చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి, యస్.పి.శైలజ, జి. ఆనంద్
నటీనటులు: శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, శారద, విజయశాంతి, శ్రీగంగ (తెరపరిచయం)
మాటలు ( డైలాగ్స్ ): మోహన్ దాస్
మూలకథ: కొచ్చిన్ అనిఫా
స్క్రిప్ట్: కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: గుత్తా రామినీడు
నిర్మాత: ఆలపాటి రంగారావు
సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్ గోరే
ఎడిటర్: వి.అంకిరెడ్డి
బ్యానర్: శ్రీనాథ్ మూవీస్
విడుదల తేది: 1992
(శోభన్ బాబు ద్విపాత్రాభినయనం)
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:
నింగి నీలాల సాక్షి …. నెల చేలాల సాక్షి
కోటి తారల సాక్షిగా..ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా
తడబడి..పొరబడి..విడివడిపోకు
కౌగిళ్ళు గాలికి విడిచి
నేనంటే నీవని మరచి
నింగి నీలాల సాక్షి …. నెల చేలాల సాక్షి
చరణం: 1
వయసు వచ్చి వేసింది
సొగసు పందిరి నీకోసం
వయసు వచ్చి వేసింది
సొగసు పందిరి నీకోసం
మనసు నీకే కట్టింది
మమత అన్న మాంగళ్యం
కాళ్ళు కడిగే సెలయేళ్ళు
విందు చేసే మావిళ్ళు
చాటు ముద్దుల సాక్షిగా
అవి పాత గురుతుల సాక్షిగా
చరణం: 2
ఇంద్రధనస్సే పంపింది
పెళ్లినాటికి మధుపర్కం
ఇంద్రధనస్సే పంపింది
పెళ్లినాటికి మధుపర్కం
రామచిలకే పలికింది
ప్రేమ పలుకుల శుభమంత్రం
ఎన్నికలలకు కావిళ్ళు
ఎన్ని తపనల కౌగిళ్ళు
రేపు మాపుల సాక్షిగా
అవి రేపు ఆశల సాక్షిగా
నింగి నీలాల సాక్షి …. నెల చేలాల సాక్షి
కోటి తారల సాక్షిగా..ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా
తడబడి..పొరబడి..విడివడిపోకు
కౌగిళ్ళు గాలికి విడిచి
నేనంటే నీవని మరచి
నింగి నీలాల సాక్షి …. నెల చేలాల సాక్షి