చిత్రం: ఒంటరి పోరాటం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: వెంకటేష్ , జయసుధ , శ్వేత, రూపిణి, మోహన్ బాబు
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: డి. వి.యస్.యస్.ప్రసాద్
విడుదల తేది: 18.05.1989
పల్లవి:
పెదవి మీద ముద్దు – ప్రేమకొద్ది దిద్దు
బుగ్గ మీద ముద్దు – సిగ్గులన్ని రద్దు
హొయ్ హొయ్ హొయ్ హోయ్…
గోటితోటి కథలు రాశనే
నేను ఒంటిగాక ఎదలు మోసెనే
చూపుతోనే చురుకు పుట్టెనే
చాలకి పెడవిలోనే చెరకు పండెనే
అదేమిటో కథేమిటో భరించలేని అల్లారాయె
కన్నె సొగసు కందిపోయెనే
పెదవి మీద ముద్దు – ప్రేమకొద్ది దిద్దు
చరణం: 1
పదారేళ్ళకే పెదాలెందుకో నిగ్గులోన సిగ్గుపడ్డ
తేనెటీగ ఘాటు పడ్డ ఎంగిలేదో అంటుకోగా
ఒకే ఒళ్ళుగా వడే ఇళ్లుగా హత్తుకున్న హాయిలోన
మెత్తబడ్డ బెట్టుకూడ అంతలోనే చిత్తు కాగా
ఇంతదాక పోతుందో ఈ కథా
చింతలేదు కానీరా మన్మధా
ఉండి ఉండి గుండె పిండు కొట్టవేడి పుట్టింది
ముందుకొచ్చి ముద్దులాడితే
పెదవి మీద ముద్దు – ప్రేమకొద్ది దిద్దు
చరణం: 2
అదే ధ్యాసగా ఎదే ఆశగా బుగ్గమీద ముద్దులేక
మద్దులోన పొద్దుపోక వేగలేక ఆగలేక
భలే మోతగా చలే వీచగా కమ్ముకున్న కౌగిలింత
దమ్ముకున్న సోకులన్ని వెచ్చబెట్టి రెచ్చిపోగా
ఈడు ముద్దరేశాక నిద్దరా…
ఈడు కాస్త లేచిందా నిద్దరా
హాట్ హాట్ తీపి ముద్దు కొత్తగానే పుట్టింది
కొత్త పిచ్చి కొంగులాగితే
పెదవి మీద ముద్దు – ప్రేమకొద్ది దిద్దు
బుగ్గ మీద ముద్దు – సిగ్గులన్ని రద్దు
హొయ్ హొయ్ హొయ్ హోయ్…
గోటితోటి కథలు రాశనే
నేను ఒంటిగాక ఎదలు మోసెనే
చూపుతోనే చురుకు పుట్టెనే
చాలకి పెడవిలోనే చెరకు పండెనే
అదేమిటో కథేమిటో భరించలేని అల్లారాయె
కన్నె సొగసు కందిపోయెనే