Pelli Kanuka (1998)

Pelli Kanuka Lyrics

సువ్వి సువ్వి సువ్వాలా… లిరిక్స్

చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర, మాల్గుడి సుభా
నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాణం: నన్నపనేని అన్నా రావు
విడుదల తేది: 1998

ఆహాఆఆ.. అఅఅఅఅఅ.. అఅఅఅఅఅ..
హోఓ…హోఓ..హోఓ… ఓహో ఓహోఓఓ…

సువ్వి సువ్వి సువ్వాలా… మువ్వా గోపాలా…
నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…

సువ్వి సువ్వి సువ్వాలా… మువ్వా గోపాలా…
నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…

గువ్వా గువ్వా… వెన్నెల గువ్వా…
మా మాటలు వింటున్నావా అఅఆ…
పువ్వా పువ్వా… పున్నమి పువ్వా…
చిరు నవ్వుతో చూస్తున్నావా…
నువ్వు కోరిన గూటికి
రమ్మంటా… గువ్వా…
నీ కోవెల దారిని చూపెడతా…
గువ్వా… నువ్వు ఊఁ అంటావా…

సువ్వి సువ్వి సువ్వాలా… మువ్వా గోపాలా…
నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…

ఆఅహహహాఆఆఆ… అహ్హహ్హహ్హఆ అఅ…
నీ ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గేరా…
ఈ పైడి బొమ్మా…
నీ కంటి వాకిట వెయ్యేళ్ళ వెలుగేరా…
సిరి మల్లె కొమ్మా…
ఈ కన్నె తారక జంటైతే నువ్వే రా…
ఆ చందమామ…
ఈ ఎంకి చేరితే నీ సొంతమైపోదా …
ఆనంద సీమ…

ఆఅహహహాఆఆఆ… అహ్హహ్హహ్హఆ అఅ…
రాశి పోసినా రాసా కళలను
పూస గుచ్చినా బ్రహ్మ
చూసిన వాళ్లకు ఈర్షు
పుట్టగా మాకందించెనమ్మా…
మా కోటకు రాణిగా రమ్మంటా.. గువ్వా…
నీ కోవెల దారిని చూపెడతా..
గువ్వా.. నువ్వు ఊఁ అంటావా…

సువ్వి సువ్వి సువ్వాలా.. మువ్వా గోపాలా…
నవ్వి నవ్వి ఈ వేళా.. రవ్వలు రేపాలా…

తన తనన నన..తన తనన నన
తననన నననన తననన నననన
యెన్నిఎల్లో… యెన్నిఎల్లో… యెన్నిఎల్లో ఓఓఓ…

వసంత కోకిల రాగాల రూపం లా…
చిరునవ్వు సిరులు…
వేసంగి వెన్నెల కురిపించె దీపంలా…
వెలిగేటి కనులూ…
వర్షించు వన్నెల ఆ.. ఇంద్ర తాపంలా…
చిన్నారి కళలు…
ఆ మంచు కొండల మురిపించు తెలుపే రా…
సుగుణాల నిధులు…

ఆహహహాఆఆఆ… ఓహోహోఓఓ..
ఆరు ఋతువులు.. కూడి చేరిన
అందమే నీవమ్మా…
ఏడు జన్మల తోడు వీడని
బంధమై రావమ్మా…
దివి సీమల దీవెన తెమ్మంటా.. గువ్వా…
నీ కోవెల దారిని చూపెడతా..
గువ్వా… నువ్ ఊఁ అంటావా…

సువ్వి సువ్వి సువ్వాలా… మువ్వా గోపాలా…
నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…

సువ్వి సువ్వి సువ్వాలా… మువ్వా గోపాలా…
నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

సువ్వి సువ్వి సువ్వాలా… లిరిక్స్

చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె. ఎస్. చిత్ర
నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాణం: నన్నపనేని అన్నా రావు
విడుదల తేది: 1998

సువ్వి సువ్వి సువ్వాలా… మువ్వా గోపాలా…
నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…

గువ్వా గువ్వా… వెన్నెల గువ్వా…
నా కన్నుల గూటికి రావా అఅఆ…
పువ్వా పువ్వా… పున్నమి పువ్వా…
నీ నవ్వుల కాంతిని తేవా…
ఏ మబ్బుల మాటున
ఉన్నావో… గువ్వా…
ఏ కోవెల ఉందని అనగలనో…
గువ్వా… నన్ వదిలేశావా…

సువ్వి సువ్వి సువ్వాలా… మువ్వా గోపాలా…
నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు రేపాలా…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

రమ్మనే కంటి రెప్పల… లిరిక్స్

చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర
నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాణం: నన్నపనేని అన్నా రావు
విడుదల తేది: 1998

రమ్మనే కంటి రెప్పల రెప రెపలోన
ఝుమ్మనే వింత ఊసుల గుస గుసలోన
గుండెలో తుంటరి సందడి అలలేనా…
కొంటెగా కమ్ముకు వచ్చిన కలలేనా…
ఏది నీ చిరునామా… మనసునే..
గిల్లి నవ్వుతున్న తొలిప్రేమ… ||2||

వాడి చూపుల చొరవెంత?
వయ్యారం బెదిరేంతా…
వేడి ఊపిరి చురుకెంత?
రహస్యం కరిగేంతా…
సిగ్గే చెదిరిన సింగారానికి తలుకెంత?
ఝల్లై కురిసిన నల్లని మబ్బుల మెరుపంతా…
వామ్మో నీ మాటల్లోన బొండు మల్లెల వాన
మత్తు మత్తు ఝల్లుతుంటె అల్లరల్లరల్లరేనయ్యో…

ఏది నీ చిరునామా.. మనసునే..
గిల్లి నవ్వుతున్న తొలిప్రేమ…

రమ్మనే కంటి రెప్పల రెప రెపలోన
ఝుమ్మనే వింత ఊసుల గుస గుసలోన

లేత సొంపుల వయసెంత?
జతిమ్మని అడిగేంతా…
జంట చేరితె ఫలమెంత?
అహా.. అను పులకింతా…
ముద్దే అందిన పెదవింక ఏమందంట?
హద్దే దాటిన సరదాలే కావాలంటా…
పిల్లో ఎంత ఆశ నీకు అల్లా నీ పూల సోకు
అల్లేస్తు ఉంటె నాకు ఒళ్ళు ఝల్లు ఝల్లుమందమ్మా…

ఏది నీ చిరునామా.. మనసునే..
గిల్లి నవ్వుతున్న తొలిప్రేమ…

రమ్మనే కంటి రెప్పల రెప రెపలోన
ఝుమ్మనే వింత ఊసుల గుస గుసలోన
గుండెలో తుంటరి సందడి అలలేనా…
కొంటెగా కమ్ముకు వచ్చిన కలలేనా…
ఏది నీ చిరునామా… మనసునే..
గిల్లి నవ్వుతున్న తొలిప్రేమ…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఈ గాలి ఈ నేల… లిరిక్స్

చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె. ఎస్. చిత్ర, ఎం. ఎం. కీరవాణి
నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాణం: నన్నపనేని అన్నా రావు
విడుదల తేది: 1998

ఆహా… ఆహా…
కుహు కుహు కు కోయిలమ్మ కమ్మని కబురే చెప్పవమ్మ
ఆహాహా… ఆఆఆఆ…
కిలకిల చిలకమ్మ చక్కెర ఊసులు పలుకమ్మ
ఈ గాలి ఈ నేల
వీటిని మించిన స్వర్గం వేరే కావాలా?
పచ్చదనం పసుపుదనం మాకు సిరులమ్మా
మా పల్లెసీమ భూదేవి కుంకుమ
మా పల్లెసీమ భూదేవి కుంకుమ

ఈ గాలి ఈ నేల
ఆహాహా… ఆఆఆఆ…

గిత్తల జోడి పట్టవే ఎక్కి
పట్టర మేని దున్నర దుక్కి
గిత్తల జోడి పట్టవే ఎక్కి
పట్టరా మేని దున్నర దుక్కి

హైలెస్సో.. హైలో హైలెస్సో…
హైలో హైలో హైలో హైలెస్సో…
ఆఆఆఆ…

కమ్ముకునే… చీకటికీ…
కమ్మని జోలల ఊయల పాటలు పాడుతాం
చేరుకునే… వేకువకీ…
రమ్మని రంగుల ముగ్గుల బాటలు చూపుతాం
యేటి ఊయలలూగే పడవల సంగీతం
జానపదముల సాగే పని పాటుల గీతం
చల్లదనం తల్లిగుణం ఉన్న ఊరమ్మ
మా పల్లెసీమ పంచేది ప్రేమ
మా పల్లెసీమ పంచేది ప్రేమ

ఈ గాలి ఈ నేల
ఆహాహా… ఆఆఆఆ…

కోవెలలో… పావురమే…
దేవుడు పంపిన దీవెన తానని అన్నదీ
గుండెలలో… నమ్మకమే…
చెట్టును పుట్టను భక్తిగ పూజిస్తున్నది
నేల తల్లికి చేలే చీరలు నేస్తాయి
మల్లె కొమ్మకి పూలై తారలు వస్తాయి
నల్లధనం కల్లగుణం లేని మనసమ్మ
మా పల్లెసీమ ముత్తైదువమ్మ
మా పల్లెసీమ ముత్తైదువమ్మ

ఈ గాలి ఈ నేల
వీటిని మించిన స్వర్గం వేరే కావాలా?
పచ్చదనం పసుపుదనం మాకు సిరులమ్మా
మా పల్లెసీమ భూదేవి కుంకుమ
మా పల్లెసీమ భూదేవి కుంకుమ

ఈ గాలి ఈ నేల
ఆహాహా…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

బంగారు బొమ్మకు పెళ్లి… లిరిక్స్

చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు, భానుమతి రామకృష్ణ
నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాణం: నన్నపనేని అన్నా రావు
విడుదల తేది: 1998

బంగారు బొమ్మకు పెళ్లి కల వచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్
పచ్చని పందిరిలో కలిసొచ్చిన సందడిలో
మంగళ వాద్యంతో మంచి ముహుర్తంలో
అల్లీ బిల్లీ మేనాలో నిను ఢిల్లీకెత్తుకు పోతానంటు
కానున్న కళ్యాణం అంటున్నదోయ్

బంగారు బొమ్మకు పెళ్లి కల వచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్ ||2||

ఆఅఆ… ఆఅఆ…
బంగారు బొమ్మకు పెళ్లి కల వచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్

ఆకు పచ్చని చిలక రెక్క
పంచవమ్మ శుభలేఖలూ..
చూడ చక్కని జంట కలిపిన
నను మెచ్చుకోవ నలు దిక్కులు
దగ్గరలోనే వినిపిస్తోందా లగ్గం సన్నాయి
ఆ సంగతి తెలియంగానే
సిగ్గులు బుగ్గను నొక్కాయి
నీ చక్కని చెక్కిలి నొక్కులు
పడితే బాగుందమ్మాయీ…

భలె భలె భలె భలె భల్లే…
షాదీ కి బాదా ఆయీ హి హి హీ..
ముబారక్ బాతె కర్దేంగి హల్ ఛల్..

పారాణి పాదాల మాగాణి మారాణి
నీ రాక ఎప్పుడ౦దీ మా రాజధాని

బంగారు బొమ్మకు పెళ్లి కల వచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్ ||2||

తేనెతేటల తెలుగు పాట
తరలి రావే మా ఇంటికీ
కోటి కాంతుల తులసి కోట
కళలు తేవే మా పెరటికీ
ఆ జనక రాజుకు ధీటైన తండ్రి
మన్నించు మా ఇంటి తాంబూలం
ఈ పసుపు కాంతికి మా గడప పండేల
అందించు సీతమ్మ కన్నెదానం
అత్తిల్లునే నీకు పొత్తిళ్లు చేసి
పసిపాపలా చూసుకుంటామని
పదిమందిలో బాస నే చేయనీ…

బంగారు బొమ్మకు పెళ్లి కల వచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్ ||2||

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

మన్నించమ్మా.. ముద్దమందారమ… లిరిక్స్

చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాణం: నన్నపనేని అన్నా రావు
విడుదల తేది: 1998

మన్నించమ్మా.. ఓ ఓ ఓ.. ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మన్నించమ్మా.. ఓ ఓ ఓ.. ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మోసగించి నిను మోసుకు వచ్చిన ఈ గాలిని
చల్లని జాబిలి ముసుగున వచ్చిన ఈ జ్వాలని
కాళరాత్రిలో నిన్ను వదిలి కనుమరుగై పోయెను కననీ..

మన్నించమ్మా.. ఓ ఓ ఓ.. ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మన్నించమ్మా.. (ఆ.. ఆ.. ఆ.. అఅ ఆ.. ఆ.. ఆ.. అఅఆ..)

ఓ ఓ ఓ..
గంగను తాగిన సంద్రంలో చేదేమి పోదు అని
తేనె చినుకుతో తోడు కడితె ఏ తేడా రాదు అని
(అఅ ఆ.. ఆ.. ఆ..)
తెలియక చేశామో… తెలిసే తెలివిగ చేశామో…
అమృతాన్నేనింపుకున్న నీ హృదయాన్ని…
అమృతాన్నేనింపుకున్న నీ హృదయాన్ని
(అఅ ఆ.. ఆ.. ఆ..) ఇంకని ఉప్పని కన్నీటితో నింపిన మా నేరాన్ని..

మన్నించమ్మా.. ఓ ఓ ఓ.. ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మన్నించమ్మా.. (ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ… అఅఆ..)

ఓ ఓ ఓ..
మల్లెని నాటితె ఎడారిలో.. మధుమాసం రాదు అని
తులసిని నాటితె కీకారణ్యం పెరడై పోదు అని
(అఅ ఆ.. ఆ.. ఆ..)
తెలియక చేశామో… తెలిసే తెలివిగ చేశామో…

పారాణి పాదాల మాగాణి రాణీ..
పారాణి పాదాల మాగాణి రాణి
రాతియెదల ఈ కోటకు నిను బలిచేసిన మా పాపాన్ని

మన్నించమ్మా.. ఓ ఓ ఓ.. ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మన్నించమ్మా.. (ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ… అఅఆ..)

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

జీవించు ప్రేమ జంటై నూరేళ్లు… లిరిక్స్

చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం:
నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాణం: నన్నపనేని అన్నా రావు
విడుదల తేది: 1998

(ఆ.. ఆ.. ఆ.. అఅ ఆ.. ఆ )
హ హ హ.. హ హ హ
హ హ హ.. హ హ హ

జీవించు ప్రేమ
జీవించు ప్రేమ జంటై నూరేళ్లు
దీవించునమ్మా దిగివచ్చి దేవుళ్ళు
వర్దిల్లు ప్రేమ వెలుగై వెయ్యేళ్ళు
శిరసొంచునమ్మా ఎదిరించే కాలాలు
సుడిగాలినాపె చెరసాల ఉందా?
కెరటాలనాపె శాసనముంటుందా?

జీవించు ప్రేమ జంటై నూరేళ్లు
దీవించునమ్మా దిగివచ్చి దేవుళ్ళు

హ హ హ.. హ హ హ
హ హ హ.. హ హ హ
(దుంతొంననన…)

ఆపజాలై ప్రేమ కాలే హృదయ వేదం ఎన్నాళ్ళు?
చితులపాలై చెలిమి కోరే చిత్రవధ ఇంకెన్నాళ్లు?
(దుంతొంననన…)

చరితకు అంతటి సంబరమా? కలవని కథలంటే..
ఆశలు విరిసే నందనమా? అనార్కలీ సమాధి అంటే..
మరణిస్తేగాని మరలేదా ప్రేమ
చిగురాలయాల ప్రేమకు చిరునామా..
కథకానేగాని నిజమవ్వదా ఆ ప్రేమ..

కన్నీటిలో కథలు కరగాలా?
కార్చిచ్చులో వలపు రగలాలా?
(జీవించు ప్రేమ.. ఆ.. ఆ.. అఅ)
కన్నీటిలో కథలు కరగాలా?
కార్చిచ్చులో వలపు రగలాలా?

జీవించు ప్రేమ
జీవించు ప్రేమ జంటై నూరేళ్లు
దీవించునమ్మా దిగివచ్చి దేవుళ్ళు

ఉప్పెనల్లె ముంచుకొచ్చే ముప్పుకే నువ్వు ఎదురీదు
ఏకగాను కదపలేని శిఖరమల్లే ఎదురించు…
కత్తుల వంతెన కట్టిన ఈ కక్ష్యను ఓడించు…
నెత్తుటి కాంతుల బాటలలో ప్రణయాన్ని గెలిపించు
కుత్తుకనే తెంచి కీర్తించే కాలం
నీ శక్తి ముందు నిలిచేనా నేస్తం
ప్రళయాన్ని గెలిచే ప్రణయం నీ శస్త్రం

కెరటాల పెనుగోష నీ గానం
గగనాన్ని చీల్చాలి ఆ నాదం
(జీవించు ప్రేమ.. ఆ.. ఆ.. అఅ)
కెరటాల పెనుగోష నీ గానం
గగనాన్ని చీల్చాలి ఆ నాదం
ఆ.. ఆ.. ఆ.. అఅ

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top