చిత్రం: పంతులమ్మ (1977)
సంగీతం: రాజన్ – నరేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు
నటీనటులు: రంగనాథ్, లక్ష్మీ, దీప, శరత్ బాబు
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: యన్.కృష్ణంరాజు
విడుదల తేది: 1977
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లే రావే వలపంటి నీవే
ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
ఎలదేటి పాట చెలరేగె నాలో
చెలరేగి పోవే మధుమాసమల్లే
ఎలమావితోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వనదేవతల్లే
పున్నాగ పూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
మరుమల్లె తోట మారాకు వేసే
మారాకు వేసే నీ రాక తోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళా
బ్రతికించుకోవే నీ పదము గానే
నా పదము నీవే నా బ్రతుకు నీదే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
హహ హాహ హాహ లలాలలాల
********* ********* **********
చిత్రం: పంతులమ్మ (1977)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
సాగర మధనం..అమృత మధురం
సంగమ..సరిగమ..నవపారిజాతం
మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
సంసారం…సంగీతం…
చరణం: 1
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
ఆ ఆ..అ అ ఆ..అ అ అ ఆ..ఆ ఆ
అ..అ..అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాల…దశదిశంతాల సుమసుగంధాల…భ్రమరనాదాల
కుసుమించు నీ అందమే..విరిసింది అరవిందమై కురిసింది మకరందమై..
చరణం: 2
జాబిలి కన్నా నా చెలి మిన్నా..పులకింతలకే పూచిన పొన్న..
కానుకలేమి నే నివ్వగలను? కన్నుల కాటుక నే నవ్వగలను !
పాలకడలిలా వెన్నెల పొంగింది పూలపడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలనూ ? మనసున మమతై కడతేరగలను !
ఆ…గగసరి గపదప మమ గగ రిరి సస సరిసగమ
రిమగపదప రిమరిమ స రి..గస స..పద ద..పద ద ప..
మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం సంసారం…సంగీతం…
చరణం: 3
ఆ..ఆఆ…ఆ..ఆ..నిరిగమద మగరిని..దనిని..నిదమ..ఆ ఆ ఆ…ఆ ఆ అ ..
నిని రిరి గగ మమ దద
దద నిని రిరి గగ మమ
మమ దద నిని రిరి గగగ
కురిసే దాకా అనుకోలేదూ శ్రావణ మేఘమని
ఆ ఆ అ..తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని
ఆ ఆ..కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమనీ
సనిరి సని..ని ని ని..నిని నిని నిని దని దనిద మద సస స
మగదమగ మగ మగ గద మగ మగ..నిమగమ దప..దగరిగ రిగ..దనినిరి నిరి
ఆ ఆ అ అ…ఆ ఆ అ అ..ఆ ఆ అ అ..ఆ ఆ అ అ..ఆ ఆ ఆ……ఆ ఆ ఆ అ అ అ ఆ ఆ..మా…రిమగదప రిమరి..సరిమరి సరిసద..ససరి సరిమ..పెదవినేనుగా..పదము నీవుగా..ఎదను పాడని
మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
సాగర మధనం..అమృత మధురం
సంగమ..సరిగమ..నవపారిజాతం
********* ********* **********
చిత్రం: పంతులమ్మ (1977)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల
పల్లవి:
మనసెరిగినవాడు మా దేవుడూ… శ్రీరాముడూ
మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు…
మనసెరిగినవాడు మా దేవుడూ… శ్రీరాముడూ
చరణం: 1
ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడై నాడు..ఆ….
తలచిన వారికి తారకరాముడు
పిలిచిన పలికే చెలికాడు సైబోడు
కోలువై ఉన్నాడు కోదండరాముడు
మన తోడుగా .. నీడగా .. రఘురాముడు…
మనసెరిగినవాడు మా దేవుడూ… శ్రీరాముడూ
చరణం: 2
కడకు బోయను ఆది కవిని చేసిన పేరు
గరళకంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపర సాధనకు ఇరువైన పేరు….
శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు
హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు
రామ రామ అంటే కామికమే తీరు
కలకాలము మమ్ము కాపాడు పేరు….
మనసెరిగినవాడు మా దేవుడూ… శ్రీరాముడూ..
మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు…
మనసెరిగినవాడు మా దేవుడూ… శ్రీరాముడూ
********* ********* **********
చిత్రం: పంతులమ్మ (1977)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
పండగంటి ఎన్నెలంతా.. సందరయ్యా అబ్బా
దండగై పోయింది.. సందరయ్యా..
పండగంటి ఎన్నెలంతా.. సందరయ్యా..
సందరయ్యా.. సందరయ్యా..
చరణం: 1
సల్లగాలి పాట ఉంది..హాయ్ హాయ్ హాయ్ హాయ్
సంపంగి తోట ఉంది
సల్లగాలి పాట ఉంది..సంపంగి తోట ఉంది
ఆ ఎనక సాటు ఉంది..వెనక సాటు మాట ఉంది
ఇన్నున్నా నా సెంత సిన్నారి లేకుంటే..
ఇన్నున్నా నా సెంత సిన్నారి లేకుంటే..
ఎన్నెలేమి సేసుకోను సందరయ్యా ..
ఈ ఏడి నేడ దాసుకోనూ సెందరయ్యా..
పండగంటి ఎన్నెలంతా సందరయ్యా అబ్బా
దండగైపోయింది..సందరయ్యా..
సందరయ్యా..సందరయ్యా..
చరణం: 2
సన్నజాజి పందిరుంది..హా హా హా హా
తొలిరోజు తొందరుంది
సన్నజాజి పందిరుంది..తొలిరోజు తొందరుంది
సోకైన వాడి సూపు సోకి సోకి సొదపెడుతుంది
ఇన్నున్నా నా సెంత సిన్నోడు లేకుంటే
ఇన్నున్నా నా సెంత సిన్నోడు లేకుంటే
ఎన్నెలేమీ సేసుకోను సందరయ్యా
ఈ వన్నెలేడ దాసుకోనూ సందరయ్యా
పండగంటి ఎన్నెలెంతా సందరయ్యా
దండగైపోయింది..సందరయ్యా..
సందరయ్యా..హా హా హా..సందరయ్యా..
చరణం: 3
అర్థరాత్రి అవుతున్నాది..నిద్దరేమో రాకున్నాది
ఇద్దరుండి ఎవ్వరు లేనీ ముద్దు ముచ్చటౌతున్నాది
సుక్క బంతి పూవుంది..సక్కదనం పక్కేసింది..
సక్కిలిగిలి సంత కాడా జాతరేదొ చెలరేగింది
ఇన్నున్నా నా సెంత సిన్నోడు లేకుంటే..
ఇన్నున్నా నా సెంత సిన్నారి లేకుంటే..
ఎన్నెలేమి సేసుకోను సందరయ్యా ..
నా ఏడి నేడ దాసుకోనూ సెందరయ్యా..
పండగంటి ఎన్నెలెంతా సందరయ్యా…
దండగైపోయింది..సందరయ్యా..
సందరయ్యా..సందరయ్యా..
సందరయ్యా..సందరయ్యా..
********* ********* **********
చిత్రం: పంతులమ్మ (1977)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
పల్లవి:
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్ని గోదారికాగా .. పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
చరణం: 1
పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే “
ఎద వీణపై ..అనురాగమై.. తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే ..శిల అయితే.. మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే ..విరబూసినా.. మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే ..వేసవులై.. రగిలింది ఈ రాలుపూత …
రగిలింది ఈ రాలుపూత…..విధిరాతచేతా..నా స్వర్ణసీతా..
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా..
చరణం: 2
కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ “
ఆ రూపమే.. నా దీపమై ..వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో ..వెన్నెలగా.. వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే ..చితిమంటలై.. చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే ..మృతికంటే.. చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాటచేదైన ..చెలిలేని పాటా..ఒక చేదుపాటా..
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్ని గోదారికాగా .. పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా