చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం:
గానం: రాహుల్ నంబియర్
నటీనటులు: కళ్యాణ్ రామ్ , శృతి సోది, సాయికుమార్
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 23.01.2015
ఓ మై ఓ మై బేబీ నన్నొదిలేసి వెళ్లిపోమాకే
ఓ మై ఓ మై బేబీ జర నవ్వేసి ఓ లూక్కివ్వే
ఓసి చిన్నదాన మూతి తిప్పమాకే
ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే
ఓసి కుర్రదాన తుర్రు మనకే
చిర్రు బుర్రు లాడకే కళ్ళు ఎర్ర జెయ్యకే
ఓ చంచాడు జాలి చూపవే
ఓ గుప్పెడు ప్యార్ పంచవే
ఓ గంపెడు ముద్దులు నా ఖాతాలో వెయ్యవే
మిల్లీ మీటర్ అంత చూపు చాలే
సెంటీమీటర్ అంత స్మైల్ చాలే
నీకు నాకు మధ్య వేల మైళ్ళ ల దూరం కరిగించాలే
పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణిలా చూస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
ని కనులకు కాజల్ లా నీ కలలన్నీ చదివేస్తానే
నీ చేతుల గాజుల్లో సవ్వడల్లే ఉంటా
నీ చెవులకి లోలాకై ప్రేమల ఊసులే వినిపిస్తానే
నీ పెదవికి తమలాకై తీపి పంచుతుంటా
కుంచె లాగ నిన్ను బొమ్మ గీస్తా
కంచె లాగ నిన్ను కాపు కాస్తా
ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా
పచ్చబొట్టు లాగ అంటి ఉంటా
గట్టులేని ఒట్టు నేనౌతా
నీ కాలికి మెట్టెను నేనై నడిపించేస్తా
పూవులే ఇస్తా పూజలే చేస్తాలే
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
ఓ బేబీ లవ్ మీ అంటూ వెంట వెంట నీకై తిరిగాడమ్మ
రఫ్ అండ్ టఫ్ పోలీసోడే రోమియోలా మారిపోయెనే
నీకై పడిచస్తున్నాడే కేసులన్ని పక్కనెట్టి వస్తున్నాడే
వీడి ఫ్యూచర్ నువ్వేనమ్మా బుజ్జగించి ప్రేమ పంచవే
వేసవిలో నీకోసం ప్రేమల వానల మేఘాన్నవుతా
ఈ చలిలో నులి వెచ్చని కౌగిలింత నౌతా
వేకువలో నిను తాకే తొలి కిరాణాన్నై తలుపే తడతా
చీకటిలో నీకోసం జాబిలల్లే వస్తా
పిలుపు కంటే ముందే పలికేస్తా
తలుచుకోక ముందే కనిపిస్తా
కనిపించని నీ ప్రాణానికి ప్రాణాన్నవుతా
ఆగిపోని గుండె చప్పుడంటే
అలిసిపోని ఊపిరంటు ఉంటే
నీ అసలే శ్వాసగా మారిన నేనేనంటా
పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణిలా చూస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే