Oohalu Gusagusalade (2014)

చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: కళ్యాణి కోడూరి, సునీత
నటీనటులు: నగచౌర్యా, శ్రీనివాస్ అవసరాల, రాశీ ఖన్నా
దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 20.06.2014

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే  ఈ సందడ్లు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే  ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని గాలి లాగ మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా…

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే  ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే  ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు
మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా…

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే

నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటూంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ ఏం ఫరవాలేదన్నావా

అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా….
మ్… మ్… మ్… మ్… మ్… మ్…

*********   *********  **********

చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కోపగించి బుంగమూతి పెట్టినా నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానె ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైన అంటె నిజమేనని ఒప్పేసుకుంట
అంతేగాని నీ వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా

ఊ… ఊ… ఊ…

కత్రిన కరీన అంటు కొంతమంది కోసమే కుర్రాళ్లు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్లతో చూస్తే సరి నిన్ను మించి మరొకరు లేరని
అంటారు కద ఎవ్వరైన అలా అన్నానని
ఊరంత వచ్చి నిన్నే నా కళ్లతోటి చూస్తానంటె చూడగలనా

ఊ… ఊ… ఊ…

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది

ఊ… ఊ… ఊ…
ఊ… ఊ… ఊ…

**********   **********    *********

చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కారుణ్య

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది
వందకంటే ఎన్నో కారణాలను ఒకటొకటొకటిగా వివరిస్తున్నది

యాహు హూ… యాహు హూ… (2)

కోపగించి బుంగమూతి పెట్టినా నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానె ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైన అంటె నిజమేనని
ఒప్పేసుకుంట అంతేగాని
తన వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా
ఆ పిచ్చి బాగుందని మరింత పెంచుకొని
ఇలాగే వుండిపోతానంటే తప్పైన ఒప్పైన గాని

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కత్రిన కరీన అంటు కొంతమంది కోసమే కుర్రాళ్లు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్లతోటి చూస్తే సరి తనను మించి మరొకరు లేరని
అంటారు కద ఎవ్వరైన అలా అన్నానని ఊరంత వచ్చి తనని
నా కళ్లతోటి చూస్తానంటె చూడగలనా
నువు నాకే సొంతమని తనతోనే చెప్పాలని అనుకోడం కానీ పైకెనాడు అనలేకపోతున్నా కదా

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి

యాహు హూ… యాహు హూ… (3)

*********   *********  **********

చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: దీపు, శ్రావణి

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఓ సమస్యని అనేంత సీనున్నదా దీనికి
ఈ అవస్థని భరిస్తూ దాచేయడం దేనికి
అలా అలా నువ్వెంత తాకిన పరాకులో మరేమీ చేసినా
సరేనని సరాసరి సరెండరవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఈ హుషారులో రివర్స్ గేరేసినా ముందుకే
ఈ మాజాలలో అదర్స్ చీ కొట్టినా లైట్ లే
ఇదే ఇదే రొమాన్స్ పద్దతి ఇవాలిలా గ్రహించ మన్నది
వయస్సులో లభించిన వరాన్ని వేస్టవ్వనీకండి కవ్వించే ఇబ్బంది

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

error: Content is protected !!