చిత్రం : ప్రేమ కథా చిత్రం 2 (2019)
సంగీతం : జె.బి.(జీవన్ బాబు)
సాహిత్యం : అనంత శ్రీరం
గానం : రాహుల్ శిప్లిగంజ్, రమ్య బెహరా
నటీనటులు: సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా
దర్శకత్వం: హరికిషన్
నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి
విడుదల తేది: 2019
మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా
ఉరుములా ఉరిమిన తొలి ఆశా
వరదలా ఉన్నది వరస
చిలిపి కౌగిలై చేరుకోనా
వలపు ఊపిరై ఉండిపోనా
పెదవి కొమ్మపై వాలిపోనా
మొదటి ప్రేమనై మళ్ళీ పూయనా
ఓఓఓఓఓఓఓ….ఓఓఓఓఓఓ…
మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా
రేయిలా తొలి రేయిలా
గడుపుదాం జీవితం
మరపుకీ మైమరపుకీ
పలుకుదాం స్వాగతం
నేను నీలో అలా
నువ్వు నాలో ఇలా
ఇదేలా… ఓఓఓఓఓ..
ఓఓఓఓఓఓఓ..
మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా
నేలకి చిరుగాలికీ
నడుమ నుండే క్షణం
వెలుగుకి మరి మసకకీ
ముడులు వేద్దాం మనం
నేను నువ్వవ్వగా
నువ్వు నేనవ్వగా..
ఇలాగా… ఓఓఓఓఓఓ..
ఓఓఓఓఓఓ…
మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా