మల్లెతీగకు పందిరివోలె… లిరిక్స్
చిత్రం: ఒరేయ్…రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గద్దర్
గానం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: ఆర్.నారాయణ మూర్తి, రవళి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాణం: దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ
విడుదల తేది: 1995
పల్లవి:
ఆ… ఆ ఆ ఆ…
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
ముళ్ల తీగమ్మా కంచెమీద చీరవేస్తే రానేరాదమ్మా
అడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మా
అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మా
ఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా ఆహుమ్ ఆహుమ్
అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మా
కన్నవాళ్లకే రోకలి పోటమ్మా ఆహుమ్ ఆహుమ్
చరణం: 1
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మా
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా
అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
చెల్లెమ్మా…
చరణం: 2
సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
ఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా
నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా
బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
చెల్లెమ్మా…
ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్లి
భుజం కట్టి చదువు చదివేదెందుకు
కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు
ఆ కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు
చరణం: 3
చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా
నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా
నా క న్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా
రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా…