చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి..సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, రాజశ్రీ
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాతలు: డి. వి.యస్.రాజు, ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు
విడుదల తేది: 10.09.1966
మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
విరిసే ఊహలలో …పరువము నీవేలే
విరిసే ఊహలలో …పరువము నీవేలే
మదనుడి కన్నులలో …మగసిరి నీదేలే
మదనుడి కన్నులలో …మగసిరి నీదేలే
సంధ్యలతో కవ్వించే… యవ్వని నీవే
మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
తలపుల పందిరిలో…కలలే కందామా
తలపుల పందిరిలో… కలలే కందామా
తరగని కౌగిలిలో కాపురముందామా
తరగని కౌగిలిలో కాపురముందామా
కనరాని తీరాలే… కనుగొందామా
మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
********* ********* *********
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి :
ఓహోహో… ఓహో… హో (2)
ఈ రేయి నీవు నేను
ఎలాగైన కలవాలి
నింగిలోని తారలు రెండు
నేలపైన నిలవాలి “రేయి”
చరణం: 1
ఏ మబ్బు మాటున్నావో
ఏ పొదల చాటున్నావో (మబ్బు)
ఏ గాలి తరగలపైన
ఊగి ఊగిపోతున్నావో (2)
కలగా వన్నే కవ్వించేవో
చరణం: 2
చందమామలో ఉన్నాను
చల్లగాలిలో ఉన్నాను
నీ కంటిపాపలలోన
నేను దాగి వున్నాను (2)
నీలో నేనై… నిలిచున్నాను
చరణం: 3
ఆనాటి చూపులన్నీ
లోన దాచుకున్నాను (2)
నీవు లేని వెన్నెలలోన
నిలువజాలకున్నాను (2)
********* ********* *********
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి..సుశీల
పల్లవి:
పిలిచిన పలుకవు ఓ జవరాలా
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ ననుచేర రావా! రావా!
పిలిచిన పలుకవు ఓ జవరాలా
కలువల రాయడు చూసే వేళ (2)
చెలియను కవ్వింతువేలా యేలా
కలువల రాయుడు చూసే వేళ
చరణం: 1
చల్లగ విరిసే నీ చిరునవ్వులు (2)
మల్లెలు కురిసెను నాలోన
తొలిచూపులలో చిలికిన వలపులు (2)
తొందర చేసెను నీలోన
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ ననుచేర రావా! రావా!
చరణం: 2
జగములనేల సొగసే నీదని (2)
గగనములో దాగే నెలఱేడు
మనసును దోచే మరుడవు నీవని (2)