పొడి పొడి వాన లిరిక్స్
సింగర్: శిరీష
కాస్టింగ్: జానూ లైరి
లిరిక్స్, మ్యూజిక్ & డైరెక్షన్: తిరుపతి
లేబుల్: సై టీవీ
పొడి పొడి వానలు కురవంగా.. యెద తడవంగ
నువ్వు దూరంగా గుండె భారంగా.. ఇంత ఘోరం ఎన్నడు కాలేదురో
ఎండి కొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్ను సూడకుండా మాటాడకుండా…
మరిసెట్ల ఉన్నావురో… పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగ మరిసెట్ల ఉన్నావురో.. పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
కండ్లల్ల నీ బొమ్మ గీసుకొన్న.. గుండెల్ల నీ పేరు రాసుకున్న..
సంటి పిల్లోలే నన్ను సూసుకున్న ఆరోజులు మనసుల దాసుకొన్న..
అవి యాదికొస్తే పాణం ఎల్లిపాయే.. ఎండి కొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్ను సూడకుండా మాటాడకుండా…
మరిసెట్ల ఉన్నావురో… పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగ మరిసెట్ల ఉన్నావురో.. పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
నాగొంతు పొలమారిపోయినట్టు.. అందరున్నా ఒంటరయినట్టు..
గుండె నరాలన్నీ గుంజినట్టు.. ఊపిరొక్కసారి ఆగినట్టు..
ఈ ఎడబాటు నేనెట్ల ఏగుదురో.. ఎండి కొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్ను సూడకుండా మాటాడకుండా…
మరిసెట్ల ఉన్నావురో… పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగ మరిసెట్ల ఉన్నావురో.. పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
సెలకల్ల ఆట కొయిలాలోలె.. గూటిలో గువ్వగోరింకలోలె..
కలిసున్న మనమెట్ల విడిపోతిమో..
ఏపాడు కండ్లల్ల పడిపోతిమో..
ఒక్కసారి కంట సూసిపోరో.. ఎండి కొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్ను సూడకుండా మాటాడకుండా…
మరిసెట్ల ఉన్నావురో… పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగ మరిసెట్ల ఉన్నావురో.. పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
ఉండలేను నిన్ను తలవకుండా.. బతకలేను నిన్ను సూడకుండ..
గండాల గుండాలు దాటుకుంట.. ఏడున్న నీదరికి సేరుకుంట
ఏడేడు జన్మాల బంధమయ్యో.. ఎండి కొండా.. బంగారు కొండ…
ఎవ్వడడ్డమొచ్చి ఆపలేడు
నిన్ను సూడకుండా మాటాడకుండా…నా ఎండి కొండా.. బంగారు కొండ…
[email protected]