కలలు చూసిన కన్నులే… లిరిక్స్
చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020)
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ కుమార్
గానం: సిద్ శ్రీరామ్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాణం : కె. కె. రాధామోహన్
విడుదల తేది: 2020
కలలు చూసిన కన్నులే… నేడు మోసెనే కన్నీళ్ళే
హాయి పంచిన గుండెకే… ఓ గాయమయ్యెనే…
ఓ ఓ..! జంట నడిచిన అడుగులే… ఒంటరయ్యెనే ఇవ్వాలె
వెలుగునిచ్చిన నీడకే… మిగిలింది చీకటే…
దాచుకున్న ప్రేమనే… పోల్చలేక ప్రాణమే
తెంచుకుంది బంధమే…
మాటరాని మౌనమేదో… పెంచివేసె ఇంత దూరమే…
ఏ ఏఏ ఏ…
కలలు చూసిన కన్నులే… నేడు మోసెనే కన్నీళ్ళే
హాయి పంచిన గుండెకే… ఓ గాయమయ్యెనే…
ఓ ఓ..! జంట నడిచిన అడుగులే… ఒంటరయ్యెనే ఇవ్వాలె
వెలుగునిచ్చిన నీడకే… మిగిలింది చీకటే…
ఆ ఆ ఆ… ఆఆ ఆ ఆ ఆ… ఆ ఆ ఆఆ
ఆ ఆ ఆ… ఆఆ న న నా… ఆ ఆ ఆఆ
********** ********** ********** **********
సరిగమ గమ గమ గామా… లిరిక్స్
చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020)
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి
గానం: అనూప్ రూబెన్స్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాణం : కె. కె. రాధామోహన్
విడుదల తేది: 2020
సరిగమ గమ గమ గామా… హంగామా చేద్దామా
పదానిస నిస నిస నిస్స… ఈ నిషా నీదమ్మా
ఆవో..! మిస మిసలాడే… నీ నీడే ఓ వండర్ లా
తల తలమని చూపే తాకాల… ఓ థండర్ లా
నీ కన్నుల్లో ఈ వేళలో…
ఓ థౌసండ్ వాట్స్… వెన్నెలనే చూస్తూ ఉన్నా…
నా గుండెల్లో లోలోతుల్లో… నీ బొమ్మే గీసి
ఇంకా లోనికి నెట్టేస్తున్నా…
నా గుండె చప్పుడు నువ్వే… నా ఊహల ఉప్పెన నువ్వే…
ప్రతీ క్షణం నీ కలే కంటున్నా… పంచా నా గుండెనే నీకే
నువ్వే నా సొంతం అంటూ… ఇన్నాళ్లు వేశా నీతో అడుగే…
చూడనా నా లోకమే… నీలోన ఈ క్షణమే
ఆగదే ఈ ప్రాణమే… అయ్యింది నీ వశమే
నీ ప్రేమే నా గమ్యం కాని… నీతో రోజు నీడై రానీ
నా గుండె చప్పుడు నువ్వే… నా ఊహల ఉప్పెన నువ్వే…
ఆవో..! సరిగమ గమ గమ గామా… హంగామా చేద్దామా
పదానిస నిస నిస నిస్స… ఈ నిషా నీదమ్మా
********** ********** ********** **********
కృష్ణవేణి ఓ కృష్ణవేణి… లిరిక్స్
చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020)
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ కుమార్
గానం: రాహుల్ సిప్లిగంజ్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాణం : కె. కె. రాధామోహన్
విడుదల తేది: 2020
అల్లమెల్లిగడ్డ ఓ అవ్వసాటు బిడ్డ..
నీ యెనక నేను పడ్డా..
అరె! ప్లాను బోర్లా పడ్డ..
నేనేం బాగు పడ్డా…
నోట్లో వేలు పెడితే కొరకనోన్ని..
నా నోట్ల మన్ను కొట్టాకే కృష్ణవేణి..
నువ్వంటే మనసుపడి సచ్చేటోన్ని..
నన్ను సంపి బొంద పెట్టకే కృష్ణవేణి…
కృష్ణవేణి ఓ కృష్ణవేణి…
నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
కృష్ణ కృష్ణ కృష్ణ … కృష్ణ కృష్ణ కృష్ణ …
అరె! పాసెంజరు బండిలోన ప్యారు నిన్ను చేసిన్నే..
మెసెంజరు వాట్సాప్ లో ముచ్చట్లెన్నో చెప్పిన్నే…
నవంబరు మంచు లెక్క.. నవ్వుతుంటే మురిసిన్నే..
డిసెంబరు పువ్వులెక్క దిల్లులోన దాచిన్నే…
క్యాలెండరే సింపేసి, సిలెండర్ అయి పేలితివే.. ఓయ్..
కృష్ణవేణి ఓ కృష్ణవేణి…
నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
కృష్ణవేణి ఓ కృష్ణవేణి…
నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
మా ఊర్లో అందరిట్ల నేనే పెద్ద తోపునే..
బక్రానైతినే మీ అమ్మ గీస్తే మ్యాపునే…
నడిమిట్ల మా అయ్యకు రుద్దినారు సోపునే..
నాకేది సమజకాక గుద్దినాను హాఫునే…
నిన్న మొన్న నువ్వు నేను కలిసి కలలు కన్నామే..
ఇయ్యాల నువ్వు నాకు పీడకలై పోయావే…
ఒక్క నిమిషమైన నిన్ను ఇడిసి ఉండలేనోన్ని..
పక్కల ఓ పాము లెక్క బుసలు కొట్టుతున్నవే…
కృష్ణవేణి ఓ కృష్ణవేణి…
నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
మ్యాటరు సిన్నది, మీటరేమో పెద్దది..
బుజ్జిగాని బతుకు సూడు బజార్లనే పడ్డది..
నచ్చిన సిన్నది నరాలు తీస్తాఉన్నది..
ఇజ్జతంతా సినిగి సినిగి సాటే అయుతున్నది..
మూడు ముళ్ళు ఏసుకొని అయితదంటే వైఫు..
నాలుగు రోడ్ల మధ్య నిలిచి నూరుతాంది నైఫు..
దానింట్ల పీనుగేళ్ల, ఉందొ లేదో రేపు..
నా డెడ్ బాడీని నాతో మోయిస్తుందిరా లైఫు..
కృష్ణవేణి ఓ కృష్ణవేణి…
నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
నీతోటి కష్టమే కృష్ణవేణి…
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
నాకు నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి…
********** ********** ********** **********
ఈ మాయ పేరేమిటో… లిరిక్స్
చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020)
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
గానం: సిద్ శ్రీరామ్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాణం : కె. కె. రాధామోహన్
విడుదల తేది: 2020
ఓ.. వాలు వాలు నీ కన్నులే.. ఇవ్వాల నన్ను చూడగా…
మనస్సే జారేలా ఉంది కొత్తగా.. ఇదేదో తెలియని హాయిరా…
ఓహో! సొంత వీధిలో దారూలే.. ఏకంగా గుర్తు రాకనే
అదేదో మైకంల దారితప్పి నీ ప్రేమలో పడినట్టుగా
గాలిలోన తేలుతూ నిన్ను చేరుకున్న ఊహలే.. నీకు నన్ను చూపిన
చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా…
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఈ మాయ పేరేమిటో..
ఏమిటో ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో…
ఓ.. వాలు వాలు నీ కన్నులే.. ఇవ్వాల నన్ను చూడగా…
మనస్సే జారేలా ఉంది కొత్తగా.. ఇదేదో తెలియని హాయిరా…
తెలుగులోన నిన్నలా పొగుడుతుంటే కొత్తగా.. నన్ను నేను మెచ్చుకోన..
వెలుగులేని నింగిలా కురవలేని మబ్బులా.. పిచ్చి పట్టినట్టు ఉందిగా…
ఓ.. పక్కనే నువ్వు ఉండగా.. నీడలో రంగులే చేరుతుండగా..
చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా…
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఈ మాయ పేరేమిటో..
ఏమిటో ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో…
ఓ.. వాలు వాలు నీ కన్నులే.. ఇవ్వాల నన్ను చూడగా…
మనస్సే జారేలా ఉంది కొత్తగా.. ఇదేదో తెలియని హాయిరా…
గాలిలోన తేలుతూ నిన్ను చేరుకున్న ఊహలే.. నీకు నన్ను చూపిన
చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా…
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఈ మాయ పేరేమిటో..
ఏమిటో ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో…
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఈ మాయ పేరేమిటో..
ఏమిటో ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో…
********** ********** ********** **********
కురిసేన కురిసేన… లిరిక్స్
చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020)
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కేకే
గానం: అర్మాన్ మాలిక్, పి మేఘన
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాణం : కె. కె. రాధామోహన్
విడుదల తేది: 2020
ఓ ఓ.. కురిసేన కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన మురిసేన
కళలకి కనులకి కలిసేనా..
నింగిలో తారలే జేబులో దూరేనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన
విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం.
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..
ఓ ఓ.. కురిసేన కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన మురిసేన
కళలకి కనులకి కలిసేనా..
ఒక వారము అది… నన్ను నడిపింది
పసితనముకు తిరిగిక తరిమింది
పెదవడిగినది నీలో దొరికినది
ఒక్కసారి నన్ను నీలా నిలిపింది.
చూస్తూ చూస్తూ నాదే లోకం
నీతో పాటే మారే మైకం
ఇద్దరి గుండెల చప్పులిప్పుడు అయ్యే.. ఏకం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..
కొత్త మలుపు ఇది.. నిన్ను కలిపినది
నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది
చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది
ఎక్కడున్నా పక్కనుండే తలపు ఇది…
నిన్న మొన్న బానే ఉన్నా
నిద్దుర మొత్తం పాడౌతున్నా
నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్న.
కురిసేన కురిసేన
కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన.. హే, మురిసేన.. హో
కళలకి కనులకి కలిసేనా..
నింగిలో తారలే జేబులో దూరేనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన
విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో
విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం.
thanks for the lyrics
Welcome. 🙂