చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు
నటీనటులు: నవీన్, మహేశ్వరి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: రామ లింగేశ్వరరావు
విడుదల తేది: 1997
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె
అల్లాడిపోదా రేయి ఆపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..
చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా
చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా
ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా
హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా
మరి అంత దూరమా కలలుకన్న తీరమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..
మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మా
మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా
ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా
తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా
ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె
అల్లాడిపోదా రేయి ఆపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..
********* ********* ********
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జే. యేసుదాసు
అనురాగమే మంత్రంగా
అనుబంధమె సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్లికి
మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
ఓ… మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
అనురాగమే మంత్రంగా
మూడుముళ్లు తోనే పెళ్లి పూర్తి కాదు అని
మరో ముడిగ చేరుకున్న స్నేహ బంధమిది
సప్తపదితో ఆగరాదు జీవితం అని
అష్ట పదిగ సాగమంది ప్రేమ పదము ఇది
నాతి చరామి మంత్రములో
అర్ధము తెలిసిన నేస్తముతో
అడుగు కలుపుతు వెలుగు వెతుకుతూ
సాగె సమయమిది ఆగని పయనమిది
అనురాగమే మంత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్లికి
మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
అనురాగమే మంత్రంగా
ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని
అత్త గుండెలోన కూడ అమ్మ ఉన్నదని
బొమ్మలాట లాడుతున్న బ్రహ్మ రాతలని
మార్చిరాసి చూపుతున్న మానవత్వమిది
చరితల చదవని తొలి కథగా
మనసులు ముడిపడు మనుగడగ
తర తరాలుకు నిలిచి పొమ్మని
తల్లిగ దీవించే చల్లని తరుణమిది
అనురాగమే మంత్రంగా
అనుబంధమె సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్లికి
మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
ఓ… మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం
అనురాగమే మంత్రంగా
********* ********* ********
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
దొరికే చుక్కను ఏలే దొరనే నవ్వాల
కొరికే కోరిక చూసి చిలకై నవ్వాల
వన్నెల్లో అంతా మనకేసె చూసే వేళ
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
నిద్దుర చెడి మధన పడి మదిని లాలించాలి
ముచ్చట పడే ముద్దుల తడే మొదటి ముడవ్వాలి
ప్రతి పొదలో మన కథలే కొత్త పూత పూయించాలి
మతి చెదిరే శృతి ముదిరే తందనాలు పొక్కించాలి
పందిరి పట్టే అందాలన్ని సందిట పెట్టాలి
తొందరపెట్టే ఆరాటాన్ని ముందుకు నెట్టాలి
ఏకాంతాన్నంత మన జంటే పాలించాలి
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
సిగన నువ్వే మొగలి పువ్వై ఒదిగి ఉందువు గాని
చిలిపి నవ్వే పిలుపు నిస్తే రానా కిన్నెర సాని
కోడె నాగుల కొంటె సెగలే చుట్టుకొని కాటెయ్యాలి
కొండ వాగుల కన్నె వగలే కమ్ముకొని కవ్వించాలి
చిటిక విని సంతోషంతో తెచ్చా సొంపుల్ని
కలలు గనే సావాసంతో గిచ్చా చెంపల్ని
కౌగిల్లో రాని ఎదపాడే రాగలన్ని
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
దొరికే చుక్కను ఏలే దొరనే నవ్వాల
కొరికే కోరిక చూసి చిలకై నవ్వాల
వన్నెల్లో అంతా మన కేసి చూసే వేళ
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాలా
వాగు వంక వంపుల్లో సాగే జంపాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
********* ********* ********
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదిక ఈడు
నచ్చజెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు
కాసుకో అమ్మడు కొంటె దూకుడు
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
సొగసులు ఇమ్మని నిను బతిమాలని
తెగబడి రమ్మని పిలవకు వయసుని
సొగసులు ఇమ్మని నిను బతిమాలని
తెగబడి రమ్మని పిలవకు వయసుని
అదిరిపడే పెదవులలో అనుమత నే చదవని
బిడియ పడే మనసు కదా అడగకు పైకనమని
బెదురు ఎంత సేపని ఎవరున్నారని
అదును చూసి గమ్ముని అందాలయ్యా అందాన్ని
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
ఓ పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
చలి చలి గాలిలో చెమటలు ఏంటట
వలపుల లీలలో అది ఒక ముచ్చట
చలి చలి గాలిలో చెమటలు ఏంటట
వలపుల లీలలో అది ఒక ముచ్చట
ఎదురు పడే మదనుడితో వరస ఎలా కలుపుట
తెరలు విడే తరుణములో తెలియనిదేముందట
మాయదారి ప్రేమలో ఏంచేయాలట
మోయలేని హాయిలో ఒళ్ళో కొస్తే చాలట
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
ఆ… పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదిక ఈడు
నచ్చజెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు
కాసుకో అమ్మడు కొంటె దూకుడు
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
********* ********* ********
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా
ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారు గున్నది ఓరెవ
అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగ ఉందిర వారెవ
రుక్కు రుక్కు రుక్కు మిని హొయ్
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా
ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ
బుగ్గమీద సిగ్గు బొమ్మ విచ్చిందోయమ్మ
ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ
బుగ్గమీద సిగ్గు బొమ్మ విచ్చిందోయమ్మ
విరిసి విరియని మొగ్గర ముద్దే తగలని బుగ్గరా
మెరిసే ఈ సిరి నీదిర వరమే అనుకో సోదరా
అందమైన కుందనాల కూన నీ చెంత చేరుతున్నది కదరా నాన్న
పొందికైన సుందర వదన నీ పొందుకోరుతున్నది
పదరా నాన్న
సొంపులందుకో – హొయ్
స్వర్గ మేలుకో – హొయ్
చిన్నదాని వన్నెలన్ని కన్యాదానమందుకోని నవాబువైపోరా నీ నసీబు మారునురా
రుక్కు రుక్కు రుక్కు మిని హొయ్
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా
కలికి నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారెగ
చిలక నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలెగ
అరెరరె బంగరు జింక నీకు అంతలోనే ఇంతటి సిగ్గా సిగ్గా
అపుడే ఏమైంది గనక ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా
కంటి విందుగా – హొయ్
జంట కట్టగా – హొయ్
హోరు హోరు హోరు అంటు ఊరు వాడ అంత చేరి హుషారు హంగామా
మహా కుషీగ చేద్దామా
అరెరరె…
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా
ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారు గున్నది ఓరెవ
అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగ ఉందిర వారెవ
********* ********* ********
చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు
ఓ యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
ఓ యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వుంటు పుట్టినట్టు నాకొరకు
ఆచూకి అందలేదు ఇంతవరకు
వచ్చింది గాని ఈడు ఒంటి వరకు
వేదించలేదు నన్ను జంట కొరకు
చూశాక ఒక్కసారి ఇంత వెలుగు
నా వంక రాను అంది కంటి కునుకు
ఈ అల్లరి ఈ గారడి నీ లీలే అనుకోన
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
ఓ యవ్వన వీణ పువ్వుల వాన
ఏ పూల తీగ కాస్త ఊగుతున్న
నీ లేత నడుమే అనుకున్నా
ఏ గువ్వ కిలకిల వినపడినా
నీ నవ్వులేనని వెళుతున్నా
మేఘాల మెరుపులు కనబడిన
ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
ఓ యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న