చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి, చంద్రమోహన్, జయసుధ
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 22.09.1978
పల్లవి:
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరి గుడెసలోదైనా
గాలి ఇసిరికొడితే… ఆ దీపముండదూ
ఆ దీపముండదూ
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
చరణం: 1
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా…
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయెరా…
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా…
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయెరా…
కుడితి నీళ్లు పోసినా…
అది పాలు కుడుపుతాదీ…
కడుపుకోతకోసినా…
అది మనిషికే జన్మ ఇత్తాదీ
బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
చరణం: 2
అందరూ నడసొచ్చిన తోవ ఒక్కటే..
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే..
అందరూ నడసొచ్చిన తోవ ఒక్కటే..
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే..
మేడ మిద్దెలో ఉన్నా…
సెట్టునీడ తొంగున్నా…
నిదరముదరపడినాకా…
పాడిఒక్కటే హ హ వల్లెకాడు ఒక్కటే
కూతునేర్చినోల్ల కులం కోకిలంటరా హ..హ
ఆకలేసి అరసినోళ్లు కాకులంటరా
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరి గుడెసలోదైనా
గాలి ఇసిరికొడితే… ఆ దీపముండదూ
ఆ దీపముండదూ
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జాలది
గానం: జి. ఆనంద్, పి.సుశీల
పల్లవి:
యేలియల్లో యేలియల్లో ఎందాకా…
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా
యేలియల్లో యేలియల్లో ఎందాకా…
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా
ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
ఎన్నెల్లో ఇళ్లేయనా… చుక్కల్లో పక్కేయనా
ఎన్నెల్లో ఇళ్లేయనా… చుక్కల్లో పక్కేయనా
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా
చరణం: 1
ఆలమబ్బు బుగ్గల మీద మెరెపు మెరిసి ఆడినట్టే
నీలికొండ గుండెల మీద వాన చుక్క జారినట్టే
వానచుక్క వాగులైయీ సముద్రాన కలిసినట్టే
వానచుక్క వాగులైయీ సముద్రాన కలిసినట్టే
రోజువారి మోజులన్నీ మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకోనా వడినిండా నేనుండి పోనా
ఓరయ్య నేనాడుకోనా వడినిండా నేనుండి పోనా
యేలియల్లో యేలియల్లో ఎందాకా…
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…
చరణం: 2
రేతిరంతా నిద్దరకాచి కలువపూలు నవ్వినట్టే
రేపుమాపు ఆకాశం ఆకువక్క యేసినట్టే
పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే
పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే
ఊరివైపు తలుపు తీసి తొంగి చూసి నవ్వినట్టే
సంధెల్లో చిందేయనా పొద్దెల్లే ముద్దెట్టనా
సంధెల్లో చిందేయనా పొద్దెల్లే ముద్దెట్టనా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఎన్నెల్లో ఇళ్లేయనా చుక్కల్లో పక్కేయనా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా
యేలియల్లో యేలియల్లో ఎందాకా…
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…
యేలియల్లో యేలియల్లో ఎందాకా…
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…
****** ****** ******
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది
గానం: యస్.జానకి
నోమల్లో మామిల్లా తోట కాడ
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ
నోమల్లో మామిల్లా తోట కాడ
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ
గున్నమామి గుబురుల్లోన కోయిలమ్మా
దాని జిమ్మడి పోను నాతో పోతి పడ్డదమ్మా
నోమల్లో మామిల్లా తోట కాడ
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ
గాలీ ఈల పాటేసీ
ఓణీ పైట జారేసీ
గుల్ల పేరు గుండెల మీద
తుల్లి తుల్లి పడుతంటే
మాయదారి మనసల్లే
మాయదారి మనసల్లే
వాలుగాలి పడవల్లే
నేనురికి గెలిశాను
నే నీ వల్లల్లో
నా పైట చెర సాప చందమామల్లో
నోమల్లో మామిల్లా తోట కాడ
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ
కోత చేను తడుపుకు వస్తుంటె
పంట బోగి పరుగులు పెడుతుంటే
తుంగపూలు చేతులు తగిలీ
బంగరాల సుడులెస్తుంటే
తుంగపూలు చేతులు తగిలీ
బంగరాల సుడులెస్తుంటే
గలగల గోధారి గలగల గోధారి
గడ గడ గొదవే అయ్యి
నేనురికి గెలిశాను
నే నీ వల్లల్లో
నా నీడ నీ వాల్ల చందమామల్లో
నోమల్లో మామిల్లా తోట కాడ
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ
గున్నమామి గుబురుల్లోన కోయిలమ్మా
దాని జిమ్మడి పోను నాతో పోతి పడ్డదమ్మా
నోమల్లో మామిల్లా తోట కాడ
గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ
****** ****** ******
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
బండ మీద బోడి గుండోడి దెబ్బ రామయ్యో రామ చంద్రయ్యా
బొబ్బిలోడి ఇనప గునపాల దిబ్బా రామయ్యో రామ చంద్రయ్యా
బండ మీద బోడి గుండోడి దెబ్బ రామయ్యో రామ చంద్రయ్యా
బొబ్బిలోడి ఇనప గునపాల దిబ్బా రామయ్యో రామ చంద్రయ్యా
దిబ్బమీద దబ్బ పల్లు కాసెరో బియ్యముకేమొ గాని ముందు నాకెరో
రామయ్యో రామ చంద్రయ్యా ఏనద్దయ్యో సోద్యమేందయ్యా
రామయ్యో రామ చంద్రయ్యా ఏనద్దయ్యో సోద్యమేందయ్యా
తాండ్ర పాపయ్యోడు సతికిల్ల పడ్డాడు ఆ దిబ్బ కాడే
ఇజయరామరాజు ఎల్లికిలు పడ్డడు ఆ దిబ్బు కాడే
తాండ్ర పాపయ్యోడు సతికిల్ల పడ్డాడు ఆ దిబ్బ కాడే…ఆ దిబ్బ కాడే
ఇజయరామరాజు ఎల్లికిలు పడ్డడు ఆ దిబ్బు కాడే…ఆ దిబ్బు కాడే
రామ రామ అంటునే రైక తుడిసేస్తావు నీ యబ్బ కొడకా
శివ శివ అంటునే చీర తడిపేస్తావు సుబ్బమ్మ మొగుడా
ఆ దిబ్బ మీద దెబ్బ లాడినోల్లంతా కాడిని కట్టారు కులికెక్కి తన్నేరు
రామయ్యో రామ చంద్రయ్యా ఏనద్దయ్యో సోద్యమేందయ్యా
రామయ్యో రామ చంద్రయ్యా ఏనద్దయ్యో సోద్యమేందయ్యా
బండ మీద బోడి గుండోడి దెబ్బ రామయ్యో రామ చంద్రయ్యా
బొబ్బిలోడి ఇనప గునపాల దిబ్బా రామయ్యో రామ చంద్రయ్యా