Pournami (2006)

చిత్రం: పౌర్ణమి (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: ప్రబాష్ , త్రిష , చార్మి
దర్శకత్వం: ప్రభుదేవా
నిర్మాత: యమ్. ఎస్. రాజు
విడుదల తేది: 21.04.2006

శంభో శంకర

హర హర మహాదేవ (4)

తద్ధింతాదిది ధింధిమీ పరుల
తాండవకేళీ తత్పర
గౌరీ మంజుల సింజిణీ జతుల
లాస్యవినోదవ శంకర

భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదముపరేశ
నీలకందరా జాలిపొందరా
కరుణతొ ననుగనరా
నీలకందరా శైలమందిరా
మొరవిని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా
మాలేందుశేఖరా శంకరా
భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదముపరేశ

హర హర మహాదేవ (4)

ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…
ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…

ఆ… అంతకాంత ఈ సతి అగ్నితప్తమైనది
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ…
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి
తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ…
ఆ… ఆ…ఆ…
భవుని భువికి తరలించేలా
ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీ లీల యతిని నృత్యరతుని చేయగలిగే ఈ వేళ

భరత వేదముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదముపరేశ

జంగమ సావర గంగాచ్యుత శిర
భృతమంజులకర పురహరా
భక్తశుభంకర భవనా శంకర
స్వరహర దక్షాత్వర హరా
పాలవిలోచన పాలిత జనగణ
కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ
జయగిరీశ బృహదీశ్వరా

హర హర మహాదేవ (2)

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత
ప్రేమపాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి
దైత్యశోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదాన
యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన
ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా

హర హర మహాదేవ

*********    ********    ********

చిత్రం: పౌర్ణమి (2006)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,  చిత్ర

ఓ… ఓ…
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్ళేశావే…

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే

కలిసిన పరిచయం ఒక రోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చుసే నిజం నిజం కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో

ఓ… ఓ…

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్ళేశావే…

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరియొక జన్మగా మొదలౌతున్నదా
హో పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా

ఓ… ఓ…

మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే…

***********   ***********  **********

చిత్రం: పౌర్ణమి (2006)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: సాగర్ ,  చిత్ర

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి
కో అంటు కబురు పెడితే మదిలో మూగ మురళి
ఓ అంటు ఎదురయిందే ఊహలలోని మజిలి

చరణం: 1
స్మృతులే బతుకై గడిపా ప్రతిపూటా నిన్నుగా
సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా
వెతికే గుండె లోగిలిలో వెలిగా చైత్ర పాడ్యమిలా
మెరిసే కంటిపాపలలో వెలిశా నిత్య పౌర్ణమిలా
ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వల

ఎవరో…

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి

*********   ********   **********

చిత్రం: పౌర్ణమి (2006)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: చిత్ర

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

చరణం: 1
హో తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లే కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మక మందించేదెవరు

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

చరణం: 2
హో వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడో కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో

ఎవరో…

*********   ********   **********

చిత్రం: పౌర్ణమి (2006)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: టిప్పు, సుమంగళి

పల్లవి :
ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చెయ్ నీ మనసు
ఇచ్చేసేయ్ ఇచ్చేసెయ్ ఇచ్చెయ్ మరి
ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చెయ్ నీ సొగసు
ఇచ్చేసేయ్ ఇచ్చేసెయ్ ఇచ్చెయ్ మరి
మూర్తమెందుకు మురిపాల విందుకు
ముందుముందుకు మితిమీరవెందుకు
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వేంటిలాగా అయ్యో కన్యామణి

|| ఇచ్చి పుచ్చుకుంటే ||

చరణం: 1
ఓ మహరాజా నువ్వు ఉన్నమాట ఒప్పుకుంటే పోదా
ఈ జింక మీద బెంగ పుట్టలేదా
ఓ ముళ్లరోజా ఓ చిన్నమెత్తు భయపడరాదా
నేను దాడి చేస్తే లేని పోని బాధ
కొంటె తేటు పంటిగాటుకి లేత పూలబాల కందిపోదయా
జంటలేని ఒంటి వేడికి చందనాల పూత ఉంది రావయా
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వేంటిలాగా అయ్యో కన్యామణి

|| ఇచ్చి పుచ్చుకుంటే ||

చరణం: 2
హో నెలరాజా ఈ ముత్యమంటి మత్యకంటి సైగ
నిన్ను రెచ్చగొట్టి వెచ్చబెట్టలేదా
హా వలరాజా ఈ పిల్ల ఒళ్లు తల్లడిల్లి పోగా
నువ్వు చెరుకు విల్లు ఎక్కిపెట్టి రాకా
చాటుమాటు చూపు దేనికి సొంతమైన సొంపు చూడడానికి
దొంగలాగా జంకు దేనికి దోరలాగా సోకులేలడానికి
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వేంటిలాగా అయ్యో కన్యామణి

|| ఇచ్చి పుచ్చుకుంటే ||

*********   ********   **********

చిత్రం: పౌర్ణమి (2006)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: షాన్

Life is so beautiful
Never never make it sorrowful
ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल
అట్టే ఆలోచించక आगे चल
ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని
ఆట పాటగా ప్రతి పనీ సాధించెయ్ ఏమైనాగానీ
కోయో కోయో..హో…కోయో కోయో…హో
కోయో కోయో..హో…కోయో కోయో…హో

Life is so beautiful
Never never make it sorrowful

చరణం: 1
కొండలో కోనలో ఏవో ఎదురైనా
ఎండలో వానలో మన వేగం క్షణమైనా నిలిచేనా
చేరాల కలల కోట రణమేరా రాచబాట
ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని
ఆట పాటగా ప్రతి పనీ సాధించెయ్ ఏమైనాగానీ
కోయో కోయో..హో…కోయో కోయో…హో
కోయో కోయో..హో…కోయో కోయో…హో

|| Life ||

చరణం: 2
బాధనీ చేదనీ ఏదో ఒక పేరా
బతకడం బరువని అడుగడుగు తడబడుతూ నడవాలా
రేపంటే తేనెపట్టు ముళ్ళున్నా దాని చుట్టూ
ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని
ఆట పాటగా ప్రతి పనీ సాధించెయ్ ఏమైనాగానీ
కోయో కోయో..హో…కోయో కోయో…హో
కోయో కోయో..హో…కోయో కోయో…హో

*********   ********   **********

చిత్రం: పౌర్ణమి (2006)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: గోపికాపూర్ణిమ

పల్లకివై ఓహో ఓహో భారాన్ని మొయ్ ఓహో ఓహో
పాదం నువ్వై ఓహో ఓహో నడిపించవోయ్ హో ఓహో
అవ్వా బువ్వా కావాలోయ్ నువ్వే ఇవ్వాలోయ్
రివ్వు రివ్వున ఎగరాలోయ్ గాలిలో
తొక్కుడు బిళ్లాటాడాలోయ్ నీలాకాశంలో
చుక్కల్లోకం చూడాలోయ్ చలో చలో
చలో చలో ఓ ఓ…. చలో ఓ ఓ ఓ…..

చరణం: 1
కలవరపరిచే కలవో శిలలను మలిచే కళవో
అలజడి చేసే అలవో అలరించే అల్లరివో
ఒడుపుగ వేసే వలవో నడి వేసవిలో చలివో
తెలియదుగా ఎవరివో నాకెందుకు తగిలావో
వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్

||పల్లకివై ఓహో ||

చరణం: 2
హోయ్..జల జల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో
గల గల గల సందడితో నా వంతెన కట్టాలోయ్
చిలకల కల గీతంలో తొలి తొలి గిలిగింతలలో
కిల కిల కిల సవ్వడితో కేరింతలు కొట్టాలోయ్
వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్

Previous
Yogi (2007)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Kalakarudu Lyrics
Kalakarudu (2020)
error: Content is protected !!