో ఆనందం
ఎంతో ఆనందం ఆనందం
అంతా ఆనందం అంతా ఆనందం

***********   **********   *********

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: రేవంత్ , సునీత

నిచ్చలా… చంచలా…
వయ్యారి కలహంసికల మధురోహలా
ఉయ్యాలపై ఊర్వశిలా హాలా చంచలా
మనసే శ్రీ రాగంలా  వినిపించే ఈ వేళా
ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా

ధీమ్ తననననా
ధింతన నననా
దినననా…

రతీ మధనలీల సరోవర గబీర నాభీస్థలా
నీ నడుమునకలంకరిస్తున్న నవరత్న మణివే కళా
నీ అంతరంగ రంగత్తరంగ గంగా స్రవంతి గాంచి
చలించి పోయినదిలా – ఎలా
ఈ యదః పూర్వ నిచ్చలా
కలయే ఓ యోగంలా
కనిపించే ఈ వేళా

ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా

జల జలాల శిత శంక సంకాస మృదుల కంఠస్థలా
నీ గళమున కలంకరిస్తున్నా ముత్యాల కంఠమాలా
నీ చిచ్చర రోహా సహస్త్ర దళకమల సౌరభముల గాంచి
చలించి పోయినదిలా
ఈ యదః పూర్వ నిచ్చలా
వలపే ఓ యాగంలా
అనిపించే ఈ వేళా

ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా

********   *********    *********

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం: యస్. పి. బాలు

కమనీయం కడు రమణీయం
శ్రీ వెంకటేశ్వర కళ్యాణం
కమనీయం కడు రమణీయం
శ్రీ వెంకటేశ్వర కళ్యాణం
ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా
పాలించు భువనమ్మే భూదేవిగా
కమనీయం కడు రమణీయం
శ్రీ వెంకటేశ్వర కళ్యాణం

లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా
చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం
సిరుల అలివేణికి మరుల పూబోనికి
కట్టవయ్య స్వామీ దీక్షా కంకణం
అదియే పెళ్ళికి అంకురార్పణం

కమనీయం కడు రమణీయం
శ్రీ వెంకటేశ్వర కళ్యాణం

అటుకులు తేనేయు కలిపి
అనురాగము రంగరించి
అటుకులు తేనేయు కలిపి
అనురాగము రంగరించి
పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే
అన్నుల మిన్నల ముద్దుకు నేడు
అలమటించు స్వామి పెదవి తీపి చేయరే
రెండు నిండు చందమామలు
ఎదుట నున్న సమయం
స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం
తాళలేని తహ తహాలు తలపు దాటి తొంగి చూడా
తనకు తానే జారిపోయే తెర చేలము
తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం

ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయా
అప్పనై ఈ నాడు అప్పగించేనయా
లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా…
స్వామి  లోకల కప్పడగు వెంకటాద్రీషుడ
లోకువా చేయకు ఇంటి ఇంతులను
సృష్టి రక్షణలోనే దృష్టి సాగించకా
ఇష్ట సఖులను కూడ ఇంపుగా చూడవయ్యా
ఇంపుగా చూడవయ్యా

Tags: 2017Anushka ShettyK. Raghavendra RaoM. M. KeeravaniNagarjuna AkkineniOm Namo Venkatesaya
Previous Lyric

Peddannayya (1997)

Next Lyric

Vamsodharakudu (2000)

Next Lyric
vamsodharakudu 2000 movie songs

Vamsodharakudu (2000)

Comments 14

  1. gandivalsa manikanta says:
    1 year ago

    the best song and my favourite songs

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Fan Page👍

A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
No Result
View All Result
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In