Oopiri (2016)

చిత్రం: ఊపిరి (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిచరన్
నటీనటులు: నాగార్జున, కార్తీ , తమన్నా
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి
విడుదల తేది: 25.03.2016

పోదాం ఎగిరెగిరి పోదాం
ఎందాక అంటే ఏమొ అందాం
పోదాం ఇక్కడ్నే వుండి
అలవటైపోదాం మనకే మనం

ఏ దారి పూవూలే పరిచీ
మననీ రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్నీ చూసినా నవ్వులే విరిసే
హెలో అనే హుషారులో హో.. హో…

పోదామ పోదామ పోదామ పోదామ హో..ఓ
ఆకాశం అంచుల్ని తడుతూ
పోదామ పోదామ పోదామ పోదామ హో..ఓ
మనని మనమె తరుముతూ

పోదాం ఎగిరెగిరి పోదాం
ఎందాక అంటే ఏమొ అందాం
పోదాం ఇక్కడ్నే వుండీ
అలవటైపోదాం మనకే మనం

కన్నులనే వీడననే ఏ నిదరో
ఇంతవరకూ నన్ను నాకే చుపలేదే
ఊహలకి రెక్క తొడిగీ
ఆసలకి దిక్కు తెలిపీ

గుండెలయకూ కొత్త పరుగూ నెర్పుతోందే
లె లెమ్మనీ మేలుకొమ్మనీ
గిల్లిందిలా అల్లరిగా
గాల్లో ఇల్లా తేలిపొమ్మని పిలుపే

పోదామ పోదామ పోదామ పోదామ హో..
ఆకాశం అంచుల్ని తడుతూ
చలొ పోదామ పోదామ పోదామ పోదామ హో..
మనని మనమె తరుముతూ

పోదాం ఎగిరెగిరి పోదాం
ఎందాక అంటే ఏమొ అందాం
పోదాం ఇక్కడ్నే వుండి
అలవటైపోదాం మనకే మనం

ఏ దారి పూవూలే పరిచీ
మననీ రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్నీ చూసినా నవ్వులే విరిసే
హెల్లో అనే హుషారులో హో.. హో…

పోదామ పోదామ పోదామ పోదామ హో..ఓ
ఆకాశం అంచుల్ని తడుతూ
పోదామ పోదామ పోదామ పోదామ హో..ఓ
మనని మనమె తరుముతూ

******  ******  ******

చిత్రం: ఊపిరి (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్

ఎప్పుడూ ఒకలా వుండదూ
ఎక్కడా ఆగిపోనివ్వదూ
ఎదరేమునదో చెప్పదూ
కదిలే సమయం

నీడలా గ్నాపకం వదలదూ
తోదుగా ఏ నిజం నడవదూ
ఒంటిగా సాగటం తప్పదూ
జరిగే పయనం

నీతోనే మొదలైందా.. ఆ ఆ
నీతోనే మూగిసిందా
ఎప్పుడూ ఒకలా వుండదూ
ఎక్కడా ఆగిపోనివ్వదూ
ఎదరేమునదో చెప్పదూ
కదిలే సమయం

ఇదే కదా కోరిందనీ
వేరే ఇంకెం కావాలనీ
అన్నామంటే ఈనాటికీ
రేపంటూ వుంటుందా
ఇవ్వలెంతో బాగుందనీ
అయిన ఏదో లోటుందనీ
ఇంక ఏదో కావాలనీ
అనుకోని రోజుందా
కనకే మన ఈ గమనం

ఎప్పుడూ ఒకలా వుండదూ
ఎక్కడా ఆగిపోనివ్వదూ
ఎదరేమునదో చెప్పదూ
కదిలే సమయం

ఒహొ.హో. ఓ ఓ ఒహొ.హో.ఓ ఓ ఒహొ.హో.ఓ ఓ ఒహొ.హో.

నీ ఊపిరే నీ తోడుగా
నీ ఊహలే నీ దారిగా
నిన్నే నువ్వూ వెంటాడకా
ఏ తీరం చేరవుగా
కష్టాలనే కవ్వించగా
కన్నీళ్లనే నవ్వించగా
ఇబ్బందులే ఇష్టాలుగా
అనుకుంటే చాలు కదా
కనకే మన ఈ పయనం

ఎప్పుడూ ఒకలా వుండదూ
ఎక్కడా ఆగిపోనివ్వదూ
ఎదరేమునదో చెప్పదూ
కదిలే సమయం
నీతోనే మొదలైందా… ఓ ఓ
నీతోనే మూగిసిందా

******  ******  ******

చిత్రం: ఊపిరి (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్

ఒక లైఫ్
ఒకటంటే ఒకటే లైఫ్
ఒక లైఫ్
ఒకటంటే ఒకటే లైఫ్
ఇది కాదే అనుకుంటు
వదిలేస్తె వేరె అవకసం రాదే
ఇది ఇంతే అనుకుంటే
వందేల్లు నేడె జీవించే వీలుందే

ఒక లైఫ్
ఒకటంటే ఒకటే లైఫ్
ఒక లైఫ్
ఒకటంటే ఒకటే లైఫ్

ఏ.. ఏం లేదనీ
మనం చూడాలిగానీ
ఊపిరి లేదా
ఊహలు లేవా
నీకోసం నువ్వే లేవా
చీకటికి రంగులేసే
కలలెన్నో నీతోడై వస్తుండగా
ఒంటరిగా లేవనీ
ఆశకు కూడ ఆసను కలిగించెయ్
అయువు అనెదుండె వరకూ
ఇంకేదో లేదని అనకూ
ఒక్కొ క్షణము ఈ బ్రతుకూ
కొత్తదే నీకూ

ఒక లైఫ్
ఒకటంటే ఒకటే లైఫ్
ఒక లైఫ్
ఒకటంటె ఒకటే లైఫ్

ఇది కాదే అనుకుంటూ
వదిలేస్తే వేరే అవకసం రాదే
ఇది ఇంతే అనుకుంటే
వందెల్లు నేడే జీవించే వీలుందే

ఒకటంటె ఒకటే లైఫ్

******  ******  ******

చిత్రం: ఊపిరి (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: విజయ్ ప్రకాష్

నువ్వేమిచ్చావో
నీకైనా అది తెలుసునా
నెనేం పొందానో
నా మౌనం నీకు తెలిపెనా

కనులే మెరిసిపోవా..
నీలో నవ్వు చూడగా
హ్రుదయం మూరిసిపోదా
తనలో బరువు తీరగా

ఇన్నళ్లుగా నాక్కుడా లేని నెన్నూ
ఈరోజునే కొత్తగా జన్మించా
నీలోని ఆనందమై

నువ్వేమిచ్చావో తెలుసా వెతికే కలా
నీవల్లే కదా కలిసా నన్నే నేనిలా

నువ్వేమిచ్చవో నీకైనా అది తెలుసునా