Peddarikam (1992)

చిత్రం: పెద్దరికం (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: జగపతిబాబు, సుకన్య, భానుమతి రామకృష్ణ, యన్. యన్. పిళ్ళై
దర్శకత్వం & నిర్మాత:  ఎ.ఎమ్. రత్నం
విడుదల తేది: 1992

ప్రియతమా  ప్రియతమా
తరగనీ పరువమా
తరలిరా ఓ తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే…

ప్రియతమా ప్రియతమా
తరగనీ విరహమా
కదలిరా ఓ కదలిరా
మాఘ మాసానివై మల్లె పూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా…

ప్రియతమా ప్రియతమా
తరగనీ పరువమా
తరలిరా  ఓ తరలిరా

నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో
ఓ ఓ ఓ  నీ ఊసులన్నీ నా బాసలైనా  ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా… ఆ…
సుడిగాలినైనా ఒడి చేరనా… ఓ…
నీడల్లే నీ వెంట నేనుంటా
నా ప్రేమ సామ్రాజ్యమా

ప్రియతమా  ప్రియతమా
తరగనీ విరహమా
కదలిరా ఓ కదలిరా

పెదవుల్ని తడితే పుడుతుంది తేనే తియ తియ్యగా
ఓ ఓ ఓ కౌగిట్లో పడితే పుడుతుంది వానా కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసెయ్యనా… ఓ…
ఏకాంత సేవా చేసేయనా… ఓ…
వెచ్చంగ చలి కాచుకోవాలా  నీ గుండె లోగిళ్ళలో

ప్రియతమా ప్రియతమా
తరగనీ పరువమా
తరలిరా ఓ తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే…

ప్రియతమా ప్రియతమా
తరగనీ విరహమా
కదలిరా ఓ  కదలిరా

*********    *********   *********

చిత్రం: పెద్దరికం (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వాడేపల్లి చంద్ర
గానం: కె. జే. యేసుదాసు

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేన
ప్రేమలే దూరమయ్యేన
నిరాశే నింగి కెగసేన
ఆశలే రాలిపోయేన

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే
కసిగా శిశువును కుమ్మితే
మనిషే పశువుగ మారితే
కసిగా శిశువును కుమ్మితే
అభము శుభము ఎరుగని
వలపులు ఓడిపోయేన

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేన
ప్రేమలే దూరమయ్యేన
నిరాశే నింగి కెగసేన
ఆశలే రాలిపోయేన
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

విరిసి విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లారవ
ఆర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రూగితే
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రూగితే
పొగలో సెగలో మమతల
పువ్వులు కాలిపోయేనా

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేన
ప్రేమలే దూరమయ్యేన
నిరాశే నింగి కెగసేన
ఆశలే రాలిపోయేన

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

*********    *********   *********

చిత్రం: పెద్దరికం (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
ఆ మాటే చాలు నెలవంక రా ఇక
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా

విలాసాల దారి కాచా సరాగాల గాళమేశా
కులసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా
మరో నవ్వు రువ్వరాదటే

నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి

మల్లెపూల మంచమేసి హుషారించనా
జమాయించి జాజిమొగ్గ నిషా చూడనా
తెల్ల చీర టెక్కులేవో చలాయించనా
విర్ర వీగు కుర్రవాణ్ణి నిభాయించనా

అతివకు ఆత్రము తగడటగా
తుంటరి చేతులు విడువవుగ
మనసు పడే పడుచు ఒడి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…

నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి

కోరమీసమున్న వాడి కసే చూడనా
దోర దోర జమాపళ్ళు రుచే చూపనా
కొంగుచాటు హంగులన్ని పటాయించనా
రెచ్చి రేగు కుర్రదాన్ని ఖుమాయించనా
పరువము పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగా
తదిగినతోం

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…

నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
విలాసాల దారి కాచా సరాగాల గాళమేశా
కులసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా
మరో నవ్వు రువ్వరాదటే

నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ఆ మాటే చాలు నెలవంక రా ఇక

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Ye Maaya Chesave (2010)
error: Content is protected !!