Pavitra Prema (1998)

చిత్రం: పవిత్ర ప్రేమ (1998)
సంగీతం: కోటి
నటీనటులు: బాలకృష్ణ , లైలా , రోషిని
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: వి.శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 04.06.1998

చిత్రం: పవిత్ర ప్రేమ (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు , సుజాత మోహన్

పల్లవి:
ఓ రంగా శ్రీ రంగా ఏరువాక  సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
కుర్ర ఈడు గంతులేసి ఆడంగా  ఓ… ఓ…
కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ..ఓ..
వన్నెగాడు వెన్నుతట్టగా ఆ హుషారులో
ఒళ్ళు తుళ్ళి ఊయలూగగా

ఓ..ఓ..ఓ..ఓ..ఓ…….
ఓ..ఓ..ఓ..ఓ..ఓ…….

ఓ రంగా శ్రీ రంగా ఏరువాక  సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా

చరణం: 1
చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా
హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్..
కస్సుమన్న ఆవేశం కొంగుపట్టగా
హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్..
వయసా ఉండవే రెడీ రెడీగా
సొగసా సోలిపో మాజా మాజాగా
కానీ కవ్వింపు అదే విధంగా
పొంగే పరువాల మతే చెడంగా
తరించని తలో రకంగా
ముద్దాడుకునే వయస్సుకి అదేసుఖంగా

ఓ రంగా శ్రీ రంగా ఏరువాక  సాగని ఏకంగా

చరణం: 2
ముక్కుపుడక  వెలుతురులో మోజు వెచ్చగా
హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్..
సిగ్గుపడిన కన్నెతనం అడ్డుచెప్పగా
హొయ్ హొయ్, హొయ్ హొయ్, హొయ్ హొయ్ హొయ్..
చెవిలో చెప్పనా వినే విధంగా
ఒడిలో చేరితే హడా విడిగా
రావే చిన్నారి ఖుషి ఖుషీగా
నీలో దాగుంటా భలే భలేగా
వరించుకో ప్రియా ప్రియంగా
నీ కౌగిలిలో సుఖించని సుఖీభవంగా…

ఓ రంగా శ్రీ రంగా ఏరువాక  సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
కుర్ర ఈడు గంతులేసి ఆడంగా  ఓ… ఓ…
కొంటె పెదవి ముద్దుపాట పాడంగా ఓ..ఓ..
వన్నెగాడు వెన్నుతట్టగా ఆ హుషారులో
ఒళ్ళు తుళ్ళి ఊయలూగగా

ఓ..ఓ..ఓ..ఓ..ఓ…ఓ…..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ…ఓ…..

చిత్రం: పవిత్ర ప్రేమ (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర

పల్లవి:
చైత్రమా రా రా రా
ఓ చైత్రమా రా రా రా
తియ్యని తేనెల సుమగంధమా
కిందట జన్మల అనుబంధమా
వరములా దొరికిన పవిత్ర ప్రేమ

చైత్రమా రా రా రా
నా చైత్రమా…

చరణం: 1
ఇప్పుడే సూర్యోదయం చూస్తూవున్నా సరికొత్తగా
వెచ్చగా నన్నే అల్లె  నీ స్నేహమే సాక్షిగా
ఎప్పుడో నీ కోసమే నిరీక్షించా నీట్టూర్పుగా
ఆశగా సుస్వాగతం ఆలాపించే చూపుగా
వలపే పూసే వనసీమా
చెలిమే రాసే చిరునామా
మన ఒద్దికలోనె ఉందని అంది పవిత్ర ప్రేమ

చైత్రమా రా రా రా
నా చైత్రమా…

చరణం: 2
జీవితం దేవాలయం అయ్యిందమ్మ ఈ రోజున
నువ్విలా దేవేరిలా ఉంటే చాలు అంటున్నా
ఎగిరే ఈ పావురం వాలిందయ్యా  నీ నీడనా
పిలిచే నీ కౌగిలే నా గోపురం అనుకోనా
కళలేనిండే వెన్నెలేదో
కలలే పండే వెలిగేదో
మన కన్నులలోనె చూడాలంది పవిత్ర ప్రేమ

ఓ చైత్రమా రా రా రా
ఓ చైత్రమా రా రా రా
తియ్యని తేనెల సుమగంధమా
కిందట జన్మల అనుబంధమా
వరములా దొరికిన పవిత్ర ప్రేమ

చైత్రమా రా రా రా
నా చైత్రమా…