చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: విజయశాంతి, దాసరి నారాయన రావు, కృష్ణ ఘట్టమనేని
నిర్మాత & దర్శకత్వం: దాసరి నారాయన రావు
విడుదల తేది: March.1997
చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్
ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ
ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ
ఓ రాములమ్మా రాములమ్మా
ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ
సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకనేనమ్మ
ఓ రాములమ్మా రాములమ్మా
నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ
ఓ రాములమ్మా రాములమ్మా
ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా (2)
పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే
నురగ తీరుగా ఉన్నావే
ఓ రాములమ్మ
విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె
ముచ్చటేసి పోతున్నవే
ఓ రాములమ్మ
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో
నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే
భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే
సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పడకుండా
పసుపు పూసినారే అమ్మలు
ఓ రాములమ్మ
చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని
చీర కట్టినారే గుమ్మలు
ఓ రాములమ్మ
దొర గారి దొరసాని దీవెనలా కోసమని
ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని
కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా
మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా
దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నలుగురికి తల్లోని నాల్క వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా (2)
చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన
బాకులాంటి ఎలుగు మెరిసెనా
ఓ రాములమ్మ
మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే
ముద్దులయ్య చెయ్యి దొరికేనా
ఓ రాములమ్మ
కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు
కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు
ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ
గుబులు లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ
పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: గందవరపు సుబ్బారావు
గానం: వందేమాతరం శ్రీనివాస్
అ చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు ఆ…
డొనేషన్ల యుగములోన
డబ్బు లేని దళితుల్లో
వందకొకడు చదువుతుంటే
ఓర్చుకోని గుణమెందుకు
ఓర్చుకోని గుణమెందుకు
అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో
వెయ్యికోకడు నౌకరైతే ఎడ్చుకొనే పుట్టేందుకు
ఎడ్చుకొనే పుట్టేందుకు
పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి సామీ
పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి
మా గంజిలోన ఉప్పుజూసి గొణుగుడెందుకూ
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
పల్లెటూళ్ల సర్పంచుల పట్టణాల చైర్మన్ల
సగం నీకే ఇస్తమని సంకలెగర వెయ్యమన్రు
సంకలెగర వెయ్యమన్రు
శాసనసభ సభ్యుల్లో పార్లమెంటు మెంబర్లో
అర కోర సీటులిచ్చి ఐసుజేసి పోతన్రు
ఐసుజేసి పోతున్రు
పవరు లేని పదవికుండె రిజర్వేషను
పవరు లేని పదవికుండె రిజర్వేషను
ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు
గా ముఖ్యమంత్రి పదవికైన ఎందుకుండదు సామీ
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
పండుతున్న భూముల్లో ఎనభై శాతం మీవే
మిల్లుల్లో మిషనుల్లో మూడొంతులు మీ కిందే
మూడొంతులు మీ కిందే
అరె రూపాయ కట్టలన్ని మీ ఇనప పెట్టెలందే
బంగారం వెండంత మీ మెడకే మీ కాళ్లకే
మీ మెడకే మీ కాళ్లకే
ఎనభై శాతం మంది ఎండుకొని చస్తుంటే
ఇరవై శాతం మీరు దండుకొని బతుకుతున్రు
దండుకొని బతుకుతున్రు
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము
మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తరా
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
మీ అబ్బ పేరేమో సుబ్బారావు గారైతే
మా అయ్యా పేరేమో సుబ్బిగాడు ఐపోయే
సుబ్బిగాడు ఐపోయే
మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే
మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కుతుండె
రిక్షాలు తొక్కుతుండె
మీ అమ్మకు జలుబొస్తే అపొలోలో జేరుతుంటే
మా తల్లికి కేన్సరైతే ఆకు పసరు మింగుతుండే
ఆకు పసరు మింగుతుండే
మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే
మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే
దేవుళ్లలో ఒకడైన దళితుడే లేకపాయే
చౌదరి గారు ఓ నాయుడు గారు
ఆ రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు ఆ…
రామచక్కని తల్లి రాములమ్మో రాములమ్మో
చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: గుడా అంజయ్య
గానం: వందేమాతరం శ్రీనివాస్
లచ్చులో లచ్చన్నా…
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
ఎయ్…
అరెరరె లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా ఏయ్…
అ ఏకనోడు పీకనోడు జనం మొఖం దేఖనోడు
జనం మొఖం దేఖనోడు
ఎలక్షన్ల జీబులొచ్చి లెక్చరు మీద లెక్చరిచ్చి
లెక్చరు మీద లెక్చరిచ్చి
కాలవి గట్టిచ్చినమని కానూను బలుకుతున్రు
కానూను బలుకుతున్రు
కోళ్లగూడు కొంపగట్టి కోట్లు మింగి కూర్చున్రు
కోట్లు మింగి కూర్చున్రు
దసరా పండగొచ్చిందని రాక రాక అల్లుడొస్తే
రాక రాక అల్లుడొస్తే
ఆలుమగలు ఇద్దరింట మసలరాదు మెసలరాదు
మసలరాదు మెసలరాదు
ఉచ్చబొయ్యబోదమంటే…
ఉచ్చబొయ్యబోదమంటే పంచ పొంటిదాగుండదు
లచ్చులో… లచ్చులో…
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ప్రజలవద్ద పాలనని ఊరూరుకి తిరుగుతున్రు
ఊరూరుకి తిరుగుతున్రు
ఎన్నడు రానాఫీసరు గుడిసె ముందుకొచ్చిన్రు
గుడిసె ముందుకొచ్చిన్రు
కడుపులో సల్ల కదలకుండ కారు మీద వచ్చిన్రు
కారు మీద వచ్చిన్రు
శ్రమదానం పేరుతోటి పలుగు పార పట్టిన్రు
పలుగు పార పట్టిన్రు
అంగిస్తరి చడకుండా తట్ట నెత్తికెత్తుతున్రు
తట్ట నెత్తికెక్కుతున్రు
పేపర్లో ఫొటోలకీ…
పేపర్లో ఫొటోలకి ఫోజులిచ్చి దిగుతున్రు
లచ్చులో… లచ్చులో…
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
అరెరరెరరె…
అరె చచ్చినోడి లగ్గానికి వచ్చిందే కట్నమని
వచ్చిందే కట్నమని
సందట్లో సడేమియా సందులోకి జారుతున్రు
సందులోకి జారుతున్రు
హర్షాదు బోఫార్స్ హవాలా దొంగలు
హవాలా దొంగలు
సూటు బూటులేసుకున్న సూటికేసు దొంగలు
సూటికేసు దొంగలు
సంచి కూడ చూపించని యూరియా దొంగలు
యూరియా దొంగలు
అందరు శకాహారులే…
అందరు శకాహారులే రొయ్యల ముల్లేడబాయే
లచ్చులో… లచ్చులో…
హే లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఏయ్…
తప్పతాగి నా మొగుడు తన్నుడు గుద్దుడువెడితే
తన్నుడు గుద్దుడువెడితే
సంసారం ఈదలేక రోజు చచ్చి పుడుతుంటే
రోజు చచ్చి పుడుతుంటే
అమ్మలక్క లంత గలిసి వాడ వాడ లొల్లి జేసి
వాడ వాడ లొల్లి జేసి
సర్కారుల గళ్ళవట్టి సార బందు పెట్టిస్తే
ఖజానాలు ఖాలీ అని జీతమివ్వలేమని
జీతమివ్వలేమని
శ్వేతపత్రమట్టుకోని
శ్వేతపత్రమట్టుకోని గల్లి గల్లి తిరిగుతన్రు
లచ్చులో… లచ్చులో…
హే లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో…
ఒరేయ్ లచ్చులో
అన్నో లచ్చులో లచ్చన్నా
లచ్చులో లచ్చన్నా
లచ్చులో లచ్చన్నా
లచ్చులో లచ్చన్నా
చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్, చిత్ర
ఆ… ఆ… ఆ…
ఇంతి ఏ ఇంటి జాణవే
ఇంతి ఏ ఇంటి జాణవే
ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే
ఇంతి ఏ ఇంటి జాణవే
ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే
తీరు చామంతి పువ్వుల పేరు
నీ సాటి కన్నెలే లేరు
దివికాంతలైన సరిరారు
నిను చూడ కోరికల పోరు
చలరేగే గుండె దడ హోరు
సోభాంగి తెలుపు నీ పేరు
నిను కన్నోళ్లకు జోహారు
పలుకవేలనే పల్లె రంభని
ఒళ్ళు చూసిన కళ్ళు తిరుగునే
ఇంతి ఏ ఇంటి జాణవే
ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే
దారికెదురుగ నిలువబోకు
నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
దారికెదురుగ నిలువబోకు
నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
నీరి జంతువతీరుగ ఇటు తూరి
చెడు నుడుగులతో నను చేరి
ఆపదలను పొందకు కోరి
తలచకురా నను సుకుమారి
కనిపించును నాలో మారి
చూపింతును నరకపు దారి
మరియాదగ వెళ్లుము రోరి
చాలు చాలు నీ పలువ కూతలిక
జూలి వదులుకొని ఇల్లు చేరుకో
దారికెదురుగ నిలువబోకు
నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
కళ్ళు రస పిపాసులకు సంకెళ్లు
రతి సదనానికి వాకిళ్లు
ఆ స్వర్గమునే నాకిల్లు
చేయింతు విప్పు నీ ముడ్లు
పోదాం పదవే పొదరిల్లు
నేను ఒక వేశ్య కాంతను కాను
ఉచ్చాస్థి వాంఛలో లేను
మీరున్న ఇంట పుట్టాను
తల వొంచేదానిని కాను
నీ దొరతనముడిగిస్తాను
అని ప్రతినెపుడో చేశాను
తిమ్మిరిమొత్తం చిమ్ముకోకు
నిను అమ్మలక్కలతో దుమ్మొదిలిస్తా
దారికెదురుగ నిలువబోకు
నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
వల్ల నను ఊరించే రసగుల్ల
నీ ప్రతినను తీరుట కల్ల
నీ సంఘమంటే ఒక డొల్ల
ఎహె తెల్లవారేసరి కల్లా
మటుమాయం చేతునే మళ్ల
తొందర పడకుర నీవింత
కను తెరుస్తుంది జనమంత
నీకేదుంచరు పిసరంత
నిను పూడ్చి పెట్టేది వింత
అనుకోక తెలుసుకో కొంత
చాలు చాలు నీ పలువ కూతలిక
జూలి వదులుకొని ఇల్లు చేరుకో
అ దొరనే ఎదిరించినావులే
నీ కున్న పొగరు పొరనే తొలిగించు తానులే
కాలం మారింది ఓ దొరో
ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా
ఓసి పరువాల పొంగులా రాశి
ఇక లొంగిపోవే నా దాసి ఉఁ హ హా
ఓరి నేనింక కాదు నీ దాసి
ఈ పూట నేను రాకాసి రేయ్…
టెక్జులింక ఆపేసి
మంచాన్ని ఎక్కు వాటేసి
పోతాను నిన్ను కాటేసి
పూజించుకోర సన్యాసి
రతి పూజలు నీకే చేసి
పోతానులేవే ఆ కాశీ హహా హహహా
రతిని కాదు పార్వతిగ మారి
నిను ఖతం చేసి దుర్గటిని బాపెదను
కాలం మారింది ఓ దొరో
ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా
కాలం మారింది ఓ దొరో
ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా
చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్, ఎస్.జానకి
హేయ్ పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
ఎల్లకాలము నీదే
చెల్లుతుందనుకొని
కల్లాకపటములేని
పల్లె జనులకు నువ్వు
ముల్లువోలె నిలిచినావురా
దినదినము మమ్ముర
నల్లులోలే నలిపినావురా
మా ఆడ పడుచుల
ఘొల్లుమనగా చెరచినావురా
ఒరి దొరల కొడుకా
తుళ్ళి తుళ్ళి నవ్వినవ్ గదరా
అరె దొంగ కొడుకా
అరె కళ్లులో కామమ్ముతో
ప్రతి పిల్ల పిల్లకు కన్నువేసిన
కళ్ళు రెండు పెరికి ముప్పై
పళ్ళు చెప్పుతో రాలగొడతాం హా
అరె పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
ఎక్కడివి నీ పొలములు
పటేల్లు కొడుకా
ఎక్కడివి నీ చెలుకలు
భూస్వామి కొడుకా
ఒక్క రోజు కూడా ఒక్క నిమిషము సేపు
దుక్కి దున్నలేని దున్నపోతువు నీకు
దిక్కు తెలియని భూములెక్కడివి
మా వెట్టియేగా
చెక్కుచెదరని మేడలెక్కడివి
మా కండ కల్వగ
లెక్కలేని గరిసెలెక్కడివి
మా నెత్తురోడగ
చక్కని పన్నీరు లెక్కడివి
మా చెమట రాలగ
అరె చిక్కినవ్ ఇప్పటికి నువ్వు
ఇక్కడ ఇయ్యల నిన్ను
తొక్కిపట్టి తోలు పెట్టి
ఠక్కున తల పగలగొడతం హా
అరె పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
వెట్టి పశులా మంటివిరో
మా అన్న లాలో
ఎట్టి బాధలు బెడితివిరో
మా అక్కలాలో
వెట్టిచాకిరి చెయ్యలేక
పుట్టినట్టి ఊరు విడిచి
పట్టణాలకు పారిపోతే
పిట్టలోలే పట్టుకొచ్చి
కట్టినావు కాల్లు చేతులురా
కారాలు జెల్లి
కొట్టితే కొరడాలు తెగినయి రా
మా గెంజి పోతే
కట్టి ఉచ్చ తాపినవ్ గదరా
నిను కొట్టడానికి
కట్టెలు ఎన్నైన చాలవురా
నిను చంపడానికి
అరె నిట్టనిలువున నరికి నేడు
చుట్టుబట్టు ఊళ్లలో
నీ పొట్ట పేగులు బలిని జెల్లే
చిట్ట పులులం వచ్చినాముర హా
అరె పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా