Papam Pasivadu (1972)

papam pasivadu 1972

చిత్రం: పాపం పసివాడు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల
నటీనటులు: యస్.వి.రంగారావు, దేవిక, చిత్తూరు. వి.నాగయ్య, కైకాల సత్యన్నారాయణ,
దర్శకత్వం: వి.రామచంద్రరావు
నిర్మాత: అట్లూరి శేషగిరిరావు
విడుదల తేది: 1972

పల్లవి:
అమ్మా చూడాలి…నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి… నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా… అమ్మా…

అమ్మా చూడాలి… నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి… నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా… అమ్మా… అమ్మా… అమ్మా…

చరణం: 1
ఇల్లు చేరే దారే లేదమ్మా… నిన్ను చూసే ఆశే లేదమ్మా…
ఇల్లు చేరే దారే లేదమ్మా… నిన్ను చూసే ఆశే లేదమ్మా…
నడవాలంటే ఓపిక లేదు… ఆకలి వేస్తోంది
అమ్మా… అమ్మా… అమ్మా… అమ్మా…

చరణం: 2
పలికేందుకు మనిషే లేడు… నిలిచేందుకు నీడే లేదు …
పలికేందుకు మనిషే లేడు … నిలిచేందుకు నీడే లేదు …
బాధగా ఉంది భయమేస్తోంది.. ప్రాణం లాగేస్తోంది
అమ్మా… అమ్మా……

అమ్మా చూడాలి… నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి… నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా… అమ్మా… అమ్మా… అమ్మా..

**********   *********  ***********

చిత్రం:  పాపం పసివాడు (1972)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  ఎల్. ఆర్. ఈశ్వరి, బాలు

పల్లవి:
అరె.. మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి
హొయ్.. నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి
అరె.. చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్ 

మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి
నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి
చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్

చరణం: 1
ఆపద వస్తే.. బావురంటరూ.. బావురంటరూ
అయ్యో.. బాబని కాళ్ళబడతరు.. కాళ్ళబడతరు
ఏరుదాటి ఒడ్డుకు చెరిందే.. తెప్పకాల్చి పోతారయ్యో
ఏరుదాటి ఒడ్డుకు చెరిందే.. తెప్పకాల్చి పోతారయ్యో 
కుక్కకు ఉన్న విశ్వాసం.. ఈ నరుడికి లేదయ్యో 

మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి
నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి
చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్ 

చరణం: 2
నావాడంటే..  ప్రాణం ఇస్తాం.. నమ్మామంటే..  మా తలదీస్తాం
చెప్పిన మాటా చెల్లిస్తాం.. కోయరాజులం అనిపిస్తాం
చెప్పిన మాటా చెల్లిస్తాం..  కోయరాజులం అనిపిస్తాం
దొంగచాటుగా ద్రోహం చేస్తే.. అమ్మకు బలి ఇస్తాం..

మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి
నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి
చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్ 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top