చిత్రం: పూజా (1975)
సంగీతం: రాజన్ – నాగేంద్ర
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు, వాణి జయరాం
నటీనటులు: రామకృష్ణ, మంజుల , వాణిశ్రీ
దర్శకత్వం: మురగన్ కుమారన్
నిర్మాతలు: యమ్.మురగన్, యమ్. కుమారన్, యమ్.శరవణన్, యమ్.బాలు
విడుదల తేది: 25.08.1975
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
చరణం: 1
పున్నమి వెన్నెలలోన పొంగును కడలీ
నిన్నే చూసిన వేళా నిండును చెలిమి
ఓ హో హో హో నువ్వు కడలివైతే నే నదిగా మారి
చిందులు వేసి వేసి నిన్ను చేరనా… చేరనా… చేరనా…
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
చరణం: 2
కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎపూడూ నేనుండాలి
ఓ హో హో హో నీ వున్న వేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ… ఉండనీ… ఉండనీ…
ఎన్నెన్నో…
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ…
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఆ హా హా హా హా… ఓ హో హో హో హో