చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సలోని రాయ్
నటీనటులు: పవన్ కళ్యాణ్ , సరా జానే డైస్, అంజలీ లావణ్య
దర్శకత్వం: విష్ణు వర్ధన్
నిర్మాతలు: నీలిమ తిరుమల శెట్టి, నాగేష్ ముంత, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 09.12.2011
వెయ్ రా చెయ్ వెయ్ రా ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా అక్కడేదో చేసేయ్ రా
కసి కౌగిలివై రార నను పిట పిట పిండేయ్ రా
ఉన్న ఊపిరి తీసెయ్ రా కొత్త ఊపిరి పోసేయ్ రా
తలగడలా నలిపేయ్ రా అలజడినే అనిచెయ్ రా
కల నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా
వెయ్ రా చెయ్ వెయ్ రా ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా అక్కడేదో చేసేయ్ రా
చరణం: 1
హే సన్నజాజి నగరంలా తళుకుల తగరంలా
పంజరాన పావురంలా నిచేత చిక్కనివేళా
నా చూపేరో గంజావనం గమ్మత్తు పీల్చుకోరా
దాహలలో దావానలం ఉఫ్అంటు చల్లార్చు కోరా
రానా ఇటు రానా ఒళ్లు వేడై పిలిచారా
అరె నరములోని ఏక్ తార నీకై వేచెనురా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా
చరణం: 2
ఏలో యలలేలో యలలేలో యలలేలో
యలలేలో యలలేలో ఏదేదో చేసేయ్ రా
హే అందంమైన ఆడ చీత ఆకలేసి దూకుతుంటా
వేటగాడి ఈటే తోనే ఇష్టంగా ఆటాడుకుంటా
ఎవ్వరికీ ఇవ్వనిది నీతోనే పంచుకుంటా
అందరికి అందనిది నీకోసమందించుకుంటా
ఏ పిచ్చుకా నువ్వెంత అని పిడుగై పడమంట
ఈ ఉడుకు దుడుకు ఊపు చూసి ఆహా అనుకుంటా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా
వెయ్ రా చెయ్ వెయ్ రా టచ్ మీ యు కెన్ టచ్ మీ
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా ఏదేదో చేసేయ్ రా
కౌగిలివై రార నను పిట పిట పిండేయ్ రా
ఉన్న ఊపిరి తీసెయ్ రా కొత్త ఊపిరి పోసేయ్ రా
తలగడలా నలిపేయ్ రా అలజడినే అనిచెయ్ రా
కల నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా
******** ******** *******
చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: బెల్లి రాజ్ , ప్రియ
అనుకోనేలేదుగా కలకానేకాదుగా
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
సుఖాలన్నీ మన చుట్టూ చేరే
శుభాలన్ని మన చుట్టమయ్యే నేడే
ఐదు ప్రాణాల సాక్షిగా నాలుగు కాలాల సాక్షిగా
మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా
కొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగామాయే
సంతోషమే సంపాదనాయే
ఇదే బాటై ఎదే మాటై ఇలాగే లోకాలని ఎలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చేరోసగమైతే ప్రేమేలే
ఒకే నవ్వు ఒకే నడక మరోజగమైతే మనమేలే
అనుకోనేలేదుగా కలకానేకాదుగా
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
******** ******** *******
చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్, శ్వేతా పండిట్
ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పెదేలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపభోతే భాష చాల్లెదెలా
నా భాషలోన తీయంధనం
నా భాటలోన పచ్చంధనం
పసి పాపలాగా నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ
నీ నీడలో నే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా
ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పెదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart
******** ******** *******
చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్వేతా పండిట్
క్షణం క్షణం ప్రతిక్షణం
కోరే ధనం పచ్చందనం
నిజం నిజం నిరంతరం
మీరే కదా ఆరోప్రాణం
మీ బాధలే నే పంచుకోనా
మీ హాయినే హోయ్ నేర్పించనా
మన నవ్వుతో నవ్వుతుంది
ఈ ప్రపంచం
వస్తున్నా నేస్తం…
అందిస్తాలే నవ జీవితం (2)
******** ******** *******
చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యావన్ శంకర్ రాజా
నీ చుర చుర చుర చూపులే పంజా
సల సల సల ఊపిరే పంజా
నరనరమున నెత్తురే పంజా
అణువణువున సత్తువే పంజా
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా ?
ఎత్తు పల్లం లేనే లేని రహదారు అంటూ ఉందా ?
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా ?
ఏదేమైన తుది వరకు ఎదురీత సాగాలిగా…
అడుగడుగు అలజడిగా
నీ జీవితమే నీ సేత్రువు కాగా
బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమే గా పంజా
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యం గా
చుర చుర చుర చూపులే పంజా
సల సల సల ఊపిరే పంజా
నరనరమున నెత్తురు పంజా
అణువణువునా సత్తువే పంజా
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా పదునగు ఆలోచనే పంజా
******** ******** *******
చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర, సత్యన్, పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం
ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు
మన ఊరికి వచ్చాడు మనవాడైపోయాడు
మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు
చెడుతో చెడుగుడాడుకుంటాడు
పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు
ఆ ఇట్టాంటోడుగాని ఉరికొక్కడుంటే
చీకు చింతలన్ని తీరిపోయినట్టే
చీకటన్న మాట పారిపోయినట్టే హా
అర్రెరే నువ్వు అపరా జే
అయ్యా ఏమి చేస్తున్నావురా
వస్తాన్నానయ్యా
come on I say
అయ్యా తమరిగురించే పడుతన్నాడయ్యా
నువ్వొక పని చెయ్ – అయ్యా
వాడిలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా
చిన్న చిన్న పదాలు ఉపయోగించి
నీ నోటితో నువ్వే పాడు
నేనా అయ్యా పాడమ్మా నువ్వు కొట్టరా
ఎదవలకే ఎదవ పనికిమాలిన చవట
తాగుబోతు కుయ్యా తిరుగుబోతు జెఫ్ఫా
పోలీసు డ్రెస్సులో ఉన్న ఫోర్ ట్వెంటీ గాడని
రే అబ్బో అబ్బా
come here
ఏందయ్యా కొట్టావట్టా
తిడతన్నావేమిటిరా
అది కాదు ఎదో ఫ్లోలో
ఆగు అర్దం కాకపొయినా ఆడు తిట్టిందే బాగుందిరా
ఇది మరీ దారుణంగా వుంది
ఒక పని చెయ్యి మరీ అంత హైలో కాకుండా
మరీ అంత లోలో కాకుండా
మీడియమ్‌గా తిట్టేయ్‌రా
you can do better ప్లీజ్ రా
ఈసారి చూడయ్యా కొట్టు
అరేయ్ భూమికి జానెడు భూలోక వీరుడు
చూపులకి మామూలోడు
ఈ మొనగాడు చాలానే సరుకున్నోడు
మీసంలేని మగధీరుడు సూరుడు
సూపర్ మేన్ టైపే వీడు
జనాల ముందు సింపుల్ మేన్ అనిపిస్తాడు
తన బలమేంటో తనకే తెలియని
ఆల్ ఇన్ ఒన్ ఆంజనేయుడు
చేసిన మంచిని మర్చిపోయే గజని కజినే వీడు
తర్వాత తర్వాతేంటి కొట్టు
పాపారాయుడు పాపారాయుడు
పాపారాయుడు పాపారాయుడు హా
పై పై లుక్సు చూసి వేసుకున్న డ్రెస్సు చూసి
మనిషిని వెయ్యరాదు అంచనా
సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది
ఎవ్వడిలో ఎంతుందో స్టామినా
సిక్సు ప్యాకు బాడీ లేకపోయినా
పాపారాయుడి సింగల్ హ్యాండ్ చితకేస్తాది
కట్ అవుట్ చూస్తే కామేడిగున్నా
ఈ పోటుగాడి కంటి చూపు నరికేస్తాది
ఇరగేస్తాది ఆ తర్వాత తర్వాతేంటి కొట్టు
అన్నా ఈ మూవ్‌మెంట్ చూడు అన్న
అన్నా మళ్ళీ ఇది
అరెరే మూవ్‌మెంట్ మర్చరా మూవ్‌మెంట్ మార్చు
అది అది అరె అరెర్రె అబ్బో
నిన్నా మొన్న నీ పైన వెక్కిరించారు ఈ ఊరి జనాలు
అరే ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు
నిన్న చూస్తే దగా కోరు ఇయ్యాలేమో అయ్యాగారు
ఛీ పో అని తిట్టినోళ్ళే సలాం సలాం అని అన్నారు
చుట్టు పక్క పదూళ్ళల్లో ఏ సమస్య వచ్చినా
ఇకపై నువ్వే దిక్కు దేవుడో
వాళ్ళూ వీళ్ళోచ్చి కాళ్ళా వెళ్ళా పడినా
అసలే నొదలకు ఎప్పుడు
అండాదండై మా తోడు నువ్వే లేకుంటే
మమ్మల్ని కాపాడేదెవ్వడూ
అయ్యా మీరు దేవుడయ్యా మరి కొట్టు
అబ్బ అబ్బ మెల్లగా కొట్టరా ఇంకా మెల్లగా కొంచెం మెల్లగా
ఆ ఇంకా మెల్లగా కొడితే తుస్స్ అంతే ఏం వినపడదు అన్న
కొట్టరా కొట్టు కొట్టు కొట్టు
బ్రతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్‌లో నిలబెట్టేద్దాం
శ్రీ పాపా గారి గొప్పతనం టాం టాం వేద్దాం
హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు పండగలా జరిపించేద్దాం
దానికేమో పాపావళి అని పేరెడదాం
చందాలెన్నో పోగు చేసి పాలరాతి గుడి కట్టిద్దాం
పాపారాయుడి వీరగాధను స్కూల్లో పాఠం చేద్దాం
తర్వాత తర్వాతేంటి కొట్టు