Narappa All Telugu Lyrics

Ooo Narappa Song Lyrics

చిత్రం: నారప్ప
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ధనుంజయ్, వరం
నటీనటులు: వెంకటేష్, ప్రియమణి
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
పాట ప్రచురణ: సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్(Suresh Productions Music)
నిర్మాణం: సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను
చిత్ర విడుదల తేది: 20.07.2021

ఓ ఓ ఓ ఓ నారప్ప… నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్పా..
నిన్ను సూడంగానే ఇప్పారిందోయ్ నా రెప్పా..
ఓ ఓ ఓ ఓ కన్నమ్మ… ఆ కంటి రెప్పై కాసుకుంట కన్నమ్మా..
నీ జంటై అంటీ పెట్టుకుంట ఈ జన్మా..

ఇన్నేవా ఇట్టా ఇట్టా… నా గుండె యామంటుండాదో..
ఇన్యాలే ఆశల సిట్టా… హ ఎరుకే ఏమౌతుండాదో..
భలేగా బాగుందే సిలకా నీ మాయ
తలకాయాడించే పిల్లకాయైపోయా..
కనకే నోరూరే ఎలుగె మనపై పడుతుండాదే హొయ్యా..

ఓ ఓ ఓ ఓ నారప్ప… నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్పా..
నిన్ను సూడంగానే… ఇప్పారిందోయ్ నా రెప్పా..
ఓ ఓ ఓ ఓ కన్నమ్మ… ఆ కంటి రెప్పై కాసుకుంట కన్నమ్మా..
నీ జంటై అంటీ పెట్టుకుంట ఈ జన్మా..

బళ్ళారి సంతాకెళ్ళీ… ఓ బాసాడు పల్లీల్తేనా..
పల్లీల్ నువ్ తెస్తే మావ… నా పాణాలే బదులిచ్చెయ్ నా..
కదిరి గుళ్ళోకి కలిసీ పోదామా..
మడకసిరలోన మనువాడేద్దామా..
సెరువు కానించి సక్కని గుడిసే మనమేసుకుందామా..

ఓ ఓ ఓ ఓ నారప్ప… నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్పా..
నిన్ను సూడంగానే… ఇప్పారిందోయ్ నా రెప్పా..
ఓ ఓ ఓ ఓ కన్నమ్మ… ఆ కంటి రెప్పై కాసుకుంట కన్నమ్మా..
నీ జంటై అంటీ పెట్టుకుంట ఈ జన్మా..

Narappa Movie All Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!