చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద (2014)
సంగీతం: అచ్చు రాజమని, బప్పా. బి.లహరి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్
నటీనటులు: మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ , వెన్నెల కిషోర్, హన్సిక, ప్రణీత, రవీనా టండన్
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: మంచు విష్ణు, మంచు మనోజ్
విడుదల తేది: 31.01.2014
అచ్చ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని
దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని
పిచ్చెక్కి చూశాను నేనే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే
చరణం: 1
ఓ నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూశాను నేనే
నా వెన్నులో ఉడుకొచ్చేలా నీ వెన్ను చూశాను నేనే
నీ ఒంపులో ఆపేశావే కాలాన్నే
నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని
నిఖరంగా చూశాను నేనే
పిల్లా నీ పీఠభూముల్ని నునులేత కనులన్నీ
నిశ్చంగా చూశాను నేనే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే
చరణం: 2
ఆ ఊబిలో దిగిపోయేలా నీ నాభి చూశాను నేనే
ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూశాను నేనే
నీ రూపుతో పిండేసావే ప్రాణాన్నే
అబ్బో ఆ సూర్య చంద్రుల్ని చూల్లేని చోటుల్ని
అడ్డంగా చూశాను నేనే
అమ్మో నువ్వైన నీలోన చూల్లేని సోకుల్ని
అద్దంలా చూశాను నేనే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే
అచ్చ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే