చిత్రం: పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కల్పన , మల్లికార్జున
నటీనటులు: బాలకృష్ణ , సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: మేడికొండ వెంకట మురళీకృష్ణ
విడుదల తేది: 05.06.2003
పల్లవి:
బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
అందాలె నన్ను కవ్విస్తుంటే రాదా కోరిక
ఆ యమునే నీ నడుమే నాట్యం చేస్తుంటే
విరహంతో నా వయసు నిన్నే వెతికిందే
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక
సీతమ్మ జడ్లో పువ్వును నేనై తెచ్చా కానుక
నా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్యా
నా సొగసే నైవేద్యం పెడతా రావయ్యా
బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక
చరణం: 1
వెన్నాముద్దలతో కన్నె ముద్దులని కలేసి కొట్టేసేయ్
గండు తుమ్మెదలా దొండాపండంటి నా పెదాలు పట్టేసేయ్
గురువా తేనల్లే జుర్రేసెయ్
కొంగు జాడింపులో కొంటె ఊరింపులు కులాష ఎంతున్నా
బేబీ వేధింపులో తాపం తాలింపులో తమాషా లేదమ్మా
నా భూలోక రంభమ్మ
బలిరా నరసింహ బరిలో దిద్దుకో
తనువిస్తా నినుగాని సిరులే పంచుకో
బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక
చరణం: 2
పచ్చా పచ్చని వంపు వెచ్చా వెచ్చంగ కన్ను కొట్టేసి రమ్మంటే
ఎర్రా బుగ్గలదాన ఈడు మత్తెక్కిపోయి పిచ్చోడి నవుతున్నా
నీ ఒళ్ళో పిల్లాడి నవుతున్నా
ఏదో తలచుకొని ఎన్నో కలలు కని వెర్రెక్కి పోతున్నా
నీలో మత్తెక్కె సెగ సలాము చేస్తున్నా
నీ గులాము నౌతున్నా
సాహా జవరాల సరదా తీర్చుకో
ప్రతి పగలు ప్రతి రాత్రి నన్నే దాచుకో
బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
అందాలె నన్ను కవ్విస్తుంటే రాదా కోరిక
ఆ యమునే నీ నడుమే నాట్యం చేస్తుంటే
విరహంతో నా వయసు నిన్నే వెతికిందే
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక
సీతమ్మ జడ్లో పువ్వును నేనై తెచ్చా కానుక
నా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్యా
నా సొగసే నైవేద్యం పెడతా రావయ్యా
బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక