చిత్రం: పసుపు పారాణి (1980)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: మురళీమోహన్, సుజాత, కవిత
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
నిర్మాతలు: కొటికల పూడి గోవిందరావు, ఆకుల బుల్లి అబ్బాయి
విడుదల తేది: 1980
రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోనా .. చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ .. చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది
పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది
ఇసుక తిన్నెపై గవ్వలు నవ్వులెండ పెడుతున్నాయి
రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది
ఓహో..ఆఆఅ..ఆఆఆ…
జలతారు జిలుగు పైట చదరంగం ఆడుతోంది
లలలల లలల లలల హో…
జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట చదరంగమాడుతోంది
జలదరించి పై పెదవి చలివెందర పెడుతోంది
బాజాలకు మాటిద్దామా… బాసికాలు కట్టిద్దామా
బాజాలకు మాటిద్దామా… బాసికాలు కట్టిద్దామా
రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
ఈ కళ్ళతో ఆ కళ్ళు గస్తీలు కాస్తున్నాయి
ఓహో..అఆఅ…ఆఆ…ఆఅ
ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నాయి
లలలలల్ లలల లలల అహాహ హ..
ఆ కళ్ళతో ఈ కళ్ళు గస్తీలు కాస్తున్నయ్
ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నయ్
మురిపించే ఆ పలుకులు స్వస్తి పలుకుతున్నాయి
తోరణాలు కట్టిద్దామా… తొలివలపులు పండిద్దామా
తోరణాలు కట్టిద్దామా… తొలివలపులు పండిద్దామా
రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటుంది
ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది