Pilla Zamindar (1980)

చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వడ్డేపల్లి కృష్ణ
గానం: బాలు, సుశీల, ఎస్. యస్.జానకి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున
విడుదల తేది: 26.09.1980

పల్లవి:
నీ చూపులోనా.. విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా

నీ నవ్వులోనా.. రతనాల వానా
ఆ వానలోనా నేను మరిచేనా… తీయగా

చరణం: 1
ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే
నీ వన్నెలేమో.. సరదాలు చేసే
ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే
నీ వన్నెలేమో.. సరదాలు చేసే
వయసేమో పొంగిందీ… వలపేమొ రేగిందీ
వయసేమో పొంగిందీ… వలపేమొ రేగిందీ
కనివిని ఎరుగని తలపులు చిగురించే…

నీ చూపులోనా.. విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా

నీ నవ్వులోనా.. వడగళ్ల వానా
ఆ వానలోనా నేను మునిగేనా… తేలనా

చరణం: 2
చిరుగాలిలోనా… చిగురాకు ఊగే
చెలి కులుకులోనా… పరువాలు ఊగే

ఈ పాల రేయీ… మురిపించె నన్ను…
మురిపాలలోనా… ఇరికించె నన్ను…

గిలిగింత కలిగించే… మనసంత పులకించే…
జాబిల్లి కవ్వించే… నిలువెల్ల దహియించే…
చెరగని.. తరగని.. వలపులు కురిపించే…

నీ చూపులోనా… విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా… హాయిగా

నీ నవ్వులోనా… రతనాల వానా
ఆ వానలోనా నేను మరిచేనా… తీయగా

Previous
Guru (1980)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Ala Vaikunthapuramulo Lyrics
Ala Vaikunthapuramulo (2020)
error: Content is protected !!