చిత్రం: పూజాఫలం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.జానకి
నటీనటులు: నాగేశ్వరరావు , సావిత్రి, జమున
దర్శకత్వం: బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి
నిర్మాత: దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి
విడుదల తేది: 01.01.1964
పగలే వెన్నెలా జగమే ఊయలా
కదిలే వూహలకే కన్నులుంటే
పగలే వెన్నెలా జగమే ఊయలా
నింగిలోన చందమామ తొంగి చూచే
నీటిలోన కలువభామ పొంగి పూచే
ఈ అనురాగమే జీవన రాగమై
ఈ అనురాగమే జీవన రాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా
పగలే వెన్నెలా జగమే ఊయలా
కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసే
మురళిపాట విన్న నాగు శిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా
పగలే వెన్నెలా జగమే ఊయలా
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే
మనసే వీణగా ఝన ఝన మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
పగలే వెన్నెలా