చిత్రం: పసి హృదయాలు (1973)
సంగీతం: జి.కె. వెంకటేశ్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ ,
దర్శకత్వం: యం. మల్లిఖార్జున రావు
నిర్మాత: యం. మల్లిఖార్జున రావు
విడుదల తేది: 25.10.1973
పల్లవి:
ఆరు మాసాలాగు.. పుడతాడు మనకో బాబు
ఆరు మాసాలాగు.. పుడతాడు మనకో బాబు
కనువిందుగా… ఇక పండుగ
ఆగనని అన్నానా.. ఆగడం చేశానా
ఆగనని అన్నానా.. ఆగడం చేశానా
మగవారే.. మహా తొందరా
ఓ…ఓ….ఓ… ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు
చరణం: 1
అందం చిందే బాబే ముద్దుల మూటా..
అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా
అందం చిందే బాబే ముద్దుల మూటా..
అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా
నేడు దొరగారూ వెంటపడతారూ
నేడు దొరగారూ వెంటపడతారూ
రేపు మీ బాబే లోకమంటారూ
పాపాయికే గిలిగింతలూ.. లాలింపులు
ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు
చరణం: 2
నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో
నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో
కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ
కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ
నిండినవి నెలలూ… పండునిక కలలూ
నిండినవి నెలలూ… పండునిక కలలూ
నేటి తొలి చూలు… రేపు మురిపాలు
నా ఆశలూ.. నా బాసలూ… తీరేనులే
ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు
కనువిందుగా… ఇక పండుగ
ఆగనని అన్నానా.. ఆగడం చేశానా
మహరాణికే.. ఈ తొందరా
ఓ…ఓ….ఓ… ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు
******* ****** *******
చిత్రం: పసి హృదయాలు (1973)
సంగీతం: జి.కె. వెంకటేశ్
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి:
చూసిన చూపే చూడనీ పదే పదే
దోచిన రూపే దోచనీ పదే పదే
మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
వలచే జంటలకూ సహజం ఇదే ఇదే
చూసిన చూపే చూడనీ పదే పదే
చరణం: 1
నా మనసే ఎగిసినదీ…నీ మీదే అది వాలినదీ
నా మనసే ఎగిసినదీ…నీ మీదే అది వాలినదీ
నా చేయి నీ చేయి…పెనవేస్తూ పోతుంటే
నీ పెదవి నా పెదవి …ప్రతినిమిషం తోడుంటే
తేనే వెన్నెలా …కలయిక అదే అదే
తేనే వెన్నెలా… కలయిక అదే అదే
అదే అదే …హానీమూన్
చూసిన చూపే చూడని పదే పదే
దోచిన రూపే దోచనీ పదే పదే
మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
వలచే జంటలకూ సహజం ఇదే ఇదే
చూసిన చూపే చూడనీ పదే పదే
చరణం: 2
కౌగిలిలో కలిశామూ…కమ్మదనంలో కరిగామూ
ఊ..కౌగిలిలో కలిశామూ…కమ్మదనంలో కరిగామూ
చెలరేగే పరువాలే …కెరటాలై డీకొంటే
ప్రతి తరగా ప్రతి నురగా…మన కథలే చెపుతుంటే
వలపుల కడలికే …వంతెన కడదాము
వలపుల కడలికే …వంతెన కడదాము
అదే అదే హానీమూన్…
చూసిన చూపే చూడని పదే పదే
దొచిన రూపే దోచనీ పదే పదే
మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
వలచే జంటలకూ సహజం ఇదే ఇదే
******* ******* ******
చిత్రం: పసి హృదయాలు (1973)
సంగీతం: జి.కె. వెంకటేశ్
సాహిత్యం: సినారె
గానం: సుశీల
పల్లవి:
కలలు కన్న రాధ…కనులలో మనసులో గోపాలుడే…
కలలు కన్న రాధ… కనులలో మనసులో గోపాలుడే…
చరణం: 1
నీ జతలో శృతి చేసుకుంది హృదయం
నీ జతలో శృతి చేసుకుంది హృదయం
నీవు తాకగానే నిలువెల్ల వేణుగానం
ఔనా…ఔనా…ఔనా…..
కలలు కన్న రాధ …కనులలో మనసులో గోపాలుడే…
కలలు కన్న రాధ…
చరణం: 2
నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా..
నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా
నీడలాగ నీతో బ్రతుకెల్ల సాగిపోనా
ఔనా…ఔనా…ఔనా…..
కలలు కన్న రాధ… కనులలో మనసులో గోపాలుడే
కలలు కన్న రాధ…
చరణం: 3
ఈ వలపే నిలవాలి యుగ యుగాలు..
ఈ వలపే నిలవాలి యుగ యుగాలు
ఎన్ని జన్మలైనా ఈ బంధమున్న చాలు
ఔనా…ఔనా…ఔనా…..
కలలు కన్న రాధ …కనులలో మనసులో గోపాలుడే…
కలలు కన్న రాధ