• About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
Home Movie Albums

Pelli Sandadi (1996)

A A
14
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Pinterest
Pelli2BSandadi2BOriginal2Baudio2BCd2BCover2B252822529

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , దీప్తి భట్నాగర్, రవళి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు:  సి.అశ్వనీదత్, అల్లు అరవింద్
విడుదల తేది: 12.01.1996

సాకీ:
అభ్రపథమ్మున విభ్రమ విలసిత శుభ్రకౌముదీ దీపికా…
దుగ్ధాంభోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధశ్రీ నాయికా…

MoreLyrics

Komuram Bheemudo Song Lyrics

Komma Uyyala Song Lyrics

Etthara Jenda Song Lyrics

పల్లవి:
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
రామచిలుక ముక్కుపుడక రమణిపాప ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా

చరణం: 1
తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం
చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం
మనసు తెలుసుకుంటె అది మంత్రాలయం
కనులు కలుపుకుంటె అది కౌగిలికందని ప్రణయం
ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి
పరువానికి పరువైన యువతి
వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి
మనసిచ్చిన మరుమల్లెకు మరిది
దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా

చరణం: 2
చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం
పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం
పెదవిచాటు కవిత మన ప్రేమాయణం
వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం
అందమారబెట్టే అద్దాల చీరకట్టే
తడి ఆరిన బిడియాల తరుణి
మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టి
మగసిరిగల దొరతనమెవరిదనీ
బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ ఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
రామచిలుక ముక్కుపుడక రమణిపాప ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ

*********  *********  ********

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

కాబోయే శ్రీవారికీ…
ప్రేమతో… రాసి పంపుతున్న… ప్రియ రాగాల ఈ లేఖ

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని అంటూ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే

Yes u r my dream girl
నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం అవును అద్భుతం మన కలయిక అద్భుతం
ఈ కలయిక ఇలాగే వుండాలి…
Promise… Promise…

నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా
చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి
నీ రాక కొసం వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ అంటూ

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే

పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేమిటొ మరీ
ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లో ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ నీ మీద ప్రాణం
నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ అంటూ

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే

సపమ నిప గాగా మరీ సాస నిస రిస రిపగా
సపమ నిప గాగా మరీ సాస నిస రిస రిమగా

*********  *********  ********

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శివగణేష్
గానం: మనో

బిక్కు బిక్కు బిక్కు మంటు వంట ఇంట నక్కాము
లక్కు మాకు దక్కునంటు ఇక్కడొచ్చి పడ్డాము
కొంటెదాని జాడ లేక గంటె చేతపట్టాము
పిట్ట నేడు కానరాక పిండి రుబ్బుతున్నాము
అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి
చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి

దప్పలాలు గుప్పుమంటు గొప్పగుంది మావంట
అప్పడాలు చేయకుండ తప్పలేదు ఈపూట
మక్కువైన చెక్కిలాలు సుబ్బరంగ బొబ్బట్లు
చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు
పెరుగు పచ్చడి పులిహోర పొంగలి
సాపాటు రెప్పపాటులో రెడీ
నాభి సుందరి నాలోని ఊపిరి
వరించి చేరుటెప్పుడో ఒడి
స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము
రొస్టులోన టేస్టులెన్నొ రెస్టులేక నింపినాము

అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి
హ చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి

చిటెకలోనె సిద్దమయ్యే జాంగిరీలు ఎంచక్కా
గుటకలోన కరిగిపోవు గులాబ్జాము ఈపక్క
పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గా
పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా
నేతి బూరెలు లేలేత గారెలు
భలేగ కొలువుతీరి ఉన్నవి
పూతరేకులు కచోరి అరిసెలు
ఊరించి రుచులు పెంచుతున్నవి
మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము
స్వచ్చమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము

చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని హుష్కాకి
రుబ్బురుబ్బి రుబ్బలేక హబ్బబ్బో
బొబ్బలెక్కి చేతులన్ని ఓయబ్బో
పిల్లమాట దేవుడెరుగు బామ్మర్ది
ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది

*********  *********  ********

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

హా… హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ
కోరస్: ప్రేమ ప్రేమ
ఆ… త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ
కోరస్: ప్రేమ ప్రేమ
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమా
తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమా
గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ… హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

హా ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమా
తనకొరకు ఏ సిరిని అడగదు కదా
నవ్వడమే చూపగల ఈ ప్రేమా
మంటలనె వెన్నెలగ మార్చును కదా
గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమసుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమా
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ… హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఏ జతనో ఎందుకో విడదీసి
వెంటాడి వేటాడు ఆటే ప్రేమా
మౌనముతో మనసునే శృతి చేసి
రాగాలు పలికించు పాటే ప్రేమా
శాశ్వత చరితల ఈ ప్రేమ
మృత్యువు ఎరగని చిరునామా
శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
కరుణించు వరమే ప్రేమా
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ… హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ… త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

*********  *********  ********

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర ,  యమ్. యమ్. కీరవాణిి,  యస్.పి. బాలు

సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు వెన్నెల మావకు కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం
టట్టటారట్టట్టడం శభాష్ టట్టటారట్టట్టడం
టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం
సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం

గళము కోసమే గాత్రమున్నది స్వరముకోసమే సరళి ఉన్నది
పొరుగుకోసమే పేపరున్నది అతిధి కోసమే తిధులు ఉన్నది శభాష్
పూతకోసమే మావి ఉన్నది కూతకోసమే కోయిలున్నది
కోత కోసమే కరెంటు ఉన్నది పెళ్ళి కోసమే పేరంటమున్నది
తాళి కోసమే ఆలి ఉన్నది జారిపోవుటకే చోళీ ఉన్నది
బ్రహ్మ చారికై మెస్సులున్నవి ఖర్మకాలుటకే బస్సులున్నవి
నగల కోసమే మెడలు ఉన్నవి సుముహూర్తానికి చూపులున్నవి

సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తకధిమి తకధిమి  తాళం ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు వెన్నెల మావకు కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం
టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం
అదిరింది బావగారు
టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం

హృదయనాదమై మధురదాహమై ఎదలు దోచుటకే పాటలున్నవి
పొలములోపల కుప్పకుప్పగా కూలిపోవుటకే ఫ్లైటులున్నవి
రామకోటికే బామ్మలున్నది ప్రేమకాటుకే భామలున్నది
క్యూలకోసమే రేషన్లు ఉన్నది కునుకు కోసమే ఆఫీసులున్నవి
మధురవాణి మావెంట ఉన్నది నాట్యరాణి మా ఇంట ఉన్నది
కీరవాణిలా ఆర్టు ఉన్నది బాలులోని టాలెంటు ఉన్నది
వియ్యమందుటకే తొందరున్నది ఒకటయ్యేందుకే ఇద్దరున్నది

సససససస సమరిసనిప సరిగమ పదనిస రాగం
పనిమప మరి నిపమరిసని నినిసస రిసరిస పమరిస నిసరిమ పమరిస రాగం
పానిస పానిస పనిసనిపమ మపని మపని సనిపమరిస సరిగమ పదనిస రాగం
ఆ…ఆ…ఆ…ఆ… సరిగమ పదనిస రాగం
ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ

*********  *********  ********

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సదాశివ బ్రహ్మం
గానం: చిత్ర

నవమన్మధుడా అతిసుందరుడా నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే
వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనే
రతి రాగాలే శృతి చేశాడే జత తాళాలే జతులాడాడే
తనువంత వింత సంగీతమేదొ పలికే

అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువెల్ల తారాడెనే
చాటు మాటుల చోటులో ఘాటు కోరిక లూపెనె ఒడి చేరి తలవాల్చెనే
జడ లాగాడే కవ్వించాడే నడుమొంపుల్లో చిటికేశాడే
అధరాలతోనె శుభలేఖ రాసె మరుడే
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

నవమన్మధుడా అతిసుందరుడా నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు

*********  *********  ********

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్.పి. బాలు

కోరస్: తకజం తకజం జం తకజం తకజం జం

కిల కిల కిల కిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా
కల కల కల కల కల వలపు దాఖల
తెలిపే శుభలేఖల సరిగమలా
మెరుపుల చెల్లి మా పిల్లకి
మేఘాలన్నీ పూపల్లకి
ఏడేడు వర్ణాల ఆషాడవేళ
కిల కిల కిల కిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా
కల కల కల కల కల వలపు దాఖల
తెలిపే శుభలేఖల సరిగమలా

కోరస్: లొలి లోలే లొలే లొలే లొలి లోలే లోలే లే
లొలి  లొలే లే లే లొలి లొలే లొలి లోలే లోలే లే

కోరస్: తకజం తకజం జం తకజం తకజం జం

వేచి వేచి వేడెక్కే ఆ వేచి ఉన్న పండక్కే
నే పరుగులు తీస్తున్నా
కాచుకున్న కానుక్కే నే కాచుకున్న వేడుక్కే
నేనెదురై నిలుచున్నా
కాదే అవునై కవ్విస్తే
కోరస్: తకజం తకజం జం
కన్నె పిలుపై కబురొస్తే
కోరస్: తకజం తకజం జం

ఆ… కొమ్మ చాటు కోకిలమ్మ గట్టిమేళాలన్నో పెట్టి
కాళ్ళు కడిగి కన్నెనిచ్చి పేరంటాలే ఆడే వేళ

కిల కిల కిల కిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా
కల కల కల కల కల వలపు దాఖల
తెలిపే శుభలేఖల సరిగమలా

కోరస్: తకజం తకజం జం తకజం తకజం జం
జాబిలమ్మ కన్నుల్లో ఓ సందె సూరీడున్నట్టే
నీ తహ తహ చూస్తున్నా
ఒంటినిండా ఊపొచ్చి ఒంపులెన్నో ఊరించే
నీ తకధిమి వింటున్నా
కాయే పండై కలిసొస్తే
కోరస్: తకజం తకజం జం
అది పండే నోమై చిలకొస్తే
కోరస్: తకజం తకజం జం

ఓ… తోటలోని పూలన్ని సిరి తోరణాలై దీవిస్తుంటే
గోరువంక పెళ్ళి మంత్రాలెన్నో చదివే సుముహూర్తంలో

కిల కిల కిల కిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా
కల కల కల కల కల వలపు దాఖల
తెలిపే శుభలేఖల సరిగమలా

*********  *********  ********

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, యస్.పి. బాలు

సౌందర్యలహరి… సౌందర్యలహరి…
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురీ
వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇల చేరి కనిపించు ఓసారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

పాల చెక్కిళ్లూ జుజుజుజు జుజుజుజు
దీపాల పుట్టిళ్లూ జుజుజుజు జుజుజుజు
పాల చెక్కిళ్లూ దీపాల పుట్టిళ్లూ
అదిరేటి అధరాలు హరివిల్లులు
ఫక్కున చిందిన నవ్వులలో ఆ…
లెక్కకు అందని రతనాలు ఆ…
యతికైన మతిపోయే ప్రతిభంగిమా
ఎదలోనె పురివిప్పి ఆడింది వయ్యారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

నీలికన్నుల్లూ జుజుజుజు జుజుజుజు
నా పాలి సంకెళ్లూ జుజుజుజు జుజుజుజు
నీలికన్నుల్లూ నా పాలి సంకెళ్లూ
నను చూసి వలవేసి మెలివెయ్యగా
ఊసులు చెప్పిన గుసగుసలు ఆ…
శ్వాసకు నేర్పెను సరిగమలు ఆ…
కలగంటి తెలుగింటి కలకంఠినీ
కొలువుంటె చాలంట నాకంట సుకుమారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

*********  *********  ********

చిత్రం: పెళ్ళిసందడి (1996)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యమ్. యమ్. కీరవాణి, మనో

నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్ళిచేసే బాధ్యత నాది ఓరి బామ్మర్ది…
నీ కలలోకొచ్చిన చిన్నదీ ఈ ఈ ఎవరది ఎలాగుంటది

రమ్యకృష్ణలాగ ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న
ఇంద్రజ ఆమని లుక్కు ఉందా
శోభన గౌతమి షేపు ఉందా
చెప్పకుంటె దాని జాడ ఎట్ట తెలుసుకోమురా

రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న

ఏక్ దో తీన్ సాంగుతో యవ్వనాల ఎర వేసిన మాధురీదీక్షితా
వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న జుహీచావ్లానా
అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా
అరె కుస్తాబహార్ అనిపించే కుర్రపిల్ల కుష్బునా
నీ మగసిరి మెచ్చుకుంది మమతాకులకర్ణా
నీ టాపు లేపింది టాబునా
శిల్పాశెట్టి లాంటి చిలక భామా
శ్రీదేవి లాంటి చందమామా హే హే హే
మోహిని రూపిణి రేవతినా
చెప్పరా నాయనా ప్రియారామనా
ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్ళిడోలు

రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా ఆ చెప్పర కన్నా చెప్పర నాన్న

కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల రోజానా
శోభనపు పెళ్ళికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా
బెల్లంముక్కలాంటి బుల్లి గడ్డమున్న సౌందర్యా
యువకులకి పులకరింత పూజాభట్టేనా
రవ్వలడ్డులాంటి పిల్ల మాలాశ్రీయా
దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీయా
మనీషా కొయిరాల పోలికలోన అహ
మతిపోయే మధుబాల మాదిరి జాణ హే హే హే
అంజలి రంజని శుభశ్రీయా
ఊర్వశీ కల్పన ఊహలానా
హింటు ఇస్తె చాలు మాకు జంట నీకు చేస్తాము

రమ్యకృష్ణలాగ ఉంటదా అబ్బ చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా హే చెప్పర కన్నా చెప్పరా నాన్న
చెప్పమ్మా

Tags: 1996Allu AravindC. Ashwini DuttDeepti BhatnagarK. Raghavendra RaoM. M. KeeravaniPelli SandadiRavaliSrikanth
Previous Lyric

Prema Katha (1999)

Next Lyric

Akkada Ammayi Ikkada Abbayi (1996)

Next Lyric

Akkada Ammayi Ikkada Abbayi (1996)

Comments 14

  1. Korada Mohana Kumar says:
    2 years ago

    thanks

    Reply
    • A To Z Telugu Lyrics says:
      2 years ago

      🙂

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Fan Page👍

A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
No Result
View All Result
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

You cannot copy content of this page