Paruvu Prathista (1963)

చిత్రం: పరువు ప్రతిష్ట (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి
దర్శకత్వం: మనపురం అప్పారావు
నిర్మాత: జూపూడి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 09.05.1963

పల్లవి:
ఆ మబ్బు …తెరలలోన… దాగుంది… చందమామ…
ఈ సిగ్గుపొరలలోన…బాగుంది… సత్యభామ…
ఏమంది… సత్యభామ…

ఏమందో… ఏమో కాని…పరిహాసాలే… చాలునంది…
శ్రీవారిని… ఐదారడుగుల…దూరాన… ఆగమంది…
దూరాన… ఆగమంది…

చరణం: 1
ఈ గాలి… ఊయలా… ఊగించు…పయ్యెదా…
ఈ గాలి… ఊయలా… ఊగించు…పయ్యెదా…
ఊరించే …సైగలతోనే …ఏమంది…. తియ్యగా…

పరువాల… తొందరా…నెలరాజు… ముందరా…
పరువాల… తొందరా…నెలరాజు… ముందరా…
మర్యాదా… కాదని కాదా….పలికింది …చల్లగా…
పలికింది. …మెల్లగా…

ఆ మబ్బు…. తెరలలోనా… దాగుంది… చందమామ…
ఈ సిగ్గుపొరలలోనా… బాగుంది… సత్యభామ…
ఏమంది… సత్యభామ…

ఏమందో ..ఏమో కాని…పరిహాసాలే… చాలునంది…
శ్రీవారిని… ఐదారడుగుల…దూరాన… ఆగమంది…
దూరాన… ఆగమంది…

చరణం: 2
సిగలోని… పువ్వులు… చిలికించే నవ్వులు…
సిగలోని… పువ్వులు …చిలికించే నవ్వులు…
ఓ…ఓ…ఓ…ఓ…ఓ…
మనకోసం… ఏ సందేశం… అందించే ప్రేయసీ…

ఆనంద సీమలా… అనురాగ డోలలా…
ఆనంద సీమలా….అనురాగ డోలలా…
కలకాలం… తేలీసోలీ…ఆడాలి హాయిగా…
అన్నాయి… తియ్యగా…

ఆ మబ్బు….తెరలే తొలగి…ఆగింది… చందమామ…
ప్రేమికుల …హృదయము తెలిసి…పాడింది…. చందమామ…
పాడింది…. చందమామ…

ఆహా..హా..ఆ…ఆ…ఆ….

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Balaraju Bangaru Pellam (1995)
error: Content is protected !!