చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్
నటీనటులు: మహేష్ బాబు, ఇలియానా
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్ , మంజుల ఘట్టమనేని
విడుదల తేది: 28.06.2006
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా
వచ్చేయ్నా వచ్చేయ్నా మోమాటమింక మనకేల
వచ్చేయ్నా వచ్చేయ్నా ఆరాటమేదో కలిగేలా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా…
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
సడియో సడియో సడియో నీతో ఉంటానుగా
సడియో సడియో సడియో నువ్వే కావాలిగా
సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా
కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా
పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడి పోతుంటా
నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా
ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంటా
ఎవ్రీ డే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా
చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా
నువులేని లైఫే బోరని ఫీలైపోతుంటా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా…
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా
ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా
చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా
నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంటా
నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా
నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా
నీ కన్నా విలువైంది నాకేదీ లేదంటా
నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా…
హా సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా
********* ********* *********
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ
గానం: కునాల్
జగడమే… జగడమే…
నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే
నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే
సమరమే… సమరమే…
నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగివస్తున్నా
ఆకాశమే తెగి పడుతున్నా బిన్లాడిన్ ఎదుటే నిలుచున్నా
ఎక్కడైన నా తీరింతే ఏ సెంటరైనా నా స్పీడింతే
హే టైము చెప్పు వస్తానంతే
జగడమే…
నువ్వో నేనో మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే
వైలెన్స్ జరగాలంతే జగడమే…
నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడు తాపం
నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగం
బోలో బోలో గణపతి బప్పా బోలియ (4)
ఎప్పుడైనా నా రూటింతే ఈ రాంగు రూటు నా స్టైలంతే
హే నచ్చకుంటే నీ కర్మంతే జగడమే…
ఏయ్ రాజీ గీజీ పడలేనంతే మరి చావోరేవో తేలాలంతే
గళ్ళ పట్టి కొడతానంతే జగడమే…
నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చిల్లర తాళం
నా దారికి లేదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం
********* ********* *********
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విశ్వ
గానం: రంజిత్, సుచిత్ర
డోలె డోలె దిల్ జర జరా
నిను ఓర ఓర గని నరవరా
జాగు మాని చెయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందలకడనే రా రా
ఒడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా
పొదుగుతూ కుదురుగా నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిల్ బర్ దేఖో నా
మిస మిస కన్నె కొసరకు వన్నె వలపులతో వలపన్నీ
నకసికలన్నీ నలుగును కొన్నే కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా యా…
బరిలో కరగా యా…
ఒడికి త్వరగా యా…
బరిలో కరగా
చిటుకిని విప్పేస్తా చెమటని రప్పిస్తా
తళుకుతో తెగబడి నీపైన
చటుకున చుంబిస్తా చనువుగా బందిస్తా
సుందర దీవానా
తొలితెరలన్నీ గడుసరి కన్నె తొలగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని
తరలి దరికే యా…
ఎగసి ఎదకే యా…
తరలి దరకే యా…
ఎగసి ఎదకే
జర జల్ది జల్ది పెందలకడనే రా రా
ఒడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
********* ********* *********
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: మురళి, సుచిత్ర
ఆ…అ…ఆ… నా మాటే వింటారా
ఆ…అ…ఆ… నే నడిగిందిస్తారా
ఆ…అ…ఆ… నా మాటే వింటారా
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే
ఈడు ఝుమ్మంది తోడెవ్వరే…
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురుగా ఈ ఊరొచ్చాలే
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే
డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలే
బంగారమే కరిగించీ ఇల్లంతా పరచాలే
వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి
ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి
టైటానిక్కు గిఫ్టివ్వాలి…
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా నిన్ను చూస్తే సడన్ గా దడ పుడతా ఉంది
జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే
పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే
చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే
ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి
తలంటి నీవు రుద్దాలె నైటంత కాళ్ళు పట్టాలి
నిదురోతుంటే జోకొట్టాలే…
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా ఆగు తల్లే రంభలా ఫోజే కొట్టకులే
జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
********* ********* *********
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: ఎన్.ఎస్.నవీన్ మాధవ్
నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదే
పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదే
అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్
రాతిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నారురో…
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో
చిచ్చు పెట్టీ చంపుతోంది…
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే
ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే
ఓరగా చూడకే జలగలా పట్టుకోకే
బతకనీ నన్నిలా ఇరుకులో పెట్టమాకే
దేవుడా… నా మతి చెడిపోయెను పూర్తిగా
అయినా… బాగుంది హాయిగా
రాతిరంతా కునుకులేదు ఏదోటి చెయ్యాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
మెషిన్ లోన పెట్టి నన్ను పిండుతున్నాదిరో
కొట్టి కొట్టి దంచుతోంది…
ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే
దీనినే ప్రేమనీ ఎవ్వరూ చెప్పలేదే
యేటిలో మునిగినా ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే
దేవుడా…ఈ తెలియని తికమక దేనికో
అరెెరే… ఈ తడబాటేమిటో
రాతిరంతా కునుకులేదు ఫుల్లోటి కొట్టాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో
లోపలేదో జరుగుతోంది…
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
********* ********* *********
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ
గానం: నిహాల్
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన
ఊ…ఓ…ఈ అల్లరి, ఊ…ఓ…
ఊ…ఓ…బాగున్నది, ఊ…ఓ…
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
ఊ…ఓ…ఈ లాహిరి, ఊ…ఓ…
ఊ…ఓ…నీ ప్రేమది, ఊ…ఓ…
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా