చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, సుమలత
దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 23.07.1987
స్వీటీ… స్వీటీ…
హో హో… చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్
నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్
ఇద్దరి దరువుకు మద్దెల బ్రేక్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ య్యా
హే నీ అందం అరువిస్తావా
నా సొంతం కానిస్తావా
నీ సత్తా చూపిస్తావా
సరికొత్త ఊపిస్తావా
హోయ్ పిల్లా నిన్నాల్లాడిస్తా
పిడుగంటి అడుగుల్లో పై తాళం పరుగుల్లో
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ…
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నా ముక్కును శృతి చేస్తావా
నా మువ్వకు లయలిస్తావా
నా చిందుకు చిటికేస్తావా
నా పొందుకు చిత్తౌతావా
పిల్లాడా నిన్నోడిస్తా కడగంటి చూపులతో
కైపెక్కే తైతక్కల్లో బ్రేక్ బ్రేక్ బ్రేక్ నాటీ నాటీ
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్
నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్
ఇద్దరి దరువుకు మద్దెల బ్రేక్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ య్యా
****** ****** ******
చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల
పల్లవి:
అందం శరణం గఛ్చామి… అధరం శరణం గఛ్చామి
ఈ సాయంత్ర వేళ… నీ ఏకాంతసేవ
అతి మధురం… అనురాగం.. ఒదిగే వయ్యారం
ప్రణయం శరణం గఛ్చామి…. హృదయం శరణం గఛ్చామి
ఈ సింధూర వేళ… నీ శృంగారలీల
సుఖ శిఖరం… శుభయోగం…. అది నా సంగీతం
చరణం: 1
ఎంతకు తీరని ఎదలో ఆశలేమో…
అడగరానిదై చెప్పరానిదై.. పెదవుల అంటింతనై…
మాటతో తీరని మదిలో దాహమే
చిలిపి ముద్దుకై.. చినుకు తేనెకై … కసికసి కవ్వింతలై
నీ నవ్వు నాలో… నాట్యాలు చేసే
కౌగిట్లో.. సోకమ్మ వాకిట్లో… తెరిచే గుప్పిళ్లలోన…
ప్రణయం శరణం గఛ్చామి…. హృదయం శరణం గఛ్చామి
చరణం: 2
చూపుతో గిచ్చక.. వయసే లేతదమ్మా…
వలపు గాలికే వాడుతున్నది.. విసరకు పూబాణమే
చేసుకో మచ్చిక … వరసే కొత్తదమ్మా
చలికి రేగిన ఒడికి చేరిన.. చెరిసగ మీ ప్రాణమే
నీ ఊపిరి నాలో పూలారబోసి…
అందాలో నా ప్రేమ గంధాలో… ముసిరే ముంగిళ్లలోన
అందం శరణం గఛ్చామి… హృదయం శరణం గఛ్చామి
ఈ సాయంత్ర వేళ … నీ ఏకాంతసేవ
సుఖ శిఖరం శుభయోగం… అది నా సంగీతం
****** ****** ******
చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
పల్లవి:
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానము దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదు పోరా
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
చరణం: 1
ఆ దేవుడు మస్తుగా తాగి బొమ్మల్నే సృష్టి చేసి
అరె గజిబిజి పడుతున్నాడు తన తప్పే తనకు తెలిసి
ఓయ్ ఉన్నవాడిదే దోపిడి లేనివాడికే రాపిడి
లోకం ఇట్టా ఏడ్చెరా దీనిని ఎవ్వడు మార్చురా
ప్రతి ఒక్కడు ఏమార్చురా గుడికెళ్ళినా గుణమేదిరా
ష్… తప్పై పోయిందిరో క్షమించురో క్షమించు
నరుడా మందు కొట్టేవాడే నీకు పరమ గురుడా
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
చరణం: 2
ఏ నాయకుడైనా పాపం వచ్చేది సేవ కోసం
అరె కడుపులు వాడే కొడితే అది కుర్చీలోని దోషం
రాజకీయాలెందుకు తన్నుకు చచ్చేటందుకు
రాత్రి పగలు తాగితే రాజు బంటు ఒక్కటే
నా మాటలో నిజముందిరా అది నమ్మితే సుఖముందిరా
వాదాలెందుకయ్యా మందు వేసేయ్ ముందు వెయ్యాస్
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానము దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదు పోరా రేయ్
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
నిత్యం ఇదే అనుభవం
****** ****** ******
చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
పల్లవి:
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే
చెమ్మాచెక్క చేత చిక్క
మంచమల్లె మారిపోయె మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ
చరణం: 1
తేనీటి వాగుల్లో తెడ్డేసుకో
పూలారబోసేటి ఒడ్డందుకో
శృంగార వీధుల్లో చిందేసుకో
మందార బుగ్గల్ని చిదిమేసుకో
సూరీడుతో ఈడు చలికాచుకో
పొద్దారిపోయాక పొద చేరుకో
గుండెలోనే పాగా గుట్టుగా వేశాక
గుట్టమైన సోకు నీదే కదా
అరె తస్సా చెక్క ఆకు వక్క
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము
పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ
చరణం: 2
సింధూర రాగాలు చిత్రించుకో
అందాల గంధాల హాయందుకో
పన్నీటి తానాలు ఆడేసుకో
పరువాలు నా కంట ఆరేసుకో
కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో
చిలక పచ్చ రైక బిగి చూసుకో
గూటి పడవల్లోన చాటుగా కలిశాక
నీటికైనా వేడి పుట్టాలిలే
పూత మొగ్గ లేత బుగ్గ
సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు
హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు
అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే
చెమ్మాచెక్క హా చేత చిక్క హా
మంచమల్లె మారిపోయె మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు
****** ****** ******
చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, జానకి
పల్లవి:
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్
ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ
చరణం: 1
ఒంటిగా పండుకోనీదు కంటికే మత్తు రానీదు
అదే ధ్యాస అదే ఆశ నేనాగేదెట్టాగా
పువ్వులే పెట్టుకోనీదు బువ్వనే ముట్టుకోనీదు
అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగా
కోరికే తహతహమంటాది ఊపిరే చలిచలిగుంటాది
అదేం సెగలో ఇదేం పొగలో అదేలే ఈడంటే..హే
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ
చరణం: 2
బుగ్గకే సిగ్గు రాదాయే మనసుకే బుద్ధి లేదాయే
అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగా
చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే
అదేం కిలకో అదేం పులకో నే బతికేదెట్టాగా
రెప్పలో రెపరెపగుంటాది రేతిరే కాల్చుకు తింటాది
అవేం కలలో అవేం కథలో అదేలే ప్రేమంటే..హాయ్
ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హే
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్