ఈనాడే ఏదో అయ్యింది… లిరిక్స్
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: వెంకటేష్ , రేవతి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 12.01.1989
ఓ… ఓ… ఓ… ఓ…
ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగనిది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగింది
అందాలా లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగనిది
నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగింది
నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగింది
ఒకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ అదినా సొమ్మన్నదీ
పరువాలు మీటి… న న న న న
సెలయేటీ తోటి… న న న న న
పాడాలి నేడు… న న న న న
కావాలి తోడు… న న న న న న న న న న…
ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగనిది
సూర్యుని మాపి చంద్రుని ఆపి
వెన్నెల రోజంత కాచింది
సూర్యుని మాపి చంద్రుని ఆపి
వెన్నెల రోజంత కాచింది
పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ
ఎదలోని ఆశ… న న న న న
ఎదగాలి బాసై… న న న న న
కలవాలి నీవు… న న న న న
కరగాలి నేను… న న న న న న న న న న…
ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగనిది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగింది
అందాలా లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగనిది
******* ******** ********
ప్రియతమా నా హృదయమా… లిరిక్స్
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం
గానం: యస్. పి. బాలు
ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతిలయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
నీ పెదవి పైన వెలుగారనీకు
నీకనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా
మహాసాగరాలే నినుమింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు
పది జన్మలైనా ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
******* ******** ********
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు… లిరిక్స్
చిత్రం: ప్రేమ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, చిత్ర
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ..
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటి పెళ్లయింది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు…. ఆహాహాహా…
ఒక్క ముద్దు… ఊహూహూ…
ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే..
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఆ.. ఇవ్వు ఇవ్వు.. ఆహాహాహా..
ఒక్క ముద్దు.. ఊహూహూ..
super app sir
సా??????్స్ copy ??????సు??????న??? ???వ???ాశ??? ???వ్వ???డి sir
Please check Your mail, we gaved answer.
super app sir
సా??????్స్ copy ??????సు??????న??? ???వ???ాశ??? ???వ్వ???డి sir
please check your mail we gave answer
supper app
ఈ సినిమా లో అన్ని పాటలు చాలా అద్భుతమైన సాహిత్యం కలిగి వున్నాయ్. 👌👌👌👌👌