Parugu (2008)

చిత్రం: పరుగు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సాకేత్
నటీనటులు: అల్లు అర్జున్, షీలా, నవదీప్, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: భాస్కర్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 02.05.2008

నమ్మవేమో గాని అందాల యువరాణి
నేలపై వాలింది నా ముందే మెరిసింది
నమ్మవేమో గాని అందాల యువరాణి
నేలపై వాలింది నా ముందే మెరిసింది

అందుకే అమాంతం నామది
అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది
ఇక్కడే ఇలాగే నాతో ఉంది

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

చరణం: 1
నవ్వులు వెండిబాణాలై నాటుకు పోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపం ఈడు భారాలై ముందర నించుంటే
ఆ సోయగాన్నె నే చూడగానే
ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగ పాదముని అడుగు వేయమని కదలలేవు తెలుసా!

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

చరణం: 2
వేకువలోనా ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
వేసవి పాపం చలివేసి ఆమెని వేడింది
శ్వాసలలోనా తలదాచి జాలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే
ఆనందమైన వందేళ్ళు నావే
కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలిని

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

*********  *********  *********

చిత్రం: పరుగు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్

చల్ చల్ చలో చల్ రె చల్ చలో
సరదాగా సాగాలీ చలో
చల్ చల్ చలో చల్ రె చల్ చలో
వరదల్లే పొంగాలీ చలో
గిర గిర గిర తిరిగే నైజం
నిలబడనిక ఏ నిమిషం
జర జర జర సాగే వేగం
ఆగదు పయనం

చల్ చల్ చలో చల్ రె చల్ చలో
సరదాగా సాగాలీ చలో
చలో చల్ చల్ చలో చల్ రె చల్ చలో
వరదల్లే పొంగాలీ చలో

6:20 మా చంటి గాడి ఇంటికి
6:30 మా బంటి రెస్టారెంటుకి
6:40 అటునుంచి ఐమాక్స్ కి
7:00 కి యాడుంటానో మరి

కుదురుగా స్థిరముగా
రాయల్లే ఉన్నావంటే లాభం లేనే లేదు
క్షణముకో స్థలములో
బంతల్లె పరిగెడుతుంటె సంతోషాలే చూడు

చల్ చల్ చలో చల్ రె చల్ చలో
సరదాగా సాగాలీ చలో
చలో చల్ చల్ చలో చల్ రె చల్ చలో
వరదల్లే పొంగాలీ చలో

సుర్యుడుకి సెలవుంటుందండి రాత్రికి
జాబిలికి కునుకుంటుందండి పగటికి
నా వొంటికి అలుపే రాదండి జన్మకి
నా దారిలో వెలుతుంటా పైపైకి
గెలవడం ఓడడం ఆ రెండు
మాటలకర్థం చూద్దాం లేవోయి రేపు
బ్రతుకు తో ఆడటం రేపంటె లాభం
లేదోయి ప్రారంబించెయ్ నేడు

చల్ చల్ చలో చల్ రె చల్ చలో
సరదాగా సాగాలీ చలో
చల్ చల్ చలో చల్ రె చల్ చలో
వరదల్లే పొంగాలీ చలో
గిర గిర గిర తిరిగే నైజం
నిలబడనిక ఏ నిమిషం
జర జర జర సాగే వేగం
ఆగదు పయనం

*********  *********  *********

చిత్రం: పరుగు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రాహుల్ నంబియర్

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచినా కరిగించానుగా
కళ్ళెం వేసినా కదిలొస్తాను గా

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

అసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానే
అనుకుంటె అప్సరసైన
నా గుమ్మంలోకొస్తాదే
విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే
చనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదే
ఇన్నాల్లు భూలోకంలో ఏ మూల ఉన్నావే
అందిస్తా ఆకాశాన్నె
అంతో ఇంతో ప్రేమించావంటే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి

అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే
బలమైన వారధి కట్టి సీతని ఇట్టే పొందాడే
మన మధ్య నీ మౌనం సంద్రంలా నిండిందే
మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే
చంద్రున్నె చుట్టేస్తానే చేతుల్లో పెడతానే
ఇంక నువ్వు ఆలోచిస్తూ
కాలన్నంతా ఖాలీ చెయ్యొద్దే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

*********  *********  *********

చిత్రం: పరుగు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరానిది ఈ నిజం
పెదవులు విడిరాక నిలువవె కడదాక
జీవం లో ఒదగవె ఒంటరిగా
లో లో ముగిసే మౌనంగా
ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరానిది ఈ నిజం

ఊహాల లోకంలో ఎగరకు అన్నావే
తేలని మైకంలో పడకని ఆపావే
ఇతరుల చిరు నవ్వుల్లో
నను వెలిగించావే ప్రేమా
మరి నా కను పాపల్లో
నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో
బలి కోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి
ఓ ఓ ఓ ఓ ఓ

హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరానిది ఈ నిజం

వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలిస్తాడూ
అంతటి దూరం ఉంటే
బ్రతికించే వరమౌతాడూ
చెంతకి చేరాడంటే చితిమంటే ఔతాడూ
హలాహలం నాకు సొంతం
నువు తీసుకో అమృతం
అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ

హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరానిది ఈ నిజం

*********  *********  *********

చిత్రం: పరుగు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

పరుగులు తీయకె పసిదానా
ఫలితము లేదని తెలిసున్నా (2)

నేడైనా రేపైనా జరిగేదే ఎపుడైనా
నీ గుండెల్లో కూర్చున్నా, గుట్టంతా గమనిస్తున్నా
వస్తున్నా నేనే వస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా

పనిమాలా నాకెదురొచ్చి
పరువాల ఉచ్చు బిగించి
పది చచ్చే పిచ్చిని పెంచి
కట్టావె నన్ను లాక్కొచ్చి

కుందేలై కుప్పించి అందాలే గుప్పించి
ఇందాక రప్పించీ పొమ్మనకే నన్ను విదిలించీ

వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
పరుగులు తీయకె పసిదానా
ఫలితము లేదని తెలిసున్నా

ఉలికిపడే ఊహలే సాక్షి
ఊసురనే ఊపిరే సాక్షి
బెదురుతున్న చూపుల సాక్షి
అదురుతున్న పెదవుల సాక్షి
నమ్మాలే నలినాక్షి  నిజమేదో గుర్తించి
నీ పంతం చాలించి నేనే నీ తిక్కని పెంచి

వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా (3)

*********  *********  *********

చిత్రం: పరుగు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కైలాష్ కెహర్, సైందవి

ఎలగెలగా ఎలగా ఎలగెలగా (4 )

ఎల్లా మా ఈంటికొచ్చి మాయ చేసావూ
ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావూ
ఎల్లా నా దారినిట్టా మార్చివేసావూ
ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావూ

ఎలగెలగా ఎలగా ఎలగెలగా ( 2 )

పిల్లా నీ లాంటిదాన్నే కోరుకున్నానూ
పిల్లా ఈ మాట నాలో దాచుకున్నానూ
పిల్లా నేనింత కాలం వేచివున్నాను
పిల్లా ఆ చోట నిన్నే చూసుకున్నానూ

ఎలగెలగా ఎలగ ఎలగెలగా ( 2 )

కలలో ఓ రోజు బ్రహ్మ దేవుడొచ్చాడూ
సరిగా నా గుండెపై నీ బొమ్మ గీసాడూ
ఎలగెలగా ఎలగా
ఇదిగో ఈ పిల్ల నీకె జంట అన్నాడూ
పరుగూన వెల్లమంటూ తన్ను తన్నాడూ
ఎలగెలగా ఎలగా
కొండలు దాటి కోనలు దాటి గుట్టలు దాటి గట్టులు దాటి
దెబ్బకు అక్కడ ఎగ్గిరి పడ్డాను నీ దగ్గర పడ్డానూ

అలగలగా అలగా అలగలగా ( 2 )

అల్లా మీ ఇంటికొచ్చి మాయ చేసానూ
అల్లా నీ లోపలే ఈ గోల పెంచానూ
అల్లా నీ దారినట్టా మార్చివేసానూ
అల్లా నా దారిలోకి తీసుకొచ్చానూ

అలగలగా అలగా అలగలగా ( 2 )

దినకిట దీగ దీగ దిన దినకిట దీగ దీగన
దినకిట దీగ దీగ దిన దీగ దీగ దిన దీగ దీగన

ఎపుడో మా బామ్మ నాకో మాట చెప్పిందీ
ఎవడో వల వేసి నన్నే లాగుతాడందీ
ఎలగెలగా ఎలగా
పోవే నే వెర్రిదాన్ని కాదు అన్నానూ
కాని నువ్వు ముందుకొస్తే ఆగుతున్నానూ
ఎలగెలగా ఎలగా
ఎప్పటికప్పుడు ఏమవుతాదని
చెయ్యని తప్పులు ఏం చేస్తానని
నిద్దరమాని ఆలోచిస్తున్నా నిన్నారా తీస్తున్నా

ఎలగెలగా ఎలగా ఎలగెలగా
అలగలగా అలగా అలగలగ
ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఇలగిలగా ఇలగా ఇలగిలగా ఇలగ

Show Comments (0)

Your email address will not be published.