చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: రేలంగి
నటీనటులు: యన్. టి.రామారావు, యస్.వి.రంగారావు, కె.మాలతి
దర్శకత్వం: కదిరి వెంకటా రెడ్డి (కె.వి.రెడ్డి)
నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 15.03.1951
వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల
నీకే నువ్వేల నిలువగజాల
వినవే బాల నా ప్రేమగోల
గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
వినవే బాల నా ప్రేమగోల
చిరునవ్వుచాలే చిత్తైపోతానే
చిరునవ్వుచాలే చిత్తైపోతానే
మురిపించేస్తాలే మూర్చైపోతానే
వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల
జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
మేడమీద పైడబంగార్ తూగుటుయ్యాల్ వేడుకల్గా ఊగరావా ఊగరావా ఊగరావా ఊగరావా
చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
చెట్టాపట్టిల్ జడకోలాటం
చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఉప్ ఉప్ తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో
******* ******* ********
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పి.లీల
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
వని అంతా జలదరించెనే తనువెంతో పులకరించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
ఓ ఓ ఓ ఓ
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
వని అంతా రవళించేనే నన్నెంతో మురిపీంచేనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
******* ******* ********
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల
ప్రణయజీవులకు దేవివరాలే
కానుకలివియే ప్రియురాల
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా
చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
కలసిమెలసి పోదమోయ్ వలపుబాటన
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా
నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీవు నేను విడివడని ప్రేమమాలగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా
కలలు నిజముకాగా కలకాలమొకటిగా
కలలు నిజముకాగా కలకాలమొకటిగా
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా – స్వేచ్చగా – హాయిగా
******* ******* ********
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను కాంచుచున్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే నా మనసు మురిసెనే
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో
కన్నులలో కనిననంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే నా మనసు నిలిచెనే
ఎంత లేత వలపులో
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
విరహములో వివరాలను విప్పిచెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుచేయరే
ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో
******* ******* ********
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల
కనుగొన గలనో లేనో
కనుగొన గలనో లేనో
ప్రాణముతో సఖిని
కనుగొన గలనో లేనో
పెండ్లి పీట పై ప్రియనెడబాయ
గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీట పై ప్రియనెడబాయ
గాలి మేడలు గారడి కాగా
కల కాలమును కర్మను దూరుచు
కలగ బ్రతకడ మేనో
కనుగొన గలనో లేనో
వెదకి వెదకి ఏ జాడ తెలియక
హృదయమంత చీకటిగా
వెదకి వెదకి ఏ జాడ తెలియక
హృదయమంత చీకటిగా
ఎంత పిలిచినా పిలుపే అందక
చింతిని తిరగడమేనోయ్
కనుగొన గలనో లేనో
పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
జాలిలేని ఆ మాయదారికే
బలిగా చేయడమేనో…
కనుగొన గలనో లేనో
ప్రాణముతో సఖిని
కనుగొన గలనో లేనో
కనుగొన గలనో లేనో
******* ******* ********
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో