చిత్రం: పల్లెటూరు (1952)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వేములపల్లి శ్రీకృష్ణ
గానం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు
దర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావు
నిర్మాత: పి.శివరామయ్యా
విడుదల తేది: 16.10.1952
పల్లవి:
చేయెత్తి జైకొట్టు తెలుగోడా…
గతమెంతో ఘనకీర్తి గలవోడా…
చేయెత్తి జైకొట్టు తెలుగోడా…
గతమెంతో ఘనకీర్తి గలవోడా…
చరణం: 1
వీర రక్తపుధార …వారబోసిన సీమ
వీర రక్తపుధార …వారబోసిన సీమ
పలనాడు నీదెరా …వెలనాడు నీదెరా
పలనాడు నీదెరా … వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి…
తాండ్ర పాపయ్య గూడ నీవొడోయ్…
నాయకీ నాగమ్మ… మల్లమాంబా… మొల్ల …
నాయకీ నాగమ్మ… మల్లమాంబా… మొల్ల …
మగువ మాంచాల… నీ తోడబుట్టినవోళ్ళే…
మగువ మాంచాల… నీ తోడబుట్టినవోళ్ళే….
వీరవనితలగన్న తల్లేరా…
ధీరమాతల జన్మభూమేరా…
చరణం: 2
కల్లోల గౌతమీ ఆ ఆ ఆ ఆ ఆ…వెల్లువల కృష్ణమ్మ ఆ ఆ ఆ ఆ ఆ
కల్లోల గౌతమీ… వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి …పొంగివారిన చాలు
తుంగభద్రా తల్లి … పొంగివారిన చాలు
ధాన్యరాసులే పండు దేశానా….
కూడు గుడ్డకు కొదవలేదోయి
చరణం: 3
ముక్కోటి బలగమోయ్… ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన … వూరు పేరుంటాది
ఇరుగు పొరుగులోన … వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా…
సవతి బిడ్డల పోరు మనకేలా…
పెనుగాలి వీచింది ఆ ఆ ఆ ఆ… అణగారి పోయింది ఆ ఆ ఆ ఆ
పెనుగాలి వీచింది … అణగారి పోయింది
నట్టనడి సంద్రాన … నావ నిలుచుండాది
నట్టనడి సంద్రాన … నావ నిలుచుండాది
చుక్కాని బట్టారా తెలుగోడా…
నావ దరిజేర్చరా … మొనగాడా…
చేయెత్తి జైకొట్టు తెలుగోడా…
గతమెంతో ఘనకీర్తి గలవోడా…
గతమెంతో ఘనకీర్తి గలవోడా….