చిత్రం: ఊరికి సోగ్గాడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: శోభన్ బాబు, విజయశాంతి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
నిర్మాతలు: పరశురామయ్య , సీతారామయ్యే
విడుదల తేది: 1985
తాకిడిలో తహతహలూ
తనువంతా ఘుమఘుమలు
పరువముతో పరిచయమే
పరవశమై పరిమళమై
తాకగానే తళతళలు
తనువంతా ప్రియలయలు
పరువములో ప్రణయంతో
పరిచయమే పరిమళమై హోయ్
తాకిడిలో తహతహలూ
తనువంతా ప్రియలయలు
చరణం: 1
ఆ చూపు సోకి అందాలు రేగే
దాచలేను నేను దగ్గరైతే కాను
ఆ నవ్వు చూసి మందార పూసి
తుమ్మెదల్లే నేను ఎట్టా వాలిపోను
నా ఈడు చూసి సూరీడు కందే
నీ కన్నె తోడు ఇన్నాళ్ళకందే
ఎన్ని వింతలో తొలి కౌగిలింతలో
తెలిసెనులే మనసుపడే వయసులులో
తాకిడిలో తహతహలూ
తనువంతా ప్రియ లయలు
చరణం: 2
వేసంగిలాగా వేడెక్కి పోయే
రేపుమాపు లన్ని జంటకట్టు కుంటా
కార్తీకమల్లే కౌగిల్లు నిండే
వెన్నెలల్లే నీలో వెచ్చబెట్టు కుంటా
నీ కొంగు చూసి నా మేను పొంగే
నా కంటిపాప కడవల్లే నవ్వే
ఎన్ని సిగ్గులో నును లేతబుగ్గల్లో
మురిసినవి బిగిసిన ఈ కౌగిలిలో ఆ…
తాకగానే తళతళలు
తనువంతా ప్రియలయలు
పరువములో ప్రణయంతో
పరిచయమే పరిమళమై హోయ్
తాకిడిలో తహతహలూ
తనువంతా ఘుమఘుమలు
పరువముతో పరిచయమే
పరవశమై పరిమళమై
తాకగానే తళతళలు
తనువంతా ఘుమఘుమలు