Palasa 1978 Lyrics

Palasa 1978 (2020)

Advertisements

Palasa 1978 Lyrics

బావొచ్చాడో లప్ప… లిరిక్స్

చిత్రం: పలాస 1978 (2020)
నటీనటులు: రక్షిత్, నక్షత్ర
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: ఉత్తరాంధ్ర జానపద సేకరణ
గానం: అదితి భావరాజు
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాణం : ధ్యాన్‌ అట్లూరి
విడుదల తేది: 06.03.2020

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు
అహ.. అహ.. అహ..
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు
ఏయ్.. హోయ్.. ఏయ్..
హోయ్.. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు

తెల్లచీర కట్టుకోని రమ్మన్నాడు
మంచి మల్లెపూలు పెట్టుకోని రమ్మన్నాడు ||2||

పట్టు లంగ కట్టుకోని రమ్మన్నాడు
తీర వెళ్ళాక ఒగ్గేసి యెళ్ళిపోయినాడు ||2||

బావొచ్చి బావొచ్చి భలే బావొచ్చి
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు ||2||

ఒరేయ్.. అన్నాయ్..
ఓరి చెల్లి!
ఒకటి చెప్పాల
ఏటి చెప్మ్యా..
చెప్పటానికి ఏటుందిరా అన్నాయ్..
ఇంకా నాలుగు ముక్కలు పాడేస్తాను ఇన్రా..

ఎడం కాలుకు ఏసినాడు ఎర్రటి జోడు
ఆడు కుడి కాలుకు ఏసినాడు కర్రిటి జోడు ||2||

గుడి వెనక తోటలోకి రమ్మన్నాడు
తీర వెళ్ళాక తాగేసి తొంగొన్నాడు ||2||

బావొచ్చె అరె బావొచ్చె అరెరె బావొచ్చె

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు ||4||

***** ***** ***** *****

నక్కిలీసు గొలుసు… లిరిక్స్

చిత్రం: పలాస 1978 (2020)
నటీనటులు: రక్షిత్, నక్షత్ర
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: ఉత్తరాంధ్ర జానపద సేకరణ
గానం: రఘు కుంచె
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాణం : ధ్యాన్‌ అట్లూరి
విడుదల తేది: 06.03.2020

నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…

హేయ్..! పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…

పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…

మీ బావ గారు వచ్చేటి వేళ… ఆ
నీకు బంతి పూలు తెచ్చేటి వేళ…ఆ ఆ
మీ బావ గారు వచ్చేటివేళ… ఆ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా…

మీ మరిదిగారు వచ్చేటి వేళ… ఓసి
నీకు మందారం తెచ్చేటి వేళ… ఆ ఆ
మీ మరిదిగారు వచ్చేటి వేళ… నీకు మందారం తెచ్చేటి వేళ… ఆ ఆ

మీ మావగారు…ఆ… మావగారు
మీ మావగారు వచ్చేటి వేళ…
నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ… ఆ ఆ
మీ మావగారు వచ్చేటి వేళ… నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళా…

నాది… నాది
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…

నీకు కడియాలు తెచ్చేటి వేళా… నీకు పొనకమ్మలు తెచ్చేటి వేళా
నీకు కడియాలు తెచ్చేటి వేళా… నీకు పొనకమ్మలు తెచ్చేటి వేళా

నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటి వేళా… హూ… అది పెట్టుకుని వచ్చేటి వేళా… ఛీ
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటి వేళా… అది పెట్టుకుని వచ్చేటి వేళా

నీకు పట్టుచీర… అబొబ్బొ పట్టుచీర
పిల్లా పట్టుచీర తెచ్చేటి వేళ… అది కట్టుకుని వచ్చేటి వేళా
నీకు పట్టుచీర తెచ్చేటివేళా… అది కట్టుకుని వచ్చేటివేళా

నాది… నాది
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
హెయ్… పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…

నీ పక్కన పడ్డాది లేదో సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నాది… నాది… నాది… నాది… నాది

***** ***** ***** *****

ఏ ఊరు ఏ ఊరే… లిరిక్స్

చిత్రం: పలాస 1978 (2020)
నటీనటులు: రక్షిత్, నక్షత్ర
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల, రవి కుమార్
గానం: విజయలక్ష్మి, రాజు జముకు అసిరయ్య
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాణం : ధ్యాన్‌ అట్లూరి
విడుదల తేది: 06.03.2020

Advertisements

ఏ ఊరు ఏ ఊరే వలె భామ..
నీది ఏ ఊరే వలె భామ… నీది ఏ ఊరే

సీకకుళం జిల్లా.. జిల్లాలో పలాస మా ఊరు
వస్తావా.. పలాస మా ఊరు…

బోగట్టలేటేటే మీ ఊరి.. బొగటలింకేటే..
నా దుక్కు సూస్తూనే సెప్తావా..
ఒకసారి వింటానే…

ఏ ఊరు ఏ ఊరే.. వలె భామ..
నీది ఏ ఊరే వలె భామ… నీది ఏ ఊరే.

పలాస మా ఊరు వస్తావా..
పలాస మా ఊరు…

భుగత ఇను ఇను.. సెబుతా ఇను ఇను..
మా ఊరి వైభోగం…

ఒకతా ఇను ఇను.. సెబుతా ఇను ఇను..
మా ఊరి వైభోగం…

జెముకలకుండని వాయించనా
డేకురు కొండని సూపించనా..

ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం..
జీడీ తోటల సింగారాలు.. ఆ ఎర్రా సెరువు..
ఎగిరే కొంగల కోలాటాలు.

జీడీ పప్పు పేరు సెపితే చాలు..
పలాస విలాసం గురుతొస్తాది.

దేశాలన్నీ తెల్ల బంగారంలా
భావించే విలువైన పంటే ఇది..

ఎంతటి వంటైనా ఇదుంటే ఓ అందం.
ఎంతటి ఓడైనా, దీని రుచికే దాసోహం..

రెక్కలు ముక్కలు సెమట సుక్కలు
మంకీనమ్మకి నైవేద్యం…

బస్తాలెత్తే వస్తాదులు.. ఆ కండలు ఎరగవు
అందరిలాంటి ముస్తాబులు..

బస్తాలెత్తే వస్తాదులు.. ఆ కండలు ఎరగవు
అందరిలాంటి ముస్తాబులు..

పోరాటాల పురిటి గడ్డే ఇది
చైతన్య గీతాల గొంతే ఇది…
కదిలొచ్చిన చదువుల తల్లే ఇది
జననేతలు ఉదయించే ఇల్లే ఇది…

వలస పిట్టలకి తేలే నీలాపురము
పాదయాత్రలకు మొదలు ఇచ్ఛాపురం

పచ్చని సీరని కట్టిన నేలకి
నుదుటున తూరుపు సింధూరం..

మనం మనం బరంపురం అనుకుంటూ
వరసలు కలుపుకు పోదా తరం తరం…

దేవుడు ఇచ్చిన వరం వరం
ఆ నెత్తురు బదులు ప్రేమే పొంగెను నరం నరం…

***** ***** ***** *****

ఓ సొగసరి ప్రియలాహిరి… లిరిక్స్

చిత్రం: పలాస 1978 (2020)
నటీనటులు: రక్షిత్, నక్షత్ర
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: ఎస్.పి. బాలు, పసల బేబి
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాణం : ధ్యాన్‌ అట్లూరి
విడుదల తేది: 06.03.2020

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేంమరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

చలివేళలో చెలి ఏలనే
సొగసుకు బిడియపు ముసుగూ
ఈ వేళలో ఆగావని
అతిగా ప్రణయం విసుగు
విరహమంటాను నేను
కసురుకుంటావు నువ్వు
సరసమేలేదు సయ్యాటలో
నేను వింటూనేఉంటే
ఏదో అంటావునువ్వు
నీతో తంటాలు సిగ్గాటలో

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

చెలి కురులలో జలపాతమే
తనువొకధనువై మెరుపూ
ప్రణయాలలో ఈమాటలే
మనసుకు ముచ్చటగొలుపు
వెండి వెన్నెల్లొనువ్వు
నిండు జాబిల్లినవ్వు
కన్నెచెక్కిళ్ళు నాకోసమే
ఎంతసేపంటు నన్ను
పొగుడుతుంటావు నువ్వు
ఆపు చాలింక నచ్చావులే..

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేంమరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Power (2014)
error: Content is protected !!