కొత్తగా రెక్కలొచ్చాయేమో… లిరిక్స్
చిత్రం: ప్రేమ చరిత్ర (2007)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
సాహిత్యం:
గానం:
నటీనటులు: యశ్వంత్, మధు శర్మ, సుహాసిని
దర్శకత్వం: ఎస్.వి.హెచ్ మధుసూధన్
నిర్మాత: శ్రీపాడ్ సి హాంచేట్
విడుదల తేది: 2007
కొత్తగా రెక్కలొచ్చాయేమో ఎగిరిపోతోంది మనసు
ఇంతలో ఉప్పెనయ్యిందేమో ఉరకలేస్తోంది వయసు
ఎప్పుడూ లేనిదీ ఎందుకే ఇలా
ఎంతగా చెప్పినా ఆగదే ఎలా
ఎదలోన సడి మొదలైంది మరి జత కోరిన సమయములో..
కొత్తగా ప్రేమ చిగురించాకే ఎగిరిపోతోంది మనసు
గుండెలో ప్రేమ ఉప్పొంగాకే ఉరకలేస్తోంది వయసు
హృదయాన్ని మేల్కొలిపే వేకువ రాగం ప్రేమ ప్రేమ
ఉహల్లో ఊరించే సంధ్యా రాగం ప్రేమ ప్రేమ
కాలాన్ని కరిగించే కమ్మని ఆశల కబురే ప్రేమ
దూరాన్ని తగ్గించే నడకే ప్రేమ పరుగే ప్రేమ
చూపుతో ప్రేమ మొదలంటా ఆగవే అన్న వినదంటా
వెలుతరైపోద అన్నింటా నీడలా రాద వెనువెంటా
తొలి ప్రేమ జడి కురిసింది మరి తొలి చూపుల తరుణములో..
కొత్తగా ప్రేమ చిగురించాకే ఎగిరిపోతోంది మనసు
గుండెలో ప్రేమ ఉప్పొంగాకే ఉరకలేస్తోంది వయసు
ఎప్పుడూ లేనిదీ అందుకే ఇలా
ఎంతగా చెప్పినా ఆగదే అలా
తన భావనలో తన ధోరణిలో విహరించగ గగనములో..
ప్రతిరోజు తనకోసం వెతికించేదే ప్రేమ ప్రేమ
ప్రతిసారి అపురూపం అనిపించేదే ప్రేమ ప్రేమ
ఎన్నాళ్ళు రాస్తున్నా తరగని కావ్యం ప్రేమ ప్రేమ
ఒకసారి విన్నాక మరుపే రాని మంత్రం ప్రేమ
తేనెలో ఉన్న తీపంతా ప్రేమతో సాటి రాదంటా
తారలే ఒక్కటౌతున్నా ప్రేమలా వెలిగిపోవంటా
కడదాక మరి విడిపోను అని మనసిచ్చిన మాట ఇది
కొత్తగా రెక్కలొచ్చాయేమో ఎగిరిపోతోంది మనసు
గుండెలో ప్రేమ ఉప్పొంగాకే ఉరకలేస్తోంది వయసు
ఎప్పుడూ లేనిదీ ఎందుకే ఇలా
ఎంతగా చెప్పినా ఆగదే అలా
ఎదలోన సడి మొదలైంది మరి జత కోరిన సమయములో..