ముద్దబంతులు మువ్వమోతలు… లిరిక్స్
చిత్రం: పండగ (1998)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో, చిత్ర, బృందం
నటీనటులు: శ్రీకాంత్, రాశి, అక్కినేని నాగేశ్వర రావు
దర్శకత్వం: శరత్
నిర్మాణం: ఆర్. బి. చౌదరి
విడుదల తేది: 01.05.1998
Muddabantulu Muvvamotalu Song Telugu Lyrics
ఆ… ముత్యాల ముగ్గుల్లో..
ఆ… రతనాల గొబ్బిళ్లో..
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
॥ ముద్దబంతులు॥
కలబోసి విరబూసే
మహదండిగా మదినిండగా..
చలి పండుగే సంక్రాంతి
॥ ముద్దబంతులు॥
అత్తింట సాగుతున్న
అల్లుళ్ల ఆగడాలు భోగి పళ్లుగా..
కంగారు రేపుతున్న
కోడళ్ల చూపులన్నీ భోగిమంటగా..
ఉన్నమాట పైకి చెప్పు
అక్కగారి వైనమేమో సన్నాయిగా..
దేనికైన సిద్ధమైన బావగారి
పద్ధతేమో బసవన్నగా..
పిల్లపాపలే పచ్చతోరణాలుగా..
పాలనవ్వులే పచ్చి పాయసాలుగా..
కలబో..సి తెరతీ..సి కనువిందుగా..
మనకందిన సిరిసంపదే.. సంక్రాంతి
॥ ముద్దబంతులు॥
మనసును చూసే కన్నులు ఉంటే..
పగలే వెన్నెల రాదా..
మమతలు పూసే బంధాలుంటే..
ఇళ్లే కోవెల కాదా..
మన అనువాళ్లే నలుగురు ఉంటే..
దినము కనుమే కాదా..
దేవతలేని దేవుడు నీవు ఇల చేరావు
కనలేని కొనలేని అనురాగమే నువు
పంచగా అరుదెంచదా.. సుఖశాంతి
॥ ముద్దబంతులు॥
కలబోసి విరబూసే
మహదండిగా మదినిండగా..
చలి పండుగే సంక్రాంతి
॥ ముద్దబంతులు॥
Pandaga Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****