చిత్రం: పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జే. యేసుదాసు
నటీనటులు: వెంకటేష్, సౌందర్య, లైలా
దర్శక్కత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: జి.వెంకట్ రాజు, జి. శివరాజు
విడుదల తేది: 09.10.1997
నువ్వేమి చేసావు నేరం
నిన్నెకడ్డంటింది పాపమ్ చినబోకుమా
నువ్వేమి చేసావు నేరం
నిన్నెకడ్డంటింది పాపమ్ చినబోకుమా
చేయూతనందించు సాయం
ఏనాడు చేసింది సంఘం గమనించుమా
కన్నీటి వర్షానికీ కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం
నువ్వేమి చేసావు నేరం
నిన్నెకడ్డంటింది పాపం చినబోకుమా
జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
దేహానికైన గాయం ఏమందుతోను మాయం
విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రదానం
అది నిలిచినంతకాలం సాగాలి నీ ప్రయాణం
స్త్రీల తనువులోనె శీలమ్మున్నదంటె
పురుష స్పర్శతోనె తొలగిపోవునంటె
ఇల్లాల దేహాలలో శీలమె ఉండదనా
భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా
శీలం అంటె గునం అనే అర్ధం
నువ్వేమి చేసావు నేరం
నిన్నెకడ్డంటింది పాపం చినబోకుమా
గురివింద ఈసమాజం పరనింద దానినైజం
తనకింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం
తనకల్లముందు ఘోరం కాదనదు పిరికి లోకం
అన్యాయమన్న నీపై మొపింది పాపభారం
పడతి పరువు కాచె చేవలేని సంఘం
సిగ్గుపడకపోగ నవ్వుతోంది చిత్రం
ఆనాటి ద్రౌపదికీ ఈనాటి నీగతికీ
అసలైన అవమానము చూస్తున్న ఆకళ్లది
అంతేగానీ నీలొ లేదే దోషం
నువ్వేమి చేసావు నేరం
నిన్నెకడ్డంటింది పాపం చినబోకుమా
చేయూతనందించు సాయం
ఏనాడు చెసింది సంఘం గమనించుమా
కన్నీటి వర్షానికీ కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం
******** ******** *******
చిత్రం: పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
ఓ డాడీ డాడీ లవ్ యు
ఓ మమ్మీ మమ్మీ లవ్ యు
ఉయ్ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా
ఇలాగే నిత్యం మన వెంట
సంద్రంలో సందడంతా
చంద్రుడిలో వెన్నెలంతా
చిన్నారి సంతానంగా చేరె మన ఇంట హోయ్
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత
ఏ పూటైనా హ్యాపీగా ఉందాం
మనకొద్దు అంతకు మించి వేరే వేదాంతం
ఏ బాటైనా పరవాలేదంట
సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం
చిరుగాలికి పరిమళమిచ్చే
సిరి మల్లెల వనమై ఉందాం
గగనాన్ని నేలను కలిపే
హరివిల్లుల వంతెన అవుదాం
ఆనందం అంటే అర్థం మనమందాం
ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో
అహహ్హ ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత హ హే అహహ్హ
ఓ డాడీ డాడీ లవ్ యు
ఓ మమ్మీ మమ్మీ లవ్ యు
ఉయ్ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్
మమకారాలే పువ్వుల సంకెళ్ళై
గత జన్మల ఋణబంధాలను గుర్తుకు తెస్తాయి
అనురాగాలే గుండెల సవ్వల్లై
బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి
వరమల్లె దొరికినదేమో
అరుదైన ఈ అనుబంధం
సిరులున్నా దొరకనిదేమో
సరదాలకు ఈ సావాసం
చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి
ఏ చింతా చెంతకు రాని అందాల ఈ సందడి
హా ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత హ హ హా
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట
హే సంద్రంలో సందడంతా
చంద్రుడిలో వెన్నెలంతా
చిన్నారి సంతానంగా చేరె మన ఇంట హోయ్
******** ******** *******
చిత్రం: పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర
ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
చక చకలాడే ఆంధ్రా బంధం సై అంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
ఇలా నేడు మ్యారేజి మూడొచ్చింది
ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ (4)
ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
కంచి పట్టు శారీ నువ్వు కట్టుకోవే ప్యారీ
DCM సూటింగ్ షర్టింగ్ నీకు ఏరి కోరి తెస్తా డార్లింగ్
చిన్నోళ్ళు పెద్దోళ్ళు…
అంతా చూడగ పెళ్లి చేసుకుందాం
చలాకి చమ్ – చమ్చ చమ్ చమ్ (4)
ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
యవ్వనాల రోస్టు నీకు ఫస్ట్ నైట్ ఫీస్టూ
లిప్ లిప్ క్లోజ్ అప్ చేరాలి
లేత కన్నె సిగ్గు పేకప్ కావాలి
ఫేరెక్సో, హార్లిక్సో…
పుట్టే పాపకు సిద్దం చెయ్యాలి
చలాకి చమ్ – చలాకి చమ్ (2)
ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
చక చకలాడే ఆంధ్రా బంధం సై అంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
ఇలా నేడు మ్యారేజి మూడొచ్చింది
ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది…
చలాకి చమ్ – చమ్చ చమ్ చమ్ (4)
******** ******** *******
చిత్రం: పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: యస్. పి. బాలు, చిత్ర
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓయన్నది
దేవత నీవని మమతల కోవేల
తలుపు తెరిచివుంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ
వేచిన ఆమని ఓ యన్నది హ హ హ హా హ
గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మ జన్మ నన్ను నీడకావా
లోకం మన లోగిలిగా
కాలం మన కౌగిళిగా
వలపే శుభ దీవెనగా
బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా…
కోకిల కోకిల – కూ – అన్నద హ హ హ హా హ
వేచిన ఆమని – ఓ – అన్నది హ హ హ హా హ
వాలు కళ్ళతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామ
వేళపాలలు ఏలనమ్మా
వీలు లేనిదంటూ లేదులేమ్మా
మనమేలే ప్రేమికులం
మనదేలే ప్రేమ కులం
కాలన్నే ఆపగలం
మన ప్రేమను చూపగలం
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మ
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవేల
తలుపు తెరిచివుంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
******** ******** *******
చిత్రం: పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర
మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే
తరగని వరమై ఎదల్లో సరిగమ స్వరమై
పెదాల్లో పాడుతోంది నువ్వే
నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా
నేను పరవశమై హృదయాన్ని పరిచేశా
నువ్వే నా దైవంలా భావించా
మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే
ప్రియ జతలో సన్నిధిలో తెలిసెను సంక్రాంతి
చెలి ఒడిలో మనుగడలో దొరికెను సుఖశాంతి
అడగక ముందే ఆమనిలా కనుల ముందే మెరిశావు
గ్రహణము విడిచే జాబిలిలా తళుకుమంటూ వెలిగావు
ప్రాణంలో ప్రాణంగా నిలిచావు
మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే
శిలలాంటి శిథిల వనం చిగురులు తొడిగింది
కలయికతో ప్రణయ రథం పరుగులు తీసింది
పిలిచిన పలికే పెన్నిదిలా వలపు నిధులే పంచావు
అతిథిగ చేరి హారతిలా చలువ చెలిమే చిలికావు
అందించా అర్పించా అణువణువు
మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే
నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా
నేను పరవశమై హృదయాన్ని పరిచేశా
నువ్వే నా దైవంలా భావించా
******** ******** *******
చిత్రం: పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర
ఓ లైలా…
ఏహే లైలా ఏహే హే
ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
నువ్వొస్తే చాలే బాలా రాసిస్తా నింగి నేలా
ఎస్ అంటే చాలే పోరి కౌగిట్లో ఇట్టా దూరి
చేసేస్తా చోరి చోరి ఓ పోరీ…
ఓ రాజా హిందూస్థానీ నీదేలే ఈ మహారాణి
ఐ లవ్ యు అంటున్నానే కానిచ్చేదేదో కానీ రోమానీ…
పసి పసి పువ్వా… నీ పెదవులనివ్వా… హ హా
పడుచు గాలి తాకిందిలే
పైట రంగు మారిందిలే
ఉప్పొంగిపోయే వయ్యారాలా ఊపెంతో చూడాలి
ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
ఐ లవ్ యు అంటున్నానే కానిచ్చేదేదో కానీ రోమానీ…
తహ తహలాడే హొయ్ తనువుల దాహం
సొగసు తెరలు విప్పిందిలే
కిటుకులేవో చెప్పిందిలే
పరువాలు నేర్పే పాటం కోసం పెళ్లాడుకుందామా
ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా
నువ్వొస్తే చాలే బాలా రాసిస్తా నింగి నేలా
ఐ లవ్ యు ఓ షికారి
సందిట్లో చక్కా దూరి చేసేస్కో చోరి చోరి
ఓ పోరీ …