Poola Rangadu (1967)

చిత్రం: పూల రంగడు (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, జమున, విజయనిర్మల
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.మధుసూదనరావు
విడుదల తేది: 24.11.1967

పల్లవి :
నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా
పదరా ముందుకు పదరా

నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా
చల్ రే బేటా చల్ రే

చరణం: 1
తాతల తండ్రుల అర్జన తింటూ జల్సాగా నువ్వు తిరగకురా
తాతల తండ్రుల అర్జన తింటూ జల్సాగా నువ్వు తిరగకురా
కండలు కరగగ కష్టం చేసి తలవంచక జీవించుమురా

పూలరంగడిగ వెలుగుమురా

హోయ్.. నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా

చరణం: 2
పెంచిన కుక్కకు రొట్టె మేపుతూ హుషారుగా ఒకడున్నాడు
బల్ ఖుషీ ఖుషీగా ఉన్నాడు ….
కన్నబిడ్డకు గంజిదొరకక ఉసూరుమని ఒకడున్నాడు

హోయ్.. నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా

చరణం: 3
ఉన్నవాడికి అరగని జబ్బు.. లేనివాడికి ఆకలిజబ్బు
ఉన్నవాడికి అరగని జబ్బు.. లేనివాడికి ఆకలిజబ్బు
ఉండీలేని మధ్యరకానికి చాలీచాలని జబ్బురా
ఒకటే అప్పుల జబ్బురా

హోయ్.. నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా

చరణం: 4
కష్టాలెన్నో ముంచుకువచ్చిన కన్నీరును ఒలికించకురా
కష్టజీవుల కలలు ఫలించే కమ్మని రోజులు వచ్చునురా
చివరకు నీదే విజయమురా 

నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా
పదరా ముందుకు పదరా

********   ********   *********

చిత్రం: పూల రంగడు (1967)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
మిస మిసలాడే చినదానా…ముసి ముసి నవ్వుల నెరజాణ
సిగ్గులు చిలికి సింగారమొలికి..చేరగ రావేమే.. నా చెంతకు రావేమే

సొగసరి చూపుల చినవాడా..గడసరి మాటల మొనగాడా
సరసాలాడే సరదా తీరే…సమయం రానీయరా ….ఆ సమయం రానీయరా

చరణం: 1
చారెడు కళ్ళకు కాటుక పెట్టి…దోసెడు మల్లెలు సిగలో చుట్టి
చారెడు కళ్ళకు కాటుక పెట్టి…దోసెడు మల్లెలు సిగలో చుట్టి
చిలకలాగ నువు కులుకుతు ఉంటే…ఒలికి పోతదే నీ సొగసు
ఉలికి పడతదే నా మనసు….

కులుకు చూసి నువు ఉలికితివా…తళుకు చూసి నువు మురిసితివా
కులుకు చూసి నువు ఉలికితివా…తళుకు చూసి నువు మురిసితివా
కులుకును మించి తళుకును మించి…వలపుని దాచితి లేరా
అది కలకాలం నీదేరా…

మిస మిస లాడే చినదాన ..ముసి ముసి నవ్వుల నెరజాణ
సిగ్గులు చిలికి సింగారమొలికి…చేరగ రావేమే..
నా చెంతకు రావేమే

చరణం: 2
ఏటి గట్టున ఇల్లు కట్టుకొని…నీటి అద్దమున నీడ చూసుకోని
ఏటి గట్టున ఇల్లు కట్టుకొని…నీటి అద్దమున నీడ చూసుకోని
గువ్వల జంటగ నువ్వు నేను…కువ కువ లాడుతు ఉందామా
కొత్త రుచులు కనుగోందామా…

కళ్ళు కళ్ళు కలిసిన నాడే…మనసు మనసు తెలిసిన నాడే..ఓ..ఓ..
కళ్ళు కళ్ళు కలిసిన నాడే…మనసు మనసు తెలిసిన నాడే..
నీవు నేను ఒకటైనామని…కోవెల గంటలు తెలిపెనులే
దీవెనలై అవి నిలిచెనులే…దీవెనలై అవి నిలిచెనులే…

మిస మిస లాడే చినదాన…ముసి ముసి నవ్వుల నెరజాణ
సిగ్గులు చిలికి సింగారమొలికి..చేరగ రావేమే..నా చెంతకు రావేమే

సొగసరి చూపుల చినవాడా..గడసరి మాటల మొనగాడా
సరసాలాడే సరదా తీరే…సమయం రానీయరా ….ఆ సమయం రానీయరా

********   ********   *********

చిత్రం: పూల రంగడు (1967)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  దాశరథి
గానం:  పి.సుశీల

పల్లవి:
నీవు రావు నిదురరాదు…
నీవు రావు నిదురరాదు నిలిచిపోయె ఈ రేయి
నీవు రావు నిదురరాదు…

చరణం: 1
తారా జాబిలి ఒకటై సరసమాడె ఆ రేయి
తారా జాబిలి ఒకటై సరసమాడె ఆ రేయి
చింత చీకటి ఒకటై చిన్నబోయె ఈ రేయి

చరణం: 2
ఆశలు మదిలో విరిసె దోసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసె దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ…
ఆలయాన చేరి చూడ స్వామికానరాడయె
నా స్వామికానరాడయె

చరణం: 3
కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే
కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే
ఎదురుచూసి ఎదురుచూసి
ఎదురుచూసి ఎదురుచూసి
కన్నుదోయి అలసిపోయె

********   ********   *********

చిత్రం: పూల రంగడు (1967)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
నీ నడుముపైన చేయి వేసి నడువని… నన్ను నడువని
నీ చేతుల చెరసాలలోన.. చేరని.. నన్ను చేరని

నీ జిలుగుపైట నీడలోన నిలువని… నన్ను నిలువని
నీ అడుగులోన అడుగువేసి నడువని… నన్ను నడువని

చరణం: 1
చిక్కని బుగ్గలపై చిటికెలు వేయని
సన్నని నవ్వులలో సంపెంగలేరని
గులాబి పెదవులనే.. అలా అలా చూడని

నీ జిలుగుపైట నీడలోన నిలువని… నన్ను నిలువని
నీ అడుగులోన అడుగులేసి నడువని…నన్ను నడువని

చరణం: 2
పచ్చిగ తిన్నెలలో వెచ్చగ సాగని
వెచ్చని వెన్నెలలో ముచ్చటలాడని
ముచ్చటలాడి ఆడి మురిసి మురిసి పాడని

నీ జిలుగుపైట నీడలోన నిలువని… నన్ను నిలువని
నీ అడుగులోన అడుగు వేసి నడువని…. నన్ను నడువని

చరణం: 3
మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
ఆ…ఆ…ఆ…ఆ..ఆ…

మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
బంగారు కోవెలలో కొంగులు ముడివేయని
బంగారు కోవెలలో కొంగులు ముడివేయని

********   ********   *********

చిత్రం: పూల రంగడు (1967)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  దాశరథి
గానం:  కె. బి. మోహన్ రాజు, సుశీల
చిగురులు వేసిన కలలన్ని

పల్లవి:
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ…ఓ…ఓ

చరణం: 1
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను
నిండు మనసు పందిరి కాగా …
నిన్ను అందుకున్నాను.. నిన్నే అందుకున్నాను…

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి

చరణం: 2
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు..
నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు…

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి

చరణం: 3
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనే..ఏ…ఆ ఆ ఆ…
పరిమళాల తరగలలోనే…
కరిగించిన చెలియవు నీవే.. కరగించిన చెలియవు నీవే

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ…ఓ…ఓ

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Pilla Zamindar (2011)
error: Content is protected !!