Pavitra Bandham (1971)

pavitra bandham 1971

చిత్రం: పవిత్రబంధం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల
నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీ, కాంచన
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: టి.గోవింద రాజన్
విడుదల తేది: 1971

పల్లవి:
గాంధి పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా
గాంధి పుట్టిన దేశమా…

చరణం: 1
సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం (2)
ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు
యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు

చరణం: 2
సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ (2)
శాంతి సహనం సమధర్మం పై విరిగెను గూండా లాఠీ
అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ
హెచ్చెను హింసాద్వేషం ఏమవుతుందీ దేశం

చరణం: 3
వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లెసైన్స్
అర్హతలేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ యస్
సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం

******  ******  *******

చిత్రం:  పవిత్ర బంధం (1971)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం:  ఆరుద్ర
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ
సగం సగం.. నిజం నిజం
నీవో సగం.. నేనో సగం
నీవో సగం.. నేనో సగం
సగాలు రెండూ.. ఒకటైపోతే
జగానికే ఒక.. నిండుదనం
నిజం నిజం.. నిజం నిజం… ఫిఫ్టీ..ఫిఫ్టీ

చరణం: 1
నీవే నాదం.. నేనే గీతం
నీవే నాదం.. నేనే గీతం
నీ నా కలయిక.. సంగీతం
నీ నా కలయిక.. సంగీతం

నీవే నింగి.. నేనే నేల
నీవే నింగి.. నేనే నేల
నిండు విలీనమే.. ఈ భువనం

నీవే కుసుమం.. నీవే భ్రమరం
పువ్వూ తుమ్మెద.. ఒకటైపోతే
జగానికే ఒక.. కమ్మదనం

నిజం నిజం.. నిజం నిజం
ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ 

చరణం: 2
రాధ సగం.. మాధవుడు సగం
రాధ సగం.. మాధవుడు సగం
రాసవిహారమే.. ప్రణయమయం
రాసవిహారమే.. ప్రణయమయం

గౌరి సగం.. శివుడు సగం
గౌరి సగం.. శివుడు సగం
అర్ధనారీశ్వరమే.. అఖిల జగం

అవినాభావం.. అమృతరావం
అభేద రూపం.. స్థిరమైపోతే
జగానికే ఒక  అమర పథం

నిజం నిజం.. నిజం నిజం .. ఫిఫ్టీ…ఫిఫ్టీ
సగం సగం.. నిజం నిజం
నీవో సగం.. నేనో సగం
సగాలు రెండూ ఒకటైపోతే
జగానికే ఒక నిండుదనం
ఫిఫ్టీ..ఫిఫ్టీ.. ఫిఫ్టీ..ఫిఫ్టీ

******  ******  *******

చిత్రం:  పవిత్ర బంధం (1971)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం:  ఆరుద్ర
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
పచ్చ బొట్టు చెరిగిపోదులే…నా రాజా..
పడుచు జంట చెదరీపోదులే…. నా రాజా..
పచ్చ బొట్టు చెరిగిపోదులే.. నా రాణీ..
పడుచు జంట చెదరీపోదులే ..నా రాణీ..

పచ్చ బొట్టు చెరిగిపోదులే…

చరణం: 1
పండిన చేలు …పసుపు పచ్చా
పండిన చేలు… పసుపు పచ్చా
నా నిండు మమతలు.. మెండు సొగసులు..
లేత పచ్చా..ఆ..ఆ..

నీ మెడలో పతకం …చిలక పచ్చా
మన మేలిమి గురుతీ… వలపుల పచ్చా

పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాణీ
పడుచు జంట చెదరీపోదులే..నా రాణీ
పచ్చ బొట్టు చెరిగిపోదులే..నా రాజా

చరణం: 2
కలసిన కలయిక …తలవని తలపు
మన కలసిన కలయిక …తలవని తలపు
నీ చెలిమి విలువకే …చేతి చలువకే…చిగిర్చే నా మనసు

తిరిగెను బ్రతుకే… కొత్త మలుపు..ఊ…
ఇది తీయని వాడని …మన తొలి వలపు

పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాజా
పడుచు జంట చెదరీపోదులే…నా రాణీ…

పచ్చ బొట్టు చెరిగిపోదులే ..

చరణం: 3
నూరేళ్ళ వెలుగు… నుదుటి బొట్టు
నూరేళ్ళ వెలుగు… నుదుటి బొట్టు
అది నోచిన నోములు… పూచిన రోజున …పెళ్ళి బొట్టు
కట్టేను నీచేయ్… తాళిబొట్టు
కట్టేను నీచేయ్… తాళి బొట్టు
అది కలకాల కాంతుల… కలిమి చెట్టు

పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాణీ
పడుచుజంట చెదరీపోదులే…నా రాజా
పచ్చ బొట్టు చెరిగిపోదులే…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top