చిత్రం: పల్లెటూరి మొనగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, శ్రీమతి రోహిణి చక్రవర్తి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చిరంజీవి , రాధిక
దర్శకత్వం: యస్.ఎ. చంద్రశేఖర్
నిర్మాత: మిద్దే రామారావు
విడుదల తేది: 28.01.1983
పల్లవి:
జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు
జతకలిసి ఇద్దరి కథ తెలిసి
గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే
ఈనాటి పరువం చెరలాడెనే
జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు
జతకలిసి ఇద్దరి కథ తెలిసి
గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే
ఈనాటి పరువం చెరలాడెనే
చరణం: 1
పువ్వులు పూచే కొమ్మలు వీచే చల్లని గాలుల్లో
ఉయ్యాలో జంపాలో
వెన్నెలతాకే కన్నులు తాకే అల్లరి చూపుల్లో
ఉయ్యాలో కయ్యాలో
వెచ్చదనం చల్లదనం కలుపుకొనే కౌగిట్లో
నీ ఎదలో నా ఎదలో వినిపించే చప్పుడులు
కలగన్న స్వర్గం కదలాడెనే
నిలవున్న కాలం పరుగాయెనే
నిలవున్న కాలం పరుగాయెనే
జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు
జతకలిసి ఇద్దరి కథ తెలిసి
గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే
ఈనాటి పరువం చెరలాడెనే
చరణం: 2
గువ్వల పెళ్లికి తీగలు అల్లే ఆకుల పందిట్లో
మేళాలో తాళాలో
చుక్కలు వచ్చి పక్కలు వేసే తియ్యని వేళల్లో
ఏలాలో ఏలెలో
ఎర్రదనం కమ్మదనం చిగురేసే పెదవుల్లో
నీవెవరో నేనెవరో మురిపించే ముద్దుల్లో
మనసైన జంట మనువాడెనే
అనురాగ దైవం దీవించెనే
అనురాగ దైవం దీవించెనే
జడలోని బంతిపువ్వు కడగంటి కొంటెనవ్వు
జతకలిసి ఇద్దరి కథ తెలిసి
గిలిగింతలై పులకింతలై చిననాటి స్నేహం కలబోసెనే
ఈనాటి పరువం చెరలాడెనే