చిత్రం: పాడిపంటలు (1976)
సంగీతం: కె. విమహాదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ , ఆత్రేయ, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, మోదుకూరి జాన్సన్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యల్. క్ర్.ఈశ్వరి, వసంత
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల, లత
దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాత: జి. ఆది శేషగిరిరావు
విడుదల తేది: 1976
పల్లవి:
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
తొట్టిలో ఉన్నాడు జగమొండి
వాడిదూకుడికి ఆగలేదు తప్పుకోండి
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
చరణం: 1
వయసులోనే ఉన్నది దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది
వయసులోనే ఉన్నది దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది
చిన్నదాని చేతిలో చిరతలున్నవి
ఎంత చెలరేగిన నీకు హద్దులున్నవి
చిన్నదాని చేతిలో చిరతలున్నవి
ఎంత చెలరేగిన నీకు హద్దులున్నవి
హద్దులన్ని సద్దులన్ని ముద్దులతో చెరిగిపోతవి
తందాన తన నన తందనాన
తందాన తన నన తందనాన
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
చరణం: 2
ఎగిరెగిరి పడుతున్న కోడె గిత్తలు
అవి ఏనాడో మోయాలి మోపెడంతలు
ఎగిరెగిరి పడుతున్న కోడె గిత్తలు
అవి ఏనాడో మోయాలి మోపెడంతలు
ఎత్తుపల్లాలు చూస్తేనే ఇన్ని గంతలు
మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు
పగ్గాలు లేని నాడు పంతాలు గెలవలేవు
దసారి గరి సనిద ద ద ద
పనిస రిస రిద ప ప ప ప
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
తొట్టిలో ఉన్నాడు జగమొండి
వాడిదూకుడికి ఆగలేదు తప్పుకోండి