చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. బాలు, సుశీల
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి
దర్శకత్వం: బాపు
నిర్మాత: ముళ్ళపూడి వెంకటరమణ
విడుదల తేది: 01.04.1991
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్దం
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మణికి నింపుకో
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
********* ******** ********
చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. బాలు, సుశీల
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
ఓ అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు
హా చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావు
ఎందా…?
చెంపకు కన్నులు చారెడు
సన్నని నడుము పిడికెడు
దువ్వి దువ్వక పువ్వులు ముడిచిన
నల్లని నీ జడ బారెడు
మనసిలాయో…
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
హా అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి
అదేవిటి
ఓ గుటకల చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసు
మ్మ్ గుటకలు చిటికెలు కిటుకులు ఏమిటి సంగతి
ఆ కులుకు చూస్తే గుటకలు
సరసకు రమ్మని చిటికెలు
చక్కని చిన్నది అందం చందం
చేజిక్కాలని కిటుకులు
మనసిలాయో…
కిట్ట మూర్తి కిట్ట మూర్తి మనసిలాయో
మనసిలాయో మనసిలాయో అమ్ము కుట్టి
గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళు
పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు
చుట్టూ చూస్తే అందాలు
లొట్టలు వేస్తూ మా వారు
చుట్టూ చూస్తే అందాలు
లొట్టలు వేస్తూ మా వారు
అక్కడ తమకు ఇక్కడ మనకు
విరహంలోన వెక్కిళ్ళు
మనసిలాయో హొ హొ
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
అమ్ము కుట్టి అమ్ము కుట అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
********* ******** ********
చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. శైలజ, పి. సుశీల
హాయి హాయి శ్రీరంగ సాయి
హాయి హాయి శ్రీరంగ సాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
హాయి హాయి శ్రీరంగ సాయి
ఏదీ కాని వేళ ఎడద ఉయ్యాల (2)
కోరి జో కొట్టింది కుసుమ సిరి బాల
హాయి హాయి శ్రీరంగ సాయి
హాయి హాయి శ్రీరంగ సాయి
అజ్ఞాత వాసాన అతివ పాంచాలి
ఆరళ్ళు భీమన్న దూరమ్ము సేయు
ఆవేశ పడరాదు అలసి పోరాదు
అభిమానమే చాలు అనుచుకోన మేలు
హాయి హాయి శ్రీరంగ సాయి
హాయి హాయి శ్రీరంగ సాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
హాయి హాయి శ్రీరంగ సాయి
నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు
నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు
మాగన్నులొనైన మరచిపో కక్ష
సిరి కనుల నిద్దురకు శ్రీరామ రక్షా
********* ******** ********
చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. శైలజ, రాజేశ్వరి
కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం
కృష్ణం కథవిశయ తృష్ణం
కృష్ణం కథవిశయ తృష్ణం
జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా
బాల కృష్ణం కలయ సఖి సుందరం
శృంగార రసభర సంగీత సాహిత్య
శృంగార రసభర సంగీత సాహిత్య
గంగాల హరికేల సంగం సదా
బాల కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం
రాధారుణాధర సుతాపం సచ్చిదానంద
రాధారుణాధర సుతాపం సచ్చిదానంద
రూపం జగత్రయ భూపం సదా
బాల కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం
అర్థం శీథిలీకృతానర్తనం శ్రీ నారాయణ
అర్థం శీథిలీకృతానర్తనం శ్రీ నారాయణ
తీర్థం పురుషార్థం సదా
బాల కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం
********* ******** ********
చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. బాలు
ప ప ప ప ప పప్పు దప్పళం
ప ప ప ప ప పప్పు దప్పళం
అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన్నెయ్యి
వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి
వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి పప్పు దప్పళం కలిపి కొట్టడం
భొజనం వనభోజనం
వనభోజనం జనరంజనం
తల్లి తోడు పిల్ల మేక ల ల…
తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు
అత్తా కోడలు బాసు బంటు
ఒకటేనంటు కలవడం
భొజనం వనభోజనం
భొజనం వనభోజనం
మన వయసుకు నచ్చినట్టి ఆటలు
మన మనసుకు వచ్చినట్టి పాటలు – ఆ…
మన వయసుకు నచ్చినట్టి ఆటలు
మన మనసుకు వచ్చినట్టి పాటలు
పసనిస పనిదని మదపదమప
సగమమ దమమగరి పాడితే
రంజనం జనరంజనం
రా రా ర రంజనం జనరంజనం
మీరు స – స స
మీరు రి – రి రి
తమరు గ – గ గ
మేము ప ప ప ప ప
వేరిగుడ్ మేము ద ద ద ద ద – శభాష్
ని ని ని ని ని – మరల సా
వేరిగుడ్ బావుంది బావుంది బావుంది
ఆ ఇప్పుడు నేను ఎవర్ని చూపిస్తె
వాళ్ళ స్వరం పాడాలి ఏ ఊం రెడియా
సరిగ సారిగ మ మ – మ మ
రిగమ రీగమా ప ప – ప ప
తక్కిట తకధిమి తరికిటతక తరికిటతక
మసాలా గారెలో – మామా
జిలేబి బాదుషా – పాపా
సమోసా తీసుకో – దాదా
పొటాటో చిప్సుతోనా – నీనీ
మిఠాయి కావురే యేడం
పకోడి తిందువ – పా ప
మలాయి పెరుగిది మ మ
టొమాటో ఛట్నితొ – ద ద
పసందు పూర్ణమూ – భూరి
నంజుకో కారప్పూసా
అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్కు మిరపకాయల బజ్జి కొరికి చూడు…
గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద
మినపట్టు ముక్కతో మింగి చూడూ
ఉల్లిపాయల మధ్య అల్లమ్ము చల్లిన
పెసరట్టు ఉప్మతో మెసవి చూడూ
గసగసాల్ మిరియాలు కారా లవంగాలు
నాణ్యమౌ యాలకులు నమిలి చూడూ
తెలుగుతనమున్న తిండిని తిన్నవాడు
తనకు తెలియక హాయిగా తనువు ఊగ
పాట పాడును తప్పక ఆటలాడు
డాన్సు రానట్టి వారైన డాన్సు సేయూ
ఆ ఆ ఆ ఆ…
శ్రీమన్ మహాదోమ నీ కుట్టడం మండ
ఘీ పెట్టడం ఎండ నీ గోల ఉద్వేల కోలహలాభీల
హాలాహలజ్వాల గీరాకరాళాగ్ని
విఘ్నం హుఘ్నం కావాలి
నా రెండు కర్ణాల నీ మొండి గానాల
నాలించగా నేను
ఆ నీవేమి ట్రాన్సిస్టరా లేక దాన్ సిస్టరా
నీదు అంగికౄతంగాని సంగీతమున్నీవు
డామిట్టు డామిట్టు స్టాపిట్టు స్విచ్చాఫు
నాపాలి భూతంబ ఆపాలి ఘాతంబు
శాకిని ఢాకిని గాలి దెయ్యంబా
చి చి ఓసే పాతకి ఘాతకీ ఇదే చూడవే
ఘాత నీ రాత నా చేత పట్టిచ్చెనే
నిన్ను తోల్తొన్న పేల్తావు వెంటడి వెంటాడి
గీపెట్టి చంపేయుచున్నావూ
ఈ చేత నిన్ బట్టి ఆ చేతితొ కొట్టి
కిందెట్టి మీదెట్టి రెట్టించి దట్టించి నవ్వేతునే
పాడు దోమ హరామ గులామ
అయ్యో రామ రామా…
సమాప్తం సమాప్తం సమాప్తం సమాప్తం
జింతన తన తన జిం జింతన తన తన
అరిశెలు భూరెలు వడలు
ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలు
కమ్మని ఘుమ్మని నేతి చిప్సులు
సరిగమ పదమప గమగరి సరి సససససా
ఆ అరిశెలు భూరెలు వడలు
ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలు
కమ్మని ఘుమ్మని నేతి చిప్సులు
కరమగు నోరు ఊరగల
కక్కలు ముక్కలు ఫిష్ కబాబులు ష్
అమ్మమ్మామ్మమ్మా
కరమగు నోరు ఊరగల
కారపు పచ్చడి తీపి జాంగిరి
త్వరత్వర సర్వు చేయవలె
తైతకలాడగ పిక్కునిక్కులు
త్వరత్వర సర్వు చేయవలె
తైతకలాడగ పిక్కునిక్కులు
తైతక తైతక తైతక తై తై తై
తకధిన్నధిన్న తకధిన్నధిన్న
తాంగిటతక తిరికిటతక ధిగి ధిగి ధిగి
తకతకిట తకతకిట తకతకిట
తదిగిణతోం తదిగిణతోం తదిగిణతోం
ఆ…ఆ…ఉఁ…
తాంగిటతక తరికిటతకధిమి
తాంగిటతక తరికిటతకధిమి
తాంగిటతక తరికిటతకధిమి త త త త
ధిం తనకధిన ధిం తనకధిన
ధిధిం తనకధిన ధిం తనకధిన
తకధిమి తకధిమి
తకధిమి తకధిమి తకధిమి
అహా ఓహో అహా తరికిట తరికిట తరికిట తరికిట
ధిధిధిధి నకధిన ధిధిధిధి నకధిన ధిధిధిధి నకధిన
ధిధిధిధి నకధిన ధిధిధిధి నకధిన ధిధిధిధి నకధిన
తరికిట తరికిట తరికిట తరికిట
తరికిట తరికిట తరికిట తరికిట
ధిత్తాంగి తరికిట థా
********* ******** ********
చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. బాలు
సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత బడుగు పేద
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నోకలల కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత
నా వన్నెల రాశికి సిరి జోత
ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు
ముళ్ళు వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు
అలక కులుకు ఒక అందం
ఈ అందాలన్నీ కలబోశా
నీ కొంగుకు చెంగున ముడి వేస్తా
ఈ అందాలన్నీ కలబోశా
నీ కొంగుకు చెంగున ముడి వేస్తా
ఇది ఎన్నోకలల కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత
నా వన్నెల రాశికి సిరి జోత
చుర చుర చూపులు ఒక మారు
నీ చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారు
నువు ముద్దుకు సిద్దం ఒక మారు
నువు ఏ కలనున్నా మా బాగే
ఈ చీర విశేషం అల్లాగే
నువు ఏ కలనున్నా మా బాగే
ఈ చీర విశేషం అల్లాగే
సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత బడుగు పేద
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నోకలల కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత
నా వన్నెల రాశికి సిరి జోత