చిత్రం: పోకిరి రాజా (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: వెంకటేష్ , రోజా , ప్రతిభా సిన్హా
మాటలు: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: ఎ. వెంకట రామిరెడ్డి
విడుదల తేది: 12.01.1995
పల్లవి:
ఒక్కొక్క వాన చుక్క చుక్క చుక్క
వంపుల్లో చెమ్మ చెక్క చెక్క చెక్క
ఎక్కింది తీపి తిక్క తిక్క తిక్క
ఒళ్ళంత తిమ్మిరెక్క ఎక్క ఎక్క
తెరచాటు దారులలో సోకులెక్క చూసొచ్చాక
పొరబాటు కోరికలే జింజిన్నక్క చిందుల్తొక్క
ఓ.. ఓ.. ఓ.. ఓ…
ఒక్కొక్క వాన చుక్క చుక్క చుక్క
వంపుల్లో చెమ్మ చెక్క చెక్క చెక్క
ఎక్కింది తీపి తిక్క తిక్క తిక్క
చరణం: 1
ఈ పక్క ఆ పక్క తడిశాక
పాడు సిగ్గింకా ఉంటుందా చెడిపోదా
పాపంగా తడిచూపే తడిమేక
ఈడు నిలిపేనా నీ ఒళ్ళో పడిపోక
చిలిపి చీమంటి చినుకమ్మ కుడితే
తడికి చెమటెక్కదా
నునుపు సొంపుల్ని చలిగాలి కొడితే
చెలికి గిలి పుట్టదా
మెరుపు దారి తారక
కులుకు తున్నది – జింక జింక జింక
ఒక్కొక్క వాన చుక్క చుక్క చుక్క
వంపుల్లో చెమ్మ చెక్క చెక్క చెక్క
ఎక్కింది తీపి తిక్క తిక్క తిక్క
చరణం: 2
నా అందం అచ్చంగా నీదేగా
మరి వానొచ్చి వాటేస్తే తప్పేగా
కాబట్టే కంచల్లే కాయంగా
కసి కౌగిల్లే కట్టేస్తా దిట్టంగా
పడుచు పరువాన్ని కాపాడు గుట్టుగా
పరువు పోనియకా…
వయసు బరువుల్ని మొయ్యొద్దు వంటిగా
పంచుకో జంటగా
నిమురుతున్న హాయిలో
ఇమిడిపోనా – ఇంకా ఇంకా ఇంకా
ఒక్కొక్క వాన చుక్క చుక్క చుక్క
వంపుల్లో చెమ్మ చెక్క చెక్క చెక్క
ఎక్కింది తీపి తిక్క తిక్క తిక్క
ఒళ్ళంత తిమ్మిరెక్క ఎక్క ఎక్క
తెరచాటు దారులలో సోకులెక్క చూసొచ్చాక
పొరబాటు కోరికలే జింజిన్నక్క చిందుల్తొక్క
ఓ.. ఓ.. ఓ.. ఓ…